ఎన్టీఆర్ బయోపిక్ పై అప్పుడే అనుమానాలు


director teja walks out from ntr biopicఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకులు తేజ తప్పుకున్నట్లు ప్రకటించాడు దాంతో అసలు ఎన్టీఆర్ బయోపిక్ పూర్తవుతుందా ? రిలీజ్ అవుతుందా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . ఎంతో అట్టహాసంగా ఎన్టీఆర్ బయోపిక్ ని ప్రారంభించారు బాలయ్య , దర్శకులు తేజ అయితే ఈ సినిమాలో బాలయ్య 56 గెటప్ లలో కనిపించాలి కాబట్టి తప్పకుండా వాటికీ ప్రాధాన్యత ఉండాలని బాలయ్య భావించాడట .

కానీ తేజ మాత్రం దాని వల్ల సినిమా నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి పాటలో ఈ గెటప్ లు వచ్చేలా ప్లాన్ చేద్దామని చెప్పాడట కానీ బాలయ్య అందుకు ఒప్పుకోలేదట . అంతేకాకుండా బాలయ్య చెబుతున్న దాని ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ కి నేను న్యాయం చేయలేనని భయపడిపోయాడట తేజ అందుకే సినిమా సరిగ్గా రాకపోతే చేసి తిట్లు తినే కంటే వదిలేస్తే బెటర్ అని డిసైడ్ అయ్యాడట . అందుకే ఎన్టీఆర్ బయోపిక్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు తేజ . ఈ సినిమాకు తేజ కాకుండా రాఘవేంద్రరావు లేదా క్రిష్ దర్శకత్వం చేపట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు మరి .