టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్


casting couch in tollywoodతెలుగు చలనచిత్ర రంగంలో కాస్టింగ్ కౌచ్ అని ఈమధ్య ఎక్కువగా వినిపిస్తోంది కానీ ఈ దుష్ప్రభావం ఎప్పటి నుండో ఉంది . పలువురు మేనేజర్లు , డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోని వాళ్ళు, హీరోలు , దర్శక నిర్మాతలు ఇలా ప్రతీ ఒక్కరూ ఎవరికి దొరికిన వాళ్ళని వాళ్ళు అనుభవిస్తున్నారు . కొందరేమో అవకాశాలు ఇస్తామని , ఇప్పిస్తామని మహిళలపై అత్యాచారం చేస్తుండగా మరికొందరేమో పెద్ద పెద్ద హోదా లో ఉండటం వల్ల లొంగిపోతున్నారు .

16 ఏళ్ల యువతులను కూడా వదలడం లేదు ఈ కామాంధులు . చివరకు మేనేజర్లు సైతం అమ్మాయిలను , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లను అనుభవిస్తున్నారు . వీళ్ళతో పాటు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ వాళ్ళు సైతం మహిళలను ఆ అవసరం కోసం వాడుకుంటున్నారు . ఇక హీరోయిన్ లు కూడా ఈ బాధ ని విపరీతంగా అనుభవించిన వాళ్ళే ! ఇప్పటికే పలువురు హీరోయిన్ లు ఈ కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసారు . రాధికా ఆప్టే ఏకంగా ఓ దక్షిణాది హీరో అతడి బెడ్ రూమ్ లోకి వచ్చి కోరిక తీర్చమన్నాడని , అసభ్యంగా ప్రవర్తించాడని కానీ నేను గట్టిగా బుద్ది చెప్పానని చెప్పిన విషయం తెలిసిందే . తాజాగా శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి .