పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ చెప్పిన చరణ్


బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బెస్ట్ విషెష్ తెలియజేసాడు అబ్బాయ్ రాంచరణ్ . జనసేన అధినేత నిన్న చలోరే చలోరే  చలో యాత్ర ని తెలంగాణ లో ప్రారంభించిన విషయం తెలిసిందే . కొండగట్టు అంజన్న ని దర్శించుకొని గుడి అభివృద్ధి కోసం 11 లక్షలను అందజేసిన పవన్ ఆ తర్వాత నిన్న సాయంత్రం మీడియా ముందుకు వచ్చాడు . అయితే తెలంగాణ ప్రభుత్వం పై కానీ కేసీఆర్ పై కానీ ఎటువంటి విమర్శలు చేయకపోవడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి . 
 
ఇక చరణ్ విషయానికి వస్తే …… గతకొంత కాలంగా పవన్ కళ్యాణ్ చిరు కుటుంబానికి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే పైగా అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో ఉన్నాడు , దాంతో పవన్ కళ్యాణ్ కు మద్దతు లభిస్తుందా అనే అనుమానం ఉండేది కానీ చరణ్ బాబాయ్ కి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు .