ప్రభాస్ తో ఆ డైరెక్టర్ కు గొడవ


director denied rumours on saahoప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు కాగా ఆ చిత్రానికి యువ దర్శకులు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు . అయితే సాహో చిత్ర షూటింగ్ సమయంలో సుజిత్ పనితీరు ప్రభాస్ కు నచ్చకపోవడంతో అతడితో గొడవ పడ్డాడని వార్తలు గుప్పుమన్నాయి . ఇప్పుడు ఆ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి అయితే ఈ వార్తలు మరింతగా స్ప్రెడ్ కావడంతో సాహో ప్రాజెక్ట్ పై అపనమ్మకం మొదలు అవుతుంది కాబట్టి మరింత డ్యామేజ్ జరగకముందే స్పందించాలని భావించిన దర్శకులు సుజిత్ ఎట్టకేలకు ట్విట్టర్ కెక్కాడు .

 

ప్రభాస్ కు నాకు ఎటువంటి గొడవ జరగలేదు మా పనులన్నీ వేగంగా సాఫీగా సాగిపోతున్నాయి అంటూ ట్వీట్ చేసాడు సుజిత్ . అత్యంత భారీ బడ్జెట్ తో తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొందుతోంది ఈ చిత్రం . బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు .