ప్లాప్ ఎదుర్కొన్న మోహన్ బాబు

ఈరోజు రిలీజ్ అయిన గాయత్రి చిత్రంతో మరో ప్లాప్ ఎదుర్కొన్నాడు సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు . 540 కి పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన మోహన్ బాబు హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా , కమెడియన్ గా విభిన్న తరహా పాత్రలను ఎన్నింటినో పోషించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు . అయితే గతకొన్నాళ్ళుగా హీరోగా నటుడిగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు మోహన్ బాబు దాంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని మదన్ దర్శకత్వంలో నటించాడు , గాయత్రి అనే సినిమాని నిర్మించాడు .

ఈరోజు రిలీజ్ అయిన గాయత్రి సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది అయితే నటుడిగా మాత్రం మోహన్ బాబు కు మరోసారి మంచి పేరు వచ్చింది . రెండు విలక్షణమైన పాత్రలను మోహన్ బాబు సమర్థవంతంగా పోషించాడని అంటున్నారు . అయితే అనుకున్న విధంగా కమర్షియల్ హిట్ పొందలేక పోయాడు ఇప్పుడు కూడా .