సమంత బికినీ పై నెగెటివ్ కామెంట్లు


సమంత బికినీ లో సేదతీరుతున్న స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . గత ఏడాది సమంత అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . నా మీద పెద్ద బరువు బాధ్యతలు వచ్చి పడ్డాయి , నేను వాటిని మోయాలి అంటూ అక్కినేని కుటుంబానికి ఉన్న గౌరవాన్ని ఉటకింస్తూ అప్పట్లో పోస్ట్ చేసింది సమంత . కట్ చేస్తే రంగస్థలం షూటింగ్ ని ముగించుకొని హాయిగా బీచ్ కెళ్ళి ఇలా బికినిలో సేద తీరుతోంది . బికినిలో సమంత మరింత గ్లామర్ గా కనిపిస్తుండటంతో విస్తుపోతున్నారు నెటిజన్లు .

అయితే అదే సమయంలో కొంతమంది సమంత ని ఆడిపోసుకుంటున్నారు కూడా . చైతూ ని పెళ్లి చేసుకొని ఇలా బికినీ ఫోజు లేంటి అంటూ సోషల్ మీడియాలో బాగానే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు . అయితే సమంత ఈ కామెంట్ల గురించి పెద్దగా పట్టించుకునే ఆలోచన చేయడం లేదు ప్రస్తుతం ఈ భామ దృష్టి అంతా ఎంజాయ్ చేయడం మీదనే ఉంది .