మరోవివాదంలో మహానటి చిత్రం


bindu chandramouli feels about removing her scenes in mahanatiమహానటి చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . అయితే ఈ చిత్రంలో జెమిని గణేశన్ భార్య పాత్ర పుష్పవల్లి పాత్రలో యువనటి బిందు చంద్రమౌళి నటించింది . షూటింగ్ సమయంలో బిందు చంద్రమౌళి – జెమిని గణేశన్ , కీర్తి సురేష్ ల కాంబినేషన్ లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు కానీ సినిమాలో అవన్నీ లేవు .

కేవలం రెండు , మూడు సన్నివేశాలు మాత్రమే బిందు చంద్రమౌళి నటించిన సన్నివేశాలు ఉన్నాయి దాంతో సినిమా రిలీజ్ అయ్యాక వాటిని చూసి కుమిలిపోతోంది బిందు చంద్రమౌళి . నాపైన చిత్రీకరించిన పలు సన్నివేశాలను తొలగించారని అందుకు చాలా బాధగా ఉందని అయితే అది దర్శక నిర్మాతల ఇష్టమని ఇంత గొప్ప సినిమాలో నేను కూడా ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉందని అంటోంది బిందు చంద్రమౌళి . ఇప్పటికే రకరకాల వివాదాలు ఈ సినిమాని చుట్టుముడుతున్నాయి అయితే ఆ వివాదాలు స్వల్పమైనవి కావడంతో మహానటి విజయం ముందు అవి తేలిపోతున్నాయి .