సైరా యూనిట్ కు వార్నింగ్ ఇచ్చిన చరణ్


chiranjeevi syeraa narasimhareddy look leakedసైరా నరసింహారెడ్డి చిత్రంలోని వర్కింగ్ స్టిల్ ఒకటి లీక్ కావడంతో ఒక్కసారిగా ఆ చిత్ర బృందం షాక్ అయ్యింది . ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ చిరంజీవి , నయనతార లతో పాటుగా మరికొంతమంది ఉన్న స్టిల్ లీక్ కావడంతో చరణ్ కి ఎక్కడా లేని ఆవేశం తన్నుకు వచ్చింది అంతే ! సైరా ….. నరసింహారెడ్డి చిత్ర యూనిట్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట ! ఇలాంటి సంఘటనలు మరోసారి రిపీట్ అయితే సహించేది లేదని చెప్పాడట ఆవేశంగా .

ఎందుకంటే షూటింగ్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ లోని వాళ్ళే ఎవరో ఒకరు ఈ ఫోటో తీసి నెట్ లో పెట్టి ఉంటారని అందుకే సహించేది లేదని అంటున్నాడట చరణ్ . అయితే చరణ్ వెంటనే నెట్ లో ఉన్న లీక్ ఫోటో ని తీయించగలిగాడు . అత్యంత భారీ బడ్జెట్ తో సైరా …. నరసింహారెడ్డి చిత్రం రూపొందుతోంది . ఇక ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు .