దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోడట

సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పట్లో పెళ్లి చేసుకోనని , నేను సుఖంగా ఉండటం మీకిష్టం లేదా ? అని సంచలన వ్యాఖ్యలు చేసి అందరికి షాక్ ఇస్తున్నాడు . దేవిశ్రీ ప్రసాద్ కి ఇప్పడు 38 ఏళ్ళు , అయినప్పటికీ ఇంకా పెళ్లి కాలేదు దాంతో ఈ సంవత్సరమో ? లేక వచ్చే ఏడాదో చేసుకుంటాడు అని అనుకుంటున్నారు గతకొంత కాలంగా . కానీ ఏళ్ళు గడుస్తున్నాయి కానీ దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి మాత్రం కావడం లేదు . 
 
గతంలో హీరోయిన్ ఛార్మి ని పెళ్లి చేసుకోనున్నాడు అని పుకార్లు షికారు చేసాయి కానీ మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అనే రొటీన్ డైలాగ్ ని ఇద్దరు కూడా వాడారు . ఇక దేవి చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం హాయిగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను , ఎంజాయ్ చేయాలంటే పెళ్లి మాత్రమే చేసుకోవాలా ? అంటూ ఎదురు ప్రశ్న కూడా వేస్తున్నాడు . అంతేలే…….  చిలక్కొట్టుడు కొడుతున్నాడుగా ఇంకా పెళ్లి ఎందుకు ?