3 రోజుల్లో మూడున్నర కోట్లు రాబట్టిన నాగశౌర్య


నాగశౌర్య హీరోగా నటించిన ఛలో చిత్రం మొదటి రోజు నుండే పూర్తిగా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . దానికి తోడు నాగశౌర్య సినిమాతో పాటు రిలీజ్ అయిన రవితేజ సినిమా ప్లాప్ కావడంతో మరింత ప్లస్ అయ్యింది ఛలో చిత్రానికి . మొత్తానికి పాజిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో మూడు రోజుల్లోనే మూడున్నర కోట్ల షేర్ ని రాబట్టాడు నాగశౌర్య దాంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది అంతేకాదు విజయయాత్ర కూడా చేపడుతోంది ఆ చిత్ర యూనిట్ .

ఏదో చిన్న సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం కానీ ఇంతపెద్ద హిట్ చేస్తారని అనుకోలేదని ఉప్పొంగిపోతున్నారు దర్శక నిర్మాతలు . నాగశౌర్య సరసన రష్మిక మందాన నటించగా వెన్నెల కిషోర్ , నరేష్ , ప్రగతి తదితరులు ఇతర పాత్రల్లో మెప్పించారు . ఇక సొంత సినిమా సూపర్ హిట్ కావడంతో చాలా సంతోషంగా ఉన్నాడు నాగశౌర్య .