దీన స్థితిలో హీరోయిన్


bollywood actress pooja dadwal wants salman khan helpహీరోయిన్ గా వెలిగిన రోజుల్లో బాగానే బతికింది కానీ రోజులు మారాయి ,ఇప్పుడు దీన స్థితిలో ఉంది బాలీవుడ్ హీరోయిన్ ” పూజా దద్వాల్ ”. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ” వీర్ గాటి ” చిత్రంలో పూజా దద్వాల్ నటించింది , కాగా ఆ చిత్రం 1995 లో విడుదలై సంచలన విజయం సాధించింది . హిందుస్థాన్ , సింధూర్ సౌగంధ్ , వీర్ గాటి లాంటి హిట్ చిత్రాల్లో నటించిన పూజా కొంతకాలం రాజభోగాలనే అనుభవించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఘోరమైన స్థితిలో ఉంది .

 

పూజా దద్వాల్ కు టిబి సోకడంతో ఆమెకు దూరంగా వెళ్లిపోయారు కట్టుకున్న భర్త అలాగే మిగతా కుటుంబ సభ్యులు . ప్రస్తుతం ఈ నటి శివ్ ది హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది . అయితే ఆమె దగ్గర చిల్లి గవ్వా లేకపోవడంతో సల్మాన్ ఖాన్ ని ఆర్ధిక సహాయం చేయమని కోరడానికి ప్రయత్నాలు చేసింది . కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు దాంతో మళ్ళీ సల్మాన్ కోసం ప్రయత్నాలు చేస్తోంది . మరి సల్మాన్ ఖాన్ స్పందిస్తాడో చూడాలి .