8 కోట్ల షేర్ రాబట్టిన ఛలో


chalo 1st week shareనాగశౌర్య హీరోగా నటించిన ఛలో ఫిబ్రవరి 2న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . మొదటి రోజు నుండే పూర్తిగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి వారంలోనే మొత్తం పెట్టుబడిని తెచ్చిపెట్టింది . ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల షేర్ ని వారం రోజుల్లో రాబట్టి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది . కొత్త దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది . ఓవర్ సీస్ లో సైతం మంచి వసూళ్ల ని సాధిస్తూ నాగశౌర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .

మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకొని రెండో వారంలో అడుగుపెట్టింది , అయితే నిన్న రిలీజ్ అయిన గాయత్రి , ఇంటలిజెంట్ చిత్రాలు ఘోర పరాజయం పొందడంతో ఈ వారం కూడా ఛలో మంచి వసూళ్ల ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . నాగశౌర్య – రష్మిక మందాన ల జంట కు ప్రేక్షకులు నీరాజనం పలుకుతుండగా అదే రీతిలో ఉన్న ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాని విజయ బహూటా ఎగిరేలా చేసింది . మొత్తానికి సొంత చిత్రాన్ని తీసిన నాగశౌర్య చాలా సంతోషంగా ఉన్నాడు ఈ విజయంతో .