మళ్లీ కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్న తేజ

దర్శకులు తేజ అంటేనే అంతా కొత్తవాళ్లతో సినిమాలు చేస్తాడనే విషయం తెలిసిందే. తేజ చేసిన సినిమాల్లో ఎక్కువగా కొత్త వాళ్ళకే ఛాన్స్ లు ఇచ్చాడు కాగా తాజాగా మరోసారి తేజ కొత్తవాళ్లకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు అది కూడా సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాలో తెలుసా. నేనే రాజు నేనే మంత్రి వంటి సూపర్ హిట్ తర్వాత తేజ కు బ్రహ్మాండమైన 2 ఛాన్స్ లు వచ్చాయి.

అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ తో ఎన్టీఆర్ బయోపిక్ సినిమా చేసే ఛాన్స్ రాగా మరొకటి విక్టరీ వెంకటేష్ తో చేసే సినిమా . ఇక వెంకటేష్ సినిమాలో కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు దర్శకుడు తేజ. వెంకటేష్ సినిమాలో ఛాన్స్ అంటే కొత్తవాళ్లకు లక్కీ ఛాన్స్ అన్నమాటే. ఎవరు ఆ లక్కీ ఛాన్స్ కొట్టేస్తారో చూడాలి.