ఉదయ్ కిరణ్ బయోపిక్ పై కన్నేసిన డైరెక్టర్ తేజ


director teja planning uday kiran biopicయంగ్ హీరో ఉదయ్ కిరణ్ హీరోగా ఎంటర్ అవ్వడమే ఆలస్యం ఏ హీరోకి దక్కని విధంగా తొలి మూడు చిత్రాలతో సంచలన విజయాలు అందుకొని హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న తొలిహీరో అయ్యాడు . అప్పట్లో అమ్మాయిల గుండెల్లో మంటలు పెట్టిన కుర్రాడు ఉదయ్ కిరణ్ కానీ ఎంత వేగంగా స్టార్ డం ని అందుకున్నాడో అంతేవేగంగా అధఃపాతాలని తొక్కేయ బడ్డాడు , అంతేకాదు చేతిలో సినిమాలు లేక , పలకరించేవారు లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు . ఉదయ్ కిరణ్ ఆత్మహత్య తెలుగునాట సంచలనం సృష్టించింది . ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడు అలాంటిది పెళ్లి కూడా చేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో మెగా కుటుంబం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి .

ఇప్పుడు మహానటి బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుండటంతో దర్శకులు తేజ ఉదయ్ కిరణ్ బయోపిక్ ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడట ! దర్శకులు తేజ – ఉదయ్ కిరణ్ ల కాంబినేషన్ లో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి . పైగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది అందుకే ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఆలోచన చేస్తున్నాడట తేజ . ప్రస్తుతం తేజ కు చేతిలో సినిమాలు లేక ఖాళీగానే ఉన్నాడు కాబట్టి ఉదయ్ కిరణ్ బయోపిక్ పై కూర్చొనే అవకాశం ఉంది . అయితే మెగా కుటుంబం నుండి ఎలా స్పందన ఉంటుందో చూడాలి ఎందుకంటే ఉదయ్ కిరణ్ కు చిరు పెద్ద కూతురు ని ఇచ్చి పెళ్లి చేయాలనీ అనుకున్నారు వివాహ నిశితార్థం కూడా అయ్యింది . కట్ చేస్తే ఆ వివాహం రద్దు అయ్యింది .