పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తున్న వివివినాయక్


మాస్ దర్శకులు వివివినాయక్ సినిమాలు మానొద్దు సార్ అంటూ  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు . తాజాగా ఇంటలిజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రి లో జరిగింది కాగా ఆ వేడుకలో పాల్గొన్న వినాయక్ పవన్ కళ్యాణ్ సినిమాలు మానేసి రాజకీయాల్లోనే పోరాటం చేస్తానని అన్నాడు దయచేసి అలా చేయకండి మా లాంటి అభిమానుల కోసమైనా ఎప్పుడో ఒకసారి వీలున్నప్పుడు సినిమా చేయాలనీ కోరుకుంటున్నాను అంటూ వీర లెవల్లో ప్రాధేయ పడ్డాడు . పవన్ కళ్యాణ్ ఇటీవల తెలంగాణ లో పర్యటించిన నేపథ్యంలో ఇక సినిమాల్లో నటించనని స్పష్టం చేయడంతో అతడిపై ఒత్తిడి పెరుగుతోంది .

2019 లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన ని సమాయత్తం చేస్తున్నాడు . గత ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమి కి మద్దతు ఇచ్చి పోటీ చేయలేదు కానీ ఈసారి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అంటున్నాడు పవన్ అందుకే సినిమాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించాడు . దాంతో మెగా ఫ్యాన్స్ పవన్ పై ఒత్తిడి చేస్తున్నారు మరి పవన్ మనసు మార్చుకుంటాడా ? లేదా ? చూడాలి .