Home Exclusive News
TOLLYWOOD
 EXCLUSIVES

ఎన్టీఆర్ చరణ్ లతో రాజమౌళి మల్టీస్టారర్

బాహుబలి లాంటి సంచలన చిత్రాల తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఎన్టీఆర్ -  రాంచరణ్ లతో . ఈ వార్త వినడానికే అద్భుతంగా ఉంది ఇక ఈ కాంబినేషన్ లో సినిమా అంటే బాక్స్ లు బద్దలు కావాల్సిందే. బాక్సాఫీసు వద్ద నందమూరి బాలకృష్ణ , మెగాస్టార్ చిరంజీవి బోలెడుసార్లు తలపడ్డారు. పైగా ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడంతో భీకరమైన పోరు సాగింది.ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ , చరణ్ లు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు . ఇద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ కెరీర్ విషయానికి వస్తే పోటీ పడుతూనే ఉంటారు. ఇక జక్కన్న విషయానికి వస్తే ఎన్టీఆర్ తో మూడు సినిమాలు , చరణ్ తో తిరుగులేని హిట్ మగధీర సినిమాని చేసాడు. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ సినిమా చేశాడంటే ఇక ఆపతరమా ..... నందమూరి - మెగా కుటుంబాల హీరోలు కలిసి నటిస్తే అభిమానుల సంతోషానికి అంతే ఉండదు. ఈ కాంబినేషన్లో సినిమా వస్తే రికార్డుల మోత మోగడం ఖాయం. 

హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన భామ

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసి సంతోషంగా ఉంది. తెలుగులో ఈ భామ నాని సరసన జెంటిల్ మన్ చిత్రంలో నటించింది. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది అలాగే ఈ భామకు నటిగా గుర్తింపు నిచ్చింది , దాని తర్వాత మళ్ళీ నాని సరసనే నిన్ను కోరి చిత్రంలో నటించింది.ఆ సినిమా కూడా హిట్ ఇక ఇప్పుడేమో స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన జై లవకుశ చిత్రంలో నటించింది. మొన్న రిలీజ్ అయిన జై లవకుశ మంచి వసూళ్ల ని సాధిస్తోంది. జై లవకుశ చిత్రానికి హిట్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది నివేదా థామస్ . వరుసగా తెలుగులో చేసిన మూడు చిత్రాలు కూడా హిట్ అయి హ్యాట్రిక్ విజయాన్ని అందించడంతో నివేదా ఉబ్బితబ్బిబ్బైపోతోంది. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది నివేదా థామస్ . 

బాక్స్ లు బద్దలు కొడుతున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ చిత్రం తో రికార్డుల మోత మోగిస్తున్నాడు. నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన జై లవకుశ కు యునానిమస్ గా హిట్ టాక్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల లో ఎన్టీఆర్ వీర విహారం చేస్తున్నాడు . ఎన్టీఆర్నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయి బ్రహ్మరథం పడుతున్నారు.ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం , రాశిఖన్నా , తమన్నా గ్లామర్ వెరసి జై లవకుశ భారీ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధించేలా ఉంది. దసరా పండగ సెలవులు కూడా తోడు కావడంతో భారీ కలెక్షన్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ జోరు మరో పది రోజుల పాటు కొనసాగేలా ఉంది ఎందుకంటే అక్టోబర్ 4 వరకు దసరా సెలవులు మరి. 

జై లవకుశ పై దుష్ప్రచారం చేస్తున్నారు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాపై అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు కొంతమంది పనిగట్టుకొని. ఈ పని గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా చేశారు. అయితే జై లవకుశ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది కానీ పనిగట్టుకొని మరీ ప్రచారం చేస్తున్నారు.ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కి దూరం కావడంతో ఈ దుష్ప్రచారం మొదలు పెట్టారు.  అయితే జై లవకుశ కి ఆల్రెడీ హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఎంతగా ప్రచారం చేసినా ఫలితం మారదు. జై లవకుశ కు హిట్ టాక్ రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

స్పెషల్ షో వేస్తున్న మహేష్

మహేష్ బాబు నటించిన స్పైడర్ ఈనెల 27న రిలీజ్ అవుతోంది కానీ అంతకంటే 4 రోజుల  ముందుగానే స్పైడర్ షో ని స్పెషల్ గా వేస్తున్నాడు మహేష్, అయితే స్పైడర్  స్పెషల్ షో చూస్తున్న స్పెషల్ గెస్ట్ లు ఎవరో తెలుసా......... ఇంకెవరు మహేష్ కుటుంబమే .సూపర్ స్టార్ కృష్ణ తో పాటుగా మహేష్ బావలు , సోదరీమణులు , అలాగే ఇతర కుటుంబ సభ్యులు స్పైడర్ ని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా చూడనున్నారు. మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై రిలీజ్ కి ముందే పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. పైగా బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహించాడు. కాగా రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ సరసన నటించింది. 

మహేష్ ఎంతపని చేస్తున్నాడో తెలుసా

సూపర్ స్టార్ మహేష్ బాబు కు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదు కానీ కృష్ణ మాత్రం కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆపార్టీ లో చేరి పార్లమెంట్ సభ్యుడు కూడా అయ్యాడు. ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించాడు కూడా . కట్ చేస్తే ఎన్టీఆర్ లేడు , కృష్ణ కూడా రాజకీయాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడేమో మహేష్ వంతు వచ్చింది. మహేష్ కు నేరుగా రాజకీయాలంటే ఇష్టం లేదు కాబట్టి నేరుగా రాజకీయాలలోకి రాడు కానీ జగన్ పార్టీ కి సహాయం చేసే పనిలో ఉన్నాడు.nదర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో తాజాగా మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా వై ఎస్ జగన్ ని సపోర్ట్ చేసేలా తీస్తున్నారు. కొరటాల శివ బంధువు పోసాని కాగా ఆ పోసాని కృష్ణ మురళి బహిరంగంగా జగన్ కు సపోర్ట్ చేస్తున్నానని ప్రకటించడమే కాకుండా అతడి తరుపున ప్రచారం చేస్తానని కూడా అన్నాడు. అలా జగన్ కు ప్రయోజనం కలిగించడానికి వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి అయ్యేలా దోహదపడటానికి ఈ సినిమా చేస్తున్నారట. మహేష్ బావ గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నాడు . పైగా తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచాడు. మహేష్ జగన్ కోసం చేస్తున్న సినిమా భరత్ అనే నేను అని అప్పుడే ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయాలపై మహేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

రిలీజ్ రోజే కేబుల్ టివిలో కూడా వచ్చేసింది

పైరసీ ఎంత దారుణంగా ఉందంటే ఒక్కోసారి సినిమా రిలీజ్ కాకముందే నెట్ లో దర్శనం ఇస్తోంది సినిమా . ఇక రిలీజ్ అయిన రోజు నుండి పైరసీ బారి నుండి సినిమాని కాపాడటం దర్శక నిర్మాతలకు తల ప్రాణం తోక లోకోస్తోంది . ఇప్పటికే పలు సినిమాలు పైరసీ బారిన పడగా తాజాగా బాలీవుడ్ వివాదాస్పద  చిత్రం ''ఉడ్ తా పంజాబ్ '' కూడా పైరసీ బారిన పడింది . ఇక తమిళనాడు లోని ఓ కేబుల్ టివిలో అయితే ఏకంగా మొత్తం సినిమానే వేసారు . ఈ విషయన్ని తమిళ స్టార్ హీరో సూర్య స్వయంగా వెల్లడించాడు . పుదుచ్చేరి లోని లోకల్ కేబుల్ టివిలో ఈ సినిమా ప్రసారం అయ్యింది . దాంతో చిత్ర పరిశ్రమ తీవ్ర షాక్ కి గురయ్యింది . సినిమా పై వందల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని ఇలా పైరసీ బారిన పడితే అందరూ రోడ్డున పడతారని కాబట్టి పైరసీ ని ఎంకరేజ్ చేయొద్దని కోరుకుంటున్నారు . 

రజిని కాంత్ అనారోగ్యం పై క్లారిటీ

సూపర్ స్టార్ రజినీకాంత్ కు అనారోగ్యం తలెత్తడం వల్ల అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ చేయించు కుంటున్నాడని అందువల్లే కబాలి చిత్రం ఆడియో వేడుకను నిర్వహించడం లేడని గత రెండు మూడు రోజులుగా మీడియాలో ఒకటే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో పక్క  రజినీ తన ఫ్యామిలీ తో కలిసి అమెరికాకు వెకేషన్ ట్రిప్ వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో వీటిల్లో ఏ వార్త నమ్మాలో లేదో అభిమానులు గందర గోళం లో పడ్డారు.n nఅయితే ఇలా వస్తున్న వార్తల పై తాజాగా ఓ క్లారిటీ వచ్చేసింది. రజినీ కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్ తో రజినీ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న విషయం ఇప్పుడు తెలిసి పోయింది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు అమెరికా రోడ్ల పై కలిసి నడుస్తున్నప్పుడు దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ ఐశ్వర్య " నాన్న తో అలా సరదాగా మాట్లాడుతూ అమెరికా రోడ్ల పై నడుస్తున్నా" అంటూ ట్వీట్ చేసింది.n nసో......దీంతో రజినీ అనారోగ్యం పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడిందనే చెప్పాలి.

23 లిప్ లాక్ సీన్లు ఉన్నాయట ఆ సినిమాలో

రోజు రోజుకి ప్రేక్షకుల అభిరుచి మారి పోతుండటంతో , వాళ్ళ అభిరుచి మాట ఏమో గాని కుర్రకారు ని బాగా ఆకర్షించడానికి లిప్ లాక్ సీన్లు , ఎక్స్ పోజింగ్ సీన్ల ని అలాగే ఘాటు రొమాన్స్ సీన్లని బాగానే ఇరికిస్తున్నారు దర్శక నిర్మాతలు . తాజాగా బాలీవుడ్ లో రూపొందుతున్న చిత్రం ''బేఫికర్ ''. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ - వాణీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఏకంగా 23 లిప్ లాక్ సీన్లు ఉన్నాయట . ఇక లిప్ లాక్ సీన్ల కోసం దాదాపు వంద సార్లు టేక్ ల మీద టేక్ లు తీసుకున్నారట రణ్ వీర్ సింగ్ - వాణీ కపూర్ లు . అయితే సినిమాలో కనిపించేది మాత్రం 23 సార్లే . ఈ లిప్ లాక్ సీన్లు యూత్ కి మాంచి కిక్ ఇస్తాయని ధీమాగా ఉన్నారు దర్శక నిర్మాతలు . డిసెంబర్ 9 న రిలీజ్ కానున్న ఈ బేఫికర్ కుర్రకారు కి మంచి పసందునే ఇవ్వనుందట . 

రాసలీలల వీడియో ఆమె దగ్గర ఉందట

మహిళలకు అండగా నిలవాల్సిన ఓ మంత్రి ఏకంగా మహిళలని లోబరుచుకొని అధికార దాహంతో రాసలీలలు సాగిస్తూ ఓ మహిళా పొలీస్ అధికారికి అడ్డంగా దొరికి పోయాడట . అయితే అధికార మదంతో రాజీనామా చేయకుండా సదరు మహిళా పొలీస్ అధికారిపై వత్తిడి తెస్తున్నాడు . అయితే ఎంతటి వత్తిడి వచ్చినా వెనుకడుగు వేసేది లేదని ఒకవేళ నన్ను చంపినా దెయ్యమై పగ తీర్చుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనుపమా షెనాయ్ . కార్మిక శాఖా మంత్రి పరమేశ్వర నాయక్ అనుపమా షెనాయ్ ని బెదిరించి రాసలీలల వీడియో ఇవ్వమని ఒత్తిడి చేస్తుండటంతో 5 రోజుల పాటు అజ్ఞాతం లోకి వెళ్ళిన అనుపమా సడెన్ గా మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది . పరమేశ్వర నాయక్ రాజీనామా చేయకపోతే ఆయన సాగించిన రాసలీలల వీడియో బహిర్గతం చేస్తానని అంటోంది ఈ పొలీస్ అధికారి . మరి ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .

రాఘవేంద్రరావు పై దాడి

శతాధిక చిత్రాల దర్శకుడు కే రాఘవేంద్రరావు పై దాడి జరిగింది , అయితే ఈ ఘటనలో రాఘవేంద్రరావు కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ ఆయన ఇంట్లో ఉన్న కార్లు ,అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి దాంతో రాఘవేంద్రరావు తీవ్ర మానసిక ఆందోళన కు గురయ్యాడు . నిన్న జరిగిన ఈ ఘటన తో ఒక్కసారిగా సినిమా రంగం వాళ్ళు షాక్ అయ్యారు . అనంతపురం జిల్లా కు చెందిన వల్లిపి రవీంద్ర నిన్న ఉదయం రాఘవేంద్రరావు ఇంటికి వచ్చి శ్రీరామదాసు చిత్ర కథ తనదేనని ,దాన్ని మీకు 2003లోనే పంపించానని కానీ మీరేమో జేకే భారవి పేరు పెట్టారని ఆరోపిస్తూ రాఘవేంద్రరావు తో వాదులాటకు దిగాడట ! అయితే రాఘవేంద్రరావు అతడితో గొడవ ఎందుకని బయటకు వెళ్ళిపోగా రవీంద్ర అనేవాడు ఆ పక్కనే ఉన్న ఓ రాడ్ అందుకొని రాఘవేంద్రరావు ఇంట్లోకి చొరబడి కార్ల అద్దాలను ద్వంసం చేయడమే కాకుండా ఇంటి అద్దాలను సైతం ద్వంసం చేసాడు . దాంతో ఇంటి వాచ్ మన్ , రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ రవీంద్ర ని ఓ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు . కాగా పోలీసులు రవీంద్ర ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . ఈ సంఘటనతో రాఘవేంద్రరావు కుటుంబం షాక్ కి గురయ్యింది . 

రాఘవేంద్రరావు పై దాడి

శతాధిక చిత్రాల దర్శకుడు కే రాఘవేంద్రరావు పై దాడి జరిగింది , అయితే ఈ ఘటనలో రాఘవేంద్రరావు కు ఎటువంటి గాయాలు కాలేదు కానీ ఆయన ఇంట్లో ఉన్న కార్లు ,అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి దాంతో రాఘవేంద్రరావు తీవ్ర మానసిక ఆందోళన కు గురయ్యాడు . నిన్న జరిగిన ఈ ఘటన తో ఒక్కసారిగా సినిమా రంగం వాళ్ళు షాక్ అయ్యారు . అనంతపురం జిల్లా కు చెందిన వల్లిపి రవీంద్ర నిన్న ఉదయం రాఘవేంద్రరావు ఇంటికి వచ్చి శ్రీరామదాసు చిత్ర కథ తనదేనని ,దాన్ని మీకు 2003లోనే పంపించానని కానీ మీరేమో జేకే భారవి పేరు పెట్టారని ఆరోపిస్తూ రాఘవేంద్రరావు తో వాదులాటకు దిగాడట ! అయితే రాఘవేంద్రరావు అతడితో గొడవ ఎందుకని బయటకు వెళ్ళిపోగా రవీంద్ర అనేవాడు ఆ పక్కనే ఉన్న ఓ రాడ్ అందుకొని రాఘవేంద్రరావు ఇంట్లోకి చొరబడి కార్ల అద్దాలను ద్వంసం చేయడమే కాకుండా ఇంటి అద్దాలను సైతం ద్వంసం చేసాడు . దాంతో ఇంటి వాచ్ మన్ , రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ రవీంద్ర ని ఓ గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు . కాగా పోలీసులు రవీంద్ర ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు . ఈ సంఘటనతో రాఘవేంద్రరావు కుటుంబం షాక్ కి గురయ్యింది . 

హీరోలందరినీ తిడుతున్న వీడియో సంచలనం రేపుతోంది

తెలుగులో ఇప్పుడున్న అగ్ర హీరోలంతా యాక్టింగ్ రాని వాళ్ళే నని కేవలం బ్యాగ్రౌండ్ వల్ల మాత్రమే వాళ్ళు హీరోలుగా రాణిస్తున్నారని ఓ ఇద్దరు యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ''ఐ హేట్ హీరోస్ '' అనే వీడియో రూపొందించి యు ట్యూబ్ లో పెట్టారు . ఆ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది . చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూ .ఎన్టీఆర్ లలో ఏ ఒక్కరినీ వదలకుండా తిడుతూ రూపొందించిన వీడియో కాస్త అతిగానే ఉంది . వాళ్ళపై ద్వేషం ఉంటే మరోలా చేయొచ్చు కానీ ఏకంగా వాళ్ళ ని తిట్టడమే కాకుండా వాళ్ళకు యాక్టింగ్ రాదంటూ వాళ్ళ ఫోటోలను తగులబెట్టడం ఏమి బాగోలేదు . అయినా వాళ్ళకు యాక్టింగ్ రాదు అంటూ చేసిన ఈ వీడియో లో చేసిన ఇద్దరికీ సరైన యాక్టింగ్ రాలేదు ఇదీ మరీ విచిత్రం .అగ్ర హీరోలకు యాక్టింగ్ రాలేదు అని విమర్శ చేసినప్పుడు వీళ్ళు కొద్దిగానైనా యాక్టింగ్ చేస్తే బాగుండేది . అయితే ఏతా ......వాతా చెప్పొచ్చేదేమంటే ఇండస్ట్రీ మొత్తం వారసులతో నిండిపోయింది అని . <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/1TJdHASoMPY" frameborder="0" allowfullscreen></iframe>

నడిరోడ్డు మీద రెచ్చిపోయిన సుడిగాలి సుదీర్

జబర్దస్త్ షోతో తెగ పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ నిన్న రాత్రి ఫిలింనగర్ లోని మెయిన్ రోడ్డు పై వీరంగం వేసాడు . తన కారుని డీ కొట్టారని ఓ కారు వాళ్ళని ఆపి మరీ వాళ్ళపై బూతుల వర్షం కురిపించాడు . ఇక ఈ తతంగమంతా ఓ మీడియా వాళ్ళు రికార్డ్ చేస్తుండటం తో సుధీర్ కోపం మరింత నషాళానికి ఎక్కింది అంతే ''మీరు మీడియా అయితే ఏంటి ? నన్నేం పీకలేరు ? అంటూ మీడియా మీదకు కూడా వచ్చాడు . జబర్దస్త్ తో పాపులర్ కావడంతో నాలుగు డబ్బులు వచ్చేసరికి గురుడి కళ్ళు నెత్తి మీదకు వచ్చాయి . అందుకే కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోతున్నాడు . 

అ .... ఆ మొదటి రోజు వసూళ్లు

త్రివిక్రమ్ బ్రాండ్ ఉండటం వల్ల మొదటి రోజునే ''అ .... ఆ '' చిత్రం భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టిస్తోంది . నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన చిత్రంగా ''అ ..... ఆ '' నిలిచింది . ఓవర్సీస్ లో కేవలం ప్రీమియర్ షోలతోనే ఒక కోటి అరవై తొమ్మిది లక్షలను వసూల్ చేసినట్లు ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్ష్ ట్వీట్ చేసాడు . మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ఓవర్సీస్ కలిపి 6 కోట్ల కు పైగా వసూళ్ళ ని సాధించి ఔరా ! అనిపించింది ఈ ''అ ... ఆ ''. ఏరియాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి నైజాం -  2. 30 కోట్లు సీడెడ్ - 75 లక్షలు కృష్ణా - 40 లక్షలు గుంటూరు - 47 లక్షలు ఈస్ట్ -   56 లక్షలు వెస్ట్ -  50 లక్షలు నెల్లూరు - 20 లక్షలు 

సాటిలైట్ రైట్స్ లో సంచలనం సృష్టించిన అ ... ఆ

నితిన్ - సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ''అ .... ఆ '' చిత్రం సాటి లైట్ రైట్స్ విషయంలో సంచలనం సృష్టించింది . ఏకంగా అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడుతూ 6కోట్ల రూపాయల ధర పలికింది , దాంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు అయితే ఈ మ్యాజిక్ ఫిగర్ రావడానికి కారణం ఎవరో తెలుసా  ..... ...... ఇంకెవరు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ . అవును త్రివిక్రమ్ బ్రాండ్ వల్ల ఈ రేటు పెట్టి హక్కులను సొంతం చేసుకుంది జీ తెలుగు చానల్ . ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా కు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది . సమంత గ్లామర్ , పెర్ఫార్మెన్స్ , నితిన్ యాక్టింగ్ , రావు రమేష్ ల కామెడి , మిక్కీ జే మేయర్ పాటలు త్రివిక్రమ్ దర్శకత్వ ప్రతిభ వెరసి అ .. ఆ హిట్ గా నిలిచింది . 

నిహారిక నిజంగానే ఇబ్బంది పెడుతోందా

మెగా డాటర్ నిహారిక పై అప్పుడే విమర్శలు , అసహనం పెరిగిపోతున్నాయి . యాంకర్ గా తనని తాను ప్రూవ్ చేసుకొని వెబ్ సిరీస్ కూడా చేసి ఇప్పుడు ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది . అయితే నిహారిక దర్శక నిర్మాతలకు సరిగా సహకరించడం లేదని విమర్శలు గుప్పుమంటున్నాయి . పైగా హీరో కూడా కొంతవరకు అలుగుతున్నాడట ఎందుకంటే పేరు మొత్తం నిహారిక కె వస్తోంది నేను నామమాత్రం అయిపోయానే అని బాధపడుతున్నాడట నాగ శౌర్య . సినిమా ఈనెల 24న అని ప్రకటించారు కానీ నిహారిక డబ్బింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ చేయలేదట దాంతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి . మొదటి సినిమాతోనే ఇలా చేస్తే కష్టమే మరి . 

అ ... ఆ పైరసీదారుడి అరెస్ట్

నిన్న రిలీజ్ అయిన ''అ .... ఆ '' చిత్రాన్ని యుఎస్ లో చూస్తున్న ఓ స్టూడెంట్ నేరుగా దాన్ని పైరసీ చేస్తూ పేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండటం తో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేసారు . చికాగో లోని మువికో రోజ్ మాంట్ లో ''అ ..... ఆ '' ప్రీమియర్ షో చూస్తున్న ఓ ఇండియన్ స్టూడెంట్ ఈ దుస్సాహసానికి పాల్పడ్డాడు . సినిమా చూస్తూ పేస్ బుక్ ద్వారా ఆ వీడియో అంతా పెట్టడంతో హైదరాబాద్ లోని యాంటీ పైరసీ సెల్ త్వరగా స్పందించి అక్కడి థియేటర్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేసింది . దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు సదరు స్టూడెంట్ ని అరెస్ట్ చేసారు . ఇక సినిమా కొంత భాగమే పైరసీ అయునప్పటికి ఆ లింక్ లన్నీ ఏవి లేకుండా డిలీట్ చేసారు . మొదటి రోజే ఇలా జరగడంతో ఖంగుతిన్నారు చిత్ర యూనిట్ . 

సూర్య పై పెట్టిన కేసు వాపస్ తీసుకున్నారు

తమిళ స్టార్ హీరో సూర్య పై పెట్టిన కేసు ని ఇద్దరు యువకులు వాపస్ తీసుకున్నారు . ఇటీవల ఓ మహిళపై ఇద్దరు యువకులు గొడవకు దిగిన సమయంలో అదే రోడ్డున వెళుతున్న సూర్య జోక్యం చేసుకొని ఆ యువకులకు బుద్ది చెప్పి తన అసిస్టెంట్ ని లేడి కి రక్షణగా ఇంటి వరకు పంపించడంతో సూర్య రీల్ హీరోనే కాదని రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . ఇక ఆ ఇద్దరు యువకులు పోలీసులను ఆశ్రయించి సూర్య పై కేసు పెట్టిన విషయం సదరు మహిళ దృష్టికి రావడంతో వెంటనే పోలిస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పి సూర్య తప్పులేదని చెప్పడంతో రియలైజ్ అయిన ఆ యువకులు సూర్య పై పెట్టిన కేసు ని వాపస్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు . దాంతో కేసు గొడవ పోయి సూర్య పై ప్రశంసలు కురుస్తున్నాయి . 

75 కోట్ల వసూళ్ళ తో సంచలనం సృష్టిస్తున్న సైరత్

మరాఠీ భాషలో బాహుబలి లాంటి సినిమా దున్నేస్తోంది , బాహుబలి లాంటి సినిమా అనగానే అదే కాన్సెప్ట్ అనుకునేరు ! బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లను వసూల్ చేసి సంచలనం సృష్టించినట్లుగా మరాఠీ భాషలో 50 కోట్ల వసూల్లే గగనం అని అనుకుంటున్న సమయంలో ఓ ప్రేమకథా చిత్రం ఏకంగా 75 కోట్లను కొల్లగొట్టడమే కాకుండా వంద కోట్ల మైలురాయి వైపు పరుగులు తీస్తోంది . ఇంతకీ ఇంత సంచలనం సృష్టిస్తున్న చిత్రం ఏంటి ? అనే కదా మీ ప్రశ్న . ''సైరత్ '' నాగరాజ్ మంజులే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ''సైరత్ '' మరాఠీ భాషలో ఘనవిజయం సాధించడమే కాకుండా కొత్త రికార్డులను సృష్టిస్తోంది . అంతేకాదు జాతీయ స్థాయిలో స్పెషల్ జ్యూరీ అవార్డ్ ని సైతం అందుకొని సంచలనం సృష్టించింది . తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అయి వంద కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులు తీస్తోంది . 

క్రేజీ చాన్స్ పట్టేసిన చందమామ

అనడమ భామ కాజల్ అగర్వాల్  ఆ మధ్య తెలుగు సినిమాల్లో అసలు కనిపించలేనే లేదు దీంతో ఇక కాజల్ పని అయిపోయిందని అంత అనుకున్నారు, కాని ఇంతలోనే అందరిని ఆశ్చర్య పరుస్తూ  తెలుగు బడా హీరోలు అయిన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ల చిత్రాలలో చాన్స్ కొట్టేసి తన సత్తా నిరూపించుకుంది. కాని ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంతో పాటు బ్రహ్మోత్సవం చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద దెబ్బ కొట్టేశాయి. దీంతో మళ్ళి కాజల్ కథ అయిపోయిందని అంటూ విమర్శలు మొదలయ్యాయి.n nదిమ్మతిరిగి పోయే అదృష్టం ఈ భామకు ఉండడంతో మరో బడా క్రేజీ ప్రాజెక్ట్ ను పట్టేసింది. తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ , తనతో వీరమ్, వేదాలం చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో మొదటి హీరోయిన్ గా బొమ్మాలి అనుష్క ఫైనల్ కాగ, రెండో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు మేకర్స్.

ఓవర్సీస్ ని ఆదుకోవాల్సింది ఇప్పుడు త్రివిక్రమే

ఈ ఏడాది సమ్మర్ కానుకగా వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.  సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తో మొదలు బ్రహ్మోత్సవం వరకు ఓవర్సీస్ బయ్యర్స్ కు భారీ దెబ్బలే తగిలాయి ఈ ఏడాది. ఇక్కడ ఓ మోస్తారు వసూళ్లు సాధించిన చిత్రాలు అక్కడ కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం అయిన వెనక్కి తిసుకోచ్చేలా కూడా ఆడలేదు. దీంతో ఓవర్సీస్ బయ్యర్స్ చాలా నష్టాలను చూడాల్సి వచ్చింది.n nఇది ఇలా ఉంటె సమ్మర్ చివర్లో విడుదల అవుతున్న త్రివిక్రమ్ 'అ...ఆ' పై న అక్కడి బయ్యర్స్ బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అత్తారింటికి దారేది మొదలు మొన్నటి సన్నాఫ్ సత్యమూర్తి వరకు త్రివిక్రమ్ సినిమాలు ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ వసూల్లని సాధించాయి. దీంతో తాజాగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అ...ఆ చిత్రం పై అంచనాలు బాగానే ఉన్నాయి. అందులో టిజర్ మొదలుకొని త్రాలర్ వరకు అన్ని సినిమాపై ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉండడంతో ఈ అ..ఆ చిత్రాన్ని అక్కడ దాదాపు 130 స్క్రీన్స్ లలో విడుదల చేస్తున్నారు.మొత్తంగా సమ్మర్ సినిమాలన్నీ ఓవర్సీస్ బయ్యర్స్ కు నష్టల్నే చూపించడంతో ఇప్పుడు త్రివిక్రమ్ అయిన ఓవర్సీస్ బయ్యర్స్ ని  ఆదుకుంటాడని అనుకుంటున్నారు. మరి చూద్దాం త్రివిక్రమ్ ఎం చేస్తాడనేది.

అల్లు అర్జున్ సరైనోడు టోటల్ ఫైనల్ కలెక్షన్స్

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన సరైనోడు చిత్రం గత నెల ఏప్రిల్ 22న విడుదలై మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపి వదిలిపెట్టింది. దీంతో మరో సారి స్టైలిష్ స్టార్ సత్తా ఏంటనేది తెలిసిపోయింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ మాస్ యాంగిల్ యాక్షన్ హైలెట్ గా నిలిచింది. దీనికి తోడు బోయపాటి పండించిన యాక్షన్ సీన్స్ మరో హైలెట్ అని చెప్పవచ్చు. దీంతో ఓవరాల్ గా సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సరైనోడు చిత్రం విడుదలై ఇప్పటికి 40 రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు సరైనోడు బిజినెస్ క్లోజ్ అయినట్లే. ఈ 40 రోజుల్లో సరైనోడు సాధించిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.n nనైజంలో                   -   19. 00 కోట్లు nసీడెడ్ లో                 -   11. 00 కోట్లు nవైజాగ్ లో                -  8. 00 కోట్లు nఈస్ట్ లో                   -  5. 15 కోట్లు nవెస్ట్ లో                    -  4. 40 కోట్లు nకృష్ణా లో                  -   4. 05 కోట్లు nగుంటూరు లో           -   5. 30 కోట్లు nనెల్లూర్ లో               -   2. 29 కోట్లు nరెస్ట్ ఆఫ్ ఇండియా   -    1.60 కోట్లుnకర్ణాటక                   -  8.00 కోట్లు nఓవర్సీస్                 -  5.25 కోట్లు  nతెలుగు మరియు nహిందీ శాటిలైట్ రైట్స్ - 16.00 కోట్లు  n nమొత్తం                  -  90.00 కోట్లు

హీరో సూర్య పై కేసు నమోదు

తమిళ స్టార్ హీరో సూర్య పై తమిళనాడు లోని జె 5 శాస్త్రి నగర్ పొలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది . సూర్య లెనిన్ ఇమాన్యు యెల్ పై చేయి చేసుకున్నాడని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదు అయ్యింది . సంఘటన వివరాలలోకి వెళితే ......... లెనిన్ ఇమాన్యుయెల్ (25) తన స్నేహితుడైన ప్రేమ్ కుమార్ (21) తో కలిసి ఫుట్ బాల్ ఆడేందుకు బైక్ పై వెళుతున్న సమయంలో ఆధ్యార్ ప్రాంతం లో సడెన్ గా ఓ కారు వచ్చి బైక్ ని డాష్ ఇవ్వడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి  బైక్కొంత భాగం దెబ్బతింది దాంతో డబ్బులు ఇవ్వమని అడుగుతున్న సమయంలో హీరో సూర్య వచ్చి అనవసరంగా చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు . అయితే సూర్య మేనేజర్ కథనం మరోలా ఉంది , రోడ్డు పై ట్రాఫిక్ నిలిచిపోతోంది పైగా లేడి ని పట్టుకొని వేధించడం తప్పు అని సర్దిచేప్పాడని అంటున్నాడు . మరి పోలిసులు దర్యాప్తు చేసి ఏమని తెలుస్తారో చూడాలి 

కబాలి తెలుగు రైట్స్ ఎంత పలుకుతోందో తెలుసా

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా కబాలి టీజర్ తో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . ఒక్క టీజర్ తోనే యావత్ చిత్ర పరిశ్రమని షేక్ చేసిన రజనీ కబాలి చిత్రంతో ఎన్ని సంచలనాలు సృస్టించనున్నాడో అన్న చర్చ నడుస్తోంది . 60 ప్లస్ లో కూడా అదే జోరు చూపించడానికి రెడీ అవుతున్నాడు రజనీకాంత్ . కబాలి చిత్రం సంచలన విజయం సాధించడం ఖాయమని భావించిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఆ చిత్రాన్ని సొంతం చేసుకోవడానికి తీవ్రంగా పోటీ పడుతున్నారు . ఇక తెలుగు హక్కుల విషయానికి వస్తే ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది దాంతో తెలుగు హక్కుల కోసం 30 కోట్లు పలుకుతోందట. రజనీ కి ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే . దాంతో కబాలి పై భారీ అంచనాలు నెలకొన్నాయి . జూలై 1న కబాలి భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 

మహేష్ -ప్రభాస్ లలో ఆ అవార్డ్ ఎవరిని వరిస్తుందో

సైమా ఉత్తమ నటుడి అవార్డ్ ల రేసులో మహేష్ బాబు , ప్రభాస్ లు తీవ్రంగా పోటీ పడుతున్నారు . ఇప్పటికే చెరో నలభై వేల ఓట్లతో నువ్వా - నేనా అన్నట్లుగా ఉన్నారు . ఈ అవార్డు లను జూన్ 30 న అలాగే జూలై 1న సింగపూర్ లో ప్రధానం చేయనున్నారు . రకరకాల కేటగిరీ లలో నామినీస్ పోటీ పడుతుండగా ఉత్తమ నటుడి అవార్డ్ రేసులో మాత్రం ఈ ఇద్దరే ముందంజ లో ఉన్నారు . మహేష్ , ప్రభాస్ లతో పాటు అల్లు అర్జున్ , నాని , వరుణ్ తేజ్ లు ఉత్తమ నటుడి అవార్డ్ కోసం పోటీ పడుతున్నారు . శ్రీమంతుడు చిత్రంలోని నటనకు గాను మహేష్ నామినేట్ అవగా బాహుబలి చిత్రానికి గాను ప్రభాస్ నామినేట్ అయ్యాడు . ఇక అల్లు అర్జున్ రుద్రమదేవి చిత్రంలోని గోన గన్నారెడ్డి పాత్ర కు గాను నామినేట్ అయ్యాడు . 

అఖిల్ సినిమాకు ఇంకా కష్టాలు తీరలేదా

అక్కినేని అఖిల్ సిసింద్రీ గా మెప్పించి మనం తో స్టార్ హీరో అయ్యే లక్షణాలు ఉన్నాయని ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్నాడు కానీ హీరోగా పరిచయమైన అఖిల్ సినిమాతో మాత్రం దారుణంగా దెబ్బ తినడంతో అప్పటి నుండి మరో సినిమా చేయకుండా పలు అవస్థలు పడుతున్నాడు . అదిగో ఫలానా దర్శకుడి తో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చే లోగా ఆ దర్శకుడి స్థానంలో మరో దర్శకుడు వచ్చి చేరుతున్నాడు . ఇదంతా హీరోగా నటించిన మొదటి సినిమా ఘోర పరాజయం పొందడం వల్లే ! అయితే జాగ్రత్తలు తీసుకోవాలి కానీ మరీ అతి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మొదటికే ముప్పు రావడం ఖాయం . అమావాస్య రోజున సినిమా రిలీజ్ చేసి అమావాస్య చంద్రుడి లా మారిపోయాడు అఖిల్ . ఒక్క పరాజయం ఎంత పని చేసిందో చూడు ........... రెండో సినిమా చేయాలంటేనే భయపడిపోతున్నాడు అఖిల్ . 

ఎన్టీఆర్ సిఎం ని కలవడం లేదట

జనతా గ్యారేజ్ షూటింగ్ నిమిత్తం చెన్నై వెళ్ళిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ని కలుస్తారని వార్తలు వచ్చాయి ,అయితే వాటిని ఖండిస్తోంది ఆ చిత్ర యూనిట్ . ఎన్టీఆర్ ఇక్కడకు వచ్చింది షూటింగ్ కోసమని , ఆ పని పూర్తిచేసుకొని తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతామని అంతేకాని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ని కలుస్తున్నట్లు వస్తున్న వార్తలు అబద్దమని తెలిపారు . ఇటీవలే తమిళనాట అసెంబ్లీ కి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే . భారీ మెజారిటీ తో జయలలిత మళ్ళీ అధికార పగ్గాలను చేపట్టారు . కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ ఈ జనతా గ్యారేజ్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే . 

తమిళ చిత్రానికి మహేష్ డబ్బింగ్ చెబుతాడట

త్వరలో మురుగదాస్ -మహేష్ కాంబినేషన్ లో ప్రారంభమయ్యే సినిమా త్రి భాషా చిత్రంగా రూపొందుతున్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , హిందీ బాషలలో రూపొండుతున్డటం తో తెలుగు తో పాటు తమిళ్ లో కూడా మహేష్ డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాడట ఎందుకంటే మహేష్ పుట్టింది ,పెరిగింది అంతా చెన్నై లో కాబట్టి మహేష్ కు తమిళ్ బాగానే వస్తుంది దాంతో తమిళ్ చిత్రానికి డబ్బింగ్ చెప్పడానికి రెడీ అంటున్నాడట . మురుగదాస్ - మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తోంది అని తెలియగానే భారీ అంచనాలు పెరిగాయి ఈ కాంబినేషన్ పై . ఇప్పటివరకు మహేష్ తెలుగు తో పాటు ఓవర్సీస్ మార్కెట్ ని మాత్రమే నమ్ముకున్నాడు ఇకనుండి సౌత్ లోని మిగతా బాషల పై కూడా పట్టు సాధించాలని సన్నాహాలు చేస్తున్నాడు అందులో భాగంగానే తమిళ్ పై కన్నేశాడు మహేష్ . 

తండ్రి దర్శకుడితో జతకడుతున్న శృతి హసన్

హాట్ భామ శృతి హసన్ ఇప్పటికే పలు తెలుగు తమిళ హిందీ బాషల చిత్రాలతో బిజీగా బిజీగా గడుపుతోంది. అలాగే వీటితో పాటే పలు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టేస్తోంది. శృతి తండ్రి లెజెండరీ నటుడు అయిన కమల్ హసన్ తో 'చీకటి రాజ్యం'  అంటూ థ్రిల్లర్ సినిమాని  తెరకెక్కించిన క్రేజీ దర్శకుడు రాజేష్ ఎమ్ సెల్వా  దర్శకత్వంలో శృతి నటించడానికి రెడీ అవుతోంది.n nఅయితే శృతి హసన్ రాజేష్ ఎమ్ సెల్వా కాంబో లో సినిమా మాత్రం తెరకేక్కట్లేదు. వీరిద్దరూ కలిసి ఓ కమర్షియల్ యాడ్ కోసం కలిసి పనిచేయబోతున్నారు. ప్రముఖ సోప్ కంపెని అయిన మేడిమిక్స్ సోప్ యాడ్ కోసం శృతి ని డైరెక్ట్ చేయనున్నాడట రాజేష్ ఎం సెల్వా. చీకటి రాజ్యం చిత్రానికి సంగీతం అందించిన జీబ్రాన్ ఈ యాడ్ కు కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడు.

నాని కి ఆ సినిమా హిట్ అవ్వడం కీలకం

న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం 'జెంటిల్ మెన్'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు రెడీ అయ్యింది. వైవిధ్యమైన  కథాంశంతో రూపొందిన ఈ చిత్రంపై  విడుదలైన టిజర్ ఫస్ట్ లుక్ ట్రైలర్ లతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. నాని ద్విపాత్రాభినయం చేస్తున్న  ఈ చిత్రంలో నాని సరసన థామస్ నివేద ,సురభి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అష్టచమ్మ తో నాని ని హీరో గా పరిచయం చేసిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.n nఅయితే ఈ తాజాగా నాని మాట్లాడుతూ ఈ చిత్రం ఖచ్చితంగా  చూడాలి అందుకు మూడు కారణాలు ఉన్నాయి అని అంటున్నాడు నాని. ఒకటేమో దర్శకుడు మోహన్ క్రిష్ ప్రేక్షకులకు ఓ అదిరిపోయే హిట్ ఇవ్వాలి. రెండో కారణం ఇలాంటి సినిమాలు హిట్ అయితే మన దగ్గర ఇలాంటి కొత్త కథలతో సినిమాలు వస్తాయి. ఇక మూడోది నాకు ఇండస్ట్రి లో  ఈ సినిమాని చేయొద్దు అని చెప్పారు. అందుకు ఈ సినిమా హిట్ అయి వారందరూ చెప్పింది తప్పు అని ప్రూవ్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు.

మహేష్ మాట వింటారా ఫ్యాన్స్

బ్రహ్మోత్సవం ఘోర పరాజయం పొందడంతో దర్శకులు శ్రీకాంత్ అడ్డాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్ . ఇక మరికొంతమంది మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఏకంగా శ్రీకాంత్ అడ్డాల ను బూతులు తిట్టడమే కాకుండా నేరుగా ఫోన్ చేసి మరీ తిడుతున్నారట . ఈ విషయం మహేష్ ద్రుష్టి కి వెళ్ళడంతో స్పందించాడు మహేష్ . శ్రీకాంత్ అడ్డాల పొరపాటు లేదని , బ్రహ్మోత్సవం విషయంలో పూర్తిగా తప్పు నాదేనని ఎందుకంటే స్క్రిప్ట్ తో పాటు దర్శకుడి ని ఎంచుకుంది మొదట నేనే కాబట్టి అంటూ స్టేట్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చల్లార్చడానికి ప్రయత్నించాడు , కానీ మహేష్ ఫ్యాన్స్ మహేష్ మాట వింటారా ? ప్రస్తుతం అయితే బ్రహ్మోత్సవం విషయంలో శ్రీకాంత్ అడ్డాల పై ఆగ్రహంగా ఉన్నారు . కొంతమంది సర్ది చెప్పుకున్నప్పటికి , మరికొంత మంది మాత్రం ఇంకా కోపంగా ఉన్నారు . 

కళ్యాణ్ రామ్ జాయిన్ అయ్యేది అప్పుడే

నందమూరి కళ్యాణ్ రామ్  డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ క్రేజీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! ఇటీవలే అఫీషియల్ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ఈ నెల 26 నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టారు మేకర్స్. కాని ఇంకా ఈ రెగ్యులర్ షూటింగ్ లో కళ్యాణ్ రామ్ జాయిన్ కాలేదంట. ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నాడట పూరి. రేపటి నుండి అంటే మే 30 నుండి కళ్యాణ్ రామ్ రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడట.n nఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన 2015 మిస్ ఇండియా గా ఎంపిక అయిన అదితి ఆర్య హీరోయిన్ గా నటించనుంది. సామజిక సమస్యల నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా కనిపించానున్నాడట.అలాగే ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రఫ్ లుక్ లో ఆదరగోత్తనున్నాడట. ఇందుకోసం భారీగా కండలు కూడా పెంచినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

వరుణ్ తేజ్ తదుపరి సినిమాలో హీరోయిన్ ఫిక్స్

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఏస్ డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో  'మిస్టర్' అనే చిత్రం చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే! ఇప్పటికే అఫీషియల్ గా లాంచింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే మొదలు పెట్టాల్సి ఉంది కాని ఇంకా మొదలు పెట్టలేదు. దీంతో పలు రూమర్స్ సోషల్ మీడియాలో క్రియేట్ అవుతూనే ఉన్నాయి.n nఅయితే ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ క్రేజీ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇటీవలే శేఖర్ కమ్ముల చెప్పిన కథను విన్న వరుణ్ తేజ్ సినిమా చేయడానికి ఉవ్విళ్ళు రూతున్నాడట. శ్రీనువైట్ల సినిమా కంటే ముందు శేఖర్ కమ్ముల సినిమా చేయాలనీ చూస్తున్నాడట.  తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వెచ్చింది. మలయాళ ప్రేమమ్ చిత్రంతో బాగా ఫేమస్ అయిన మలయాళ భామ సాయి పల్లవి  వరుణ్ ,శేఖర్ కమ్ముల చిత్రంలో హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది.

నైజాం లో సంచలనం సృష్టిస్తున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ తాజా చిత్రం బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయినప్పటికీ , సదరు పంపిణీ దారుడైన అభిషేక్ పిక్చర్స్ వాళ్ళకు భారీ నష్టం వచ్చినప్పటికీ .............. మహేష్ - మురుగదాస్ ల కాంబినేషన్ లో వచ్చే చిత్రాన్ని నైజాం లో  సొంతం చేసుకోవడానికి భారీ ఆఫర్ ఇచ్చారు అభిషేక్ పిక్చర్స్ . ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకోవడానికి ఏకంగా 25 కోట్ల ఆఫర్ ఇచ్చారని వినికిడి , అయితే ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది ఇంకా కన్ఫర్మ్ కాలేదు . అయితే విశేషం ఏమిటంటే ఇటీవలే మహేష్ బ్రహ్మోత్సవం చిత్రాన్ని నైజాం లో అభిషేక్ పిక్చర్స్ రిలీజ్ చేసారు . అది డిజాస్టర్ అయ్యింది ,అయినప్పటికీ మహేష్ - మురుగదాస్ ల చిత్రానికి క్రేజ్ రావడంతో ఈ మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ద పడుతున్నారట .

దేవిశ్రీ ప్రసాద్ ఎంత పని చేసాడో తెలుసా

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అన్ని రంగాల్లో రాణించాలని అనుకుంటున్నాడో ఏమో అందుకే సంగీతం అందించడమే కాకుండా పాటలు రాస్తూ , పాడుతూ స్టేజీ పై అందరినీ ఉర్రూతలూగిస్తూ సంచలనం సృష్టించే దేవిశ్రీ ప్రసాద్ తాజాగా ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు . n nఅందాల రాక్షసి తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన లావణ్య త్రిపాఠీ ని రకరకాల భంగిమలలో ఫోటోలు తీసి శెభాష్ ! అనిపించుకున్నాడు . ఈ ఫోటో షూట్ కి సంబందించిన వీడియో వైరల్ లా పాకుతోంది . దేవిశ్రీ లో మంచి సంగీత దర్శకుడు మాత్రమే కాదు విభిన్న పార్శ్వాలు ఉన్నాయన్న మాట . అన్నట్లు దేవిశ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా కూడా మారనున్నాడు . ఇక హీరోగా ఎలాంటి సంచలనాలు సృస్తిస్తాడో చూడాలి . 

’పనిలేని పులిరాజు’ మోషన్ డైలాగ్ పోస్టర్ విడుదల

ధన్ రాజ్ పదమూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం పనిలేని పులిరాజు.  ఈ చిత్రం మోషన్ డైలాగ్ పోస్టర్ ను ఇంటర్నెట్లో విడుదల చేశారు.  పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు చాచా. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. చిత్రాన్ని జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...nనిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ ’సెన్సార్ పూర్తయ్యింది. సినిమాను జూన్ మూడోవారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పాటలు సినిమాలో హైలైట్ గా వుంటాయి. పాటలను మొదటి వారంలో విడుదల చేయనున్నాం‘ అని అన్నారు.nసహ నిర్మాత రవి.కె.పున్నం మాట్లాడుతూ ‘ప్రస్తుతం మోషన్ పోస్టర్ విత్ డైలాగ్స్ విడుదల చేశాం. ఈ సినిమాలో డైలాగ్స్ కు ప్రాముఖ్యత వుంటుంది. రఘుబాబు కామెడీ, నటన సినిమాలో కడుపుబ్బా నవ్విస్తాయి‘ అన్నారు.nదర్శకుడు చాచా మాట్లాడుతూ ‘టీజర్ ను త్వరలోనే విడుదల చేస్తాం. ఇంతకు ముందు చెప్పినట్టు సినిమాలో హాస్యమే ప్రధానంగా వుంటుంది.’ అని అన్నారు.nప్రాచిసిన్హా, శ్వేతావర్మ, ఇషా, హరిణి,రఘుబాబు, కొండవలస, కోటేశ్వరరావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: వి.వి. సహ నిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి. లక్షి, నిర్మాత: పి.వి. నాగేష్ కుమార్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: చాచా.

సమంత జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంటున్న నితిన్

సమంత నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని అంతకుమించి ఏమి కాదని , సమంతతో ప్రేమలో ఉన్న హీరో ఎవరో ? మీకు తెలుసునని నన్ను అందులోకి లాగొద్దని అంటున్నాడు హీరో నితిన్ . త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ''అ ఆ ''. ఈ చిత్రం జూన్ 2న రిలీజ్ అవుతున్న సందర్భంగా నితిన్ మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు . n nఇండస్ట్రీ కి వచ్చి 14 ఏళ్ళు అవుతోంది , ఈ పద్నాలుగేళ్ళ కాలంలో 22 సినిమాలు చేశాను . నాలుగేళ్ళ క్రితం వరకు ఫ్లాప్ లొచ్చాయి ఇష్క్ తో పంథా మార్చాను సక్సెస్ బాటలో పయనిస్తున్నందుకు సంతోషంగా ఉంది . n nత్రివిక్రమ్ గారితో ఎప్పుడో సినిమా చేయాల్సి ఉండే కానీ వీలు కాకపోవడంతో చాలా బాధపడ్డాను ,కట్ చేస్తే మనిద్దరం కలిసి సినిమా చేస్తున్నామని త్రివిక్రమ్ గారి నుండి ఫోన్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను . లక్కీగా లాస్ట్ ఇయర్ ఓ సినిమా చేయకుండా తప్పుకోవడంతో ఈ గోల్డెన్ చాన్స్ వచ్చింది . n nకెరీర్ ప్రారంభంలోనే గొప్ప గొప్ప దర్శకులతో సినిమాలు చేయడం నా అదృష్టం ,అయితే త్రివిక్రమ్ గారు నన్ను మరింత బాగా అర్దం చేసుకొని చేసిన సినిమా ఈ ''అ ఆ ''. రాజమౌళి గారి తర్వాత నన్ను  అంత బాగా అర్దం చేసుకున్న దర్శకులు త్రివిక్రమ్ గారే  . ఇక నాకంటూ ఏదైనా ప్రాబ్లెం వస్తే నేను మొదట చేసే ఫోన్ త్రివిక్రమ్ గారికే ఎందుకంటే ఆయనో జ్ఞాని , ఆయనకు తెలియని విషయం అంటూ ఏది లేదు . n nనా అభిమాన హీరో పవన్ కళ్యాణ్  సెట్స్ కు వచ్చినప్పుడు కొంత నేర్వెస్ ఫీల్ అయ్యాను , ఆయన ముందు నటించడం కొంత ఇబ్బందే అయ్యింది . n nఇక సమంత విషయానికి వస్తే ఆమె మంచి కో ఆర్టిస్ట్ అంతేకాని ఆమె లవర్ ఎవరో నాకు తెలియదని అంత పర్సనల్ విషయాలు మాట్లాడదని , అయినా .............. ఆమె లవర్ ఎవరో మీకు తెలుసనీ  నన్ను ఈ విషయంలోకి లాగొద్దని అన్నాడు నితిన్ . 

మురుగదాస్ మహేష్ ల సినిమా అప్డేట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు  త్వరలోనే తమిళ కమర్షియల్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో  సినిమా చేయనున్న విషయం తెలిసిందే!  ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి మహేష్ బాబు లండన్ కి వెకేషన్ కి వెళ్ళాడు. తిరిగి హైదరాబాద్ కు వచ్చే నెల జూన్ 20న  రానున్నాడు. తిరిరగానే మహేష్ మురుగదాస్ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేసి షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి అయ్యాయట.n nప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో మహేష్ కు హీరోయిన్ గా నటింప జేయడానికి సాయి పల్లవి, మలయాళ భామ కీర్తి సురేష్, బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా లను సంప్రదించారట మేకర్స్. కాని ఈ ముగ్గుర్లో ఎవరు మహేష్ సరసన హీరోయిన్ గా నటించానున్నరన్నది త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది. సోషల్ మెసేజ్  ఓరియంటెడ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి క్రేజీ తమిళ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందించనున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్ ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

నితిన్ ,సమంత , త్రివిక్రమ్ ల \'\'అ ఆ \'\' ఏ రేంజ్ హిట్ అవుతుందని భావిస్తున్నారు?

1) హిట్ n2) సూపర్ హిట్ n3) బ్లాక్ బస్టర్ n4) తెలియదు n5) ఫ్లాప్ 

#100 బాలయ్య : హీరోయిన్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ  తాజాగా నటిస్తున్న వందో చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నర్ క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే! ఒకటవ శతాబ్దపు  శాతవాహన రాజైన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే మొరాకో దేశంలో మొదటి షెడ్యుల్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే చిలుకూరి బాలాజీ వద్ద వేసిన భారీ సెట్టింగ్ లో రెండో షెడ్యుల్ షూటింగ్ మొదలు కానుంది.n nఇప్పటికే మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాలేదంట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం ముందుగా నయనతార ను సంప్రదించారు. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల ఆమె నో చెప్పింది. అలాగే అనుష్క, కాజల్ లని సంప్రదించగా ఇతర కారణాల వల్ల నో చెపారు. దీంతో తాజాగా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం హాట్ భామ శ్రేయ శరన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందుకు శ్రేయ శరన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.n nప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని ఈ చిత్రంలో రాజమాత గౌతమి పాత్రలో నటిస్తోంది. అలాగే క్రేజీ బాలీవుడ్ నటుడు కబీర్ బేడి మెయిన్ విలన్ నటిస్తున్నాడు. చారిత్రాత్మక ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

బాహుబలి గా మారిన లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,నటసింహం నందమూరి బాలకృష్ణ అల్లుడు అయిన నారా లోకేష్ బాహుబలి గా మారాడు . తెలుగుదేశం పార్టీ మహానాడు భారీ ఎత్తున తిరుపతిలో జరుగుతున్న విషయం తెలిసిందే . ఆ వేడుకలో భాగంగా తెలుగుదేశం శ్రేణులు కొంతమంది నారా లోకేష్ ని బాహుబలి ప్రభాస్ తో పోల్చుతూ , ప్రభాస్ తల స్థానంలో లోకేష్ తల పెట్టిన కటౌట్ హైలెట్ గా నిలిచింది . n nతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా సేవలందిస్తున్న నారా లోకేష్ ని భవిష్యత్ ముఖ్యమంత్రి గా టిడిపి శ్రేణులు భావిస్తున్న తరుణంలో ఇలా బాహుబలి ని చేసారు . ఇప్పటికే పార్టీలో , ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న లోకేష్ రాబోయే రోజుల్లో మరింత కీలక పాత్ర పోషించనున్నాడు . 

కబాలి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమా

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సంచలనం ''కబాలి ''. టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన రజనీ ఇక సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . టీజర్ , ఫస్ట్ లుక్ లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన రజనీ చిత్రాన్ని భారీ మొత్తం చెల్లించి ఏరియా హక్కులు పొందడానికి అన్ని ఏరియాల నుండి విపరీతమైన పోటీ ఏర్పడింది . nతాజాగా కర్ణాటకలో కళ్ళు బైర్లు కమ్మే రేటు తో కబాలి హక్కులను ఓ అగ్ర పంపిణీ సంస్థ సొంతం చేసుకుందట . వాళ్ళు ఇంత సాహసం చేయడానికి రజనీ మేనియా ఒక కారణం అయితే ఫస్ట్ లుక్ తో , టీజర్ తో కట్టి పడేయడం మరో కారణం . జూలై 1న కబాలి రిలీజ్ అవుతుండగా ఆ డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు రజనీ ఫ్యాన్స్ . 

పోసాని ని బూతులు తిట్టాడట

ప్రముఖ నటుడు , దర్శక నిర్మాత పోసాని కృష్ణ మురళి ని ఓ ప్రొడక్షన్ మేనేజర్ బూతులు తిడుతూ మెసేజ్ లు పెడుతున్నాడట దాంతో పోలీసులను ఆశ్రయించాడు పోసాని . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పొలీస్ స్టేషన్ కు వెళ్ళిన పోసాని తనని అకారణంగా దూషిస్తున్న నరేష్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసాడు . పోసాని ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మి నారాయణ అలియాస్ నరేష్ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు .n నరేష్ అనేవాడు పోసాని కి ఫోన్ చేసి డబ్బులు కావాలని , అత్యవసర పరిస్థితి ఉందని అన్నాడట ! అయితే నువ్వెవరో నాకు తెలియనప్పుడు ఎలా ఇస్తాను , ఎందుకు ఇస్తాను అంటూ ఫోన్ పెట్టేయబోతుంటే నరేష్ కు కోపం వచ్చి ఇలా బూతు మెసేజ్ లు పెట్టాడట . 

బ్రహ్మోత్సవం ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బు క్రేజీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం "బ్రహ్మోత్సవం' ఇటీవలే మే 20న ప్రేక్షుల ముందుగు వచ్చి నెగటివ్ టాక్ తెచ్చుకుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత లు హీరోయిన్ లుగా నటించారు. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ కథనం వల్ల సినిమాకు ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు నుండే కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం మొదలయ్యాయి. మొత్తంగా మొదటి వారం బ్రహ్మోత్సవం సాధించిన కలెక్షన్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.n nనైజంలో                   -   8. 35 కోట్లు nసీడెడ్ లో                 -   2. 82 కోట్లు nఉత్తరాంధ్ర                -  2. 15 కోట్లు nఈస్ట్ లో                   -  2. 4 కోట్లు nవెస్ట్ లో                    -  2. 48 కోట్లు nకృష్ణా లో                  -   1. 66 కోట్లు nగుంటూరు లో           -   2. 74 కోట్లు nనెల్లూర్ లో               -   0. 90 కోట్లు n nమొత్తం                   -  23.5 కోట్లు 

ఆ హాట్ భామ అలాంటి పాత్ర చేస్తోందట

శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన 'ఊహలు గుస గుస లాడే' చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన  రాశిఖన్న ఇటీవలే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ సినిమా తో హిట్ అందుకుంది. ఆ మొన్నే బెంగాల్ టైగర్ చిత్రంలో మాస్ మహారాజ్ రవి తేజ తో ఆది పాడి అదుర్స్ అనిపించుకుంది. ఆ మధ్య బొద్దుగా కనిపించిన ఈ భామ ఈ మధ్య బాగానే డైట్ చేస్తూ కాస్త సన్న బడింది. ప్రస్తుతం ఈ హాట్ భామ గోపి చంద్ హీరోగా ఎ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతూ చేస్తున్న 'ఆక్సిజన్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.n nఇప్పటివరకు పూర్తి గ్లామరస్ రోల్స్ నటించిన ఈ భామ తాజాగా నటిస్తున్న 'ఆక్సిజన్' చిత్రంలో  పూర్తి ది గ్లామరస్ రోల్ లో నటిస్తోందట.  జగపతి బాబు కూతురిగా పూర్తి గ్రామీణ సంప్రదాయపు యువతిగా కనిపించనుందట. ఈ చిత్రంతో పాటే రాశి ఖన్నా రవితేజ హీరోగా గా నటిస్తున్న రాబిన్ హుడ్ చిత్రంలోనూ హీరోయిన్ గా నటించనుంది. వచ్చే నెల జూన్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని మొదలు కానుంది.

రోబో కోసం కమల్ ని అడిగింది నిజమేనట

తమిళ క్రేజీ దర్శకుడు  శంకర్ సూపర్ స్టార్ రజిని కాంత్ కాంబినేషన్ లో వచ్చిన 'రోబో' చిత్రాన్ని ముందుగా దర్శకుడు శంకర్ విలక్షణ నటుడు కమల్ హసన్ తో చేయాలనీ భావించి ఆయన్ని సంప్రదించాడట. కాని కమల్ ఈ చిత్రం చేయడానికి నో చెప్పడంతో, ఆ వెంటనే రోబో కథని పాతుకొని ముంబాయ్ వెళ్లి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు కథ వినిపించాడట. దీనికి షారుఖ్ ఖాన్ కూడా నో చెప్పడంతో ఇదే కథని రజినీ చెప్పి ఒప్పించడం, సినిమా చేయడం, ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన సినిమాగా హిట్  కావడం చక చక జరిగిపోయింది.n nఅయితే ఇప్పుడు తాజాగా రూపొందుతున్న రోబో 2.0 సీక్వెల్ లో కూడా విలన్ పాత్ర కోసం కమల్ హసన్ ని దర్శకుడు శంకర్ సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే ఈ విషయాన్నీ తాజాగా కమల్ హసన్ ని అడగ్గా అది నిజమేనని స్పష్టం చేశాడు. ఐతే రజిని నేను ఒక ఒప్పందం చేసుకోవడం వల్లే రోబో సీక్వెల్ లో నేను నటించక పోవడానికి కారణం అని అన్నారు. రజినీకాంత్ నేను కలిసి గతంలో చాలా సినిమాలు చేశాం. తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేయడానికి విరామం పట్టింది.ఆ సమయంలో  మళ్ళి ఇద్దరం కలిసి నటించాల్సి వస్తే  ఇద్దరిలో ఒకరు నిర్మాతగా ఉండాలని, అప్పుడు తమ కాంబినేషన్ తెరకేక్కలని ఒప్పందం చేసుకున్నాం" అని తెలిపాడు. అయితే ఇప్పుడు 'రోబో 2.0' చిత్రానికి నిర్మాతలువేరే వాళ్ళు కావడంతోనే సినిమాని ఒప్పుకోలేదు అని చెప్పాడు.

వంశీ పైడిపల్లి కి చాన్స్ ఇస్తున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటించిన బ్రహ్మోత్సవం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే! అయితే ఈ చిత్రని భారీ బడ్జెట్ తో నిర్మించిన పి వి పి సంస్థ కు ఇప్పటివరకు వచ్చిన వసూళ్ళ ని బట్టి చూస్తే భారీగానే లాస్ వచ్చినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయం మహేష్ బాబు కు కూడా నష్టలోచ్చయనే విషయం తెలుసు. ఈ నష్టాలను గమనించిన మహేష్ పి వి పి సంస్థ తో మరో సినిమా చేద్దాం అని చెప్పాడట.n nదీంతో వెంటనే పి వి పి సంస్థ మరో ఆలోచన లేకుండా తమ సంస్థకు ఊపిరి చిత్రంతో అదిరిపోయే మేమోరబుల్ హిట్ అందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ని రంగంలో కి దింపి మహేష్ తో సినిమా చేస్తున్నాం అని చెప్పిందట. దీంతో ఎప్పటి నుండో మహేష్ కోసం ఎదురు చూస్తున్న వంశీ పైడిపల్లి మహేష్ కు ఓ లైన్ వినిపించాడట. ఆ లైన్ మహేష్ కు కూడా నచ్చేసి సినిమా చేసేద్దాం అని చెప్పాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి లండన్ టూర్ కి వెళ్ళిన మహేష్ తిరిగి రాగానే మురుగదాస్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. మురుగదాస్ సినిమా సగం పూర్తి కాగానే వంశీ పైడిపల్లి తో సినిమాని స్టార్ట్ చేయనున్నాడట.

మహేష్ మురగ ల చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు తమిళ కమర్షియల్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారట. బాలీవుడ్  హాట్ భామ పరిణీతి చోప్రా ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్ గా నటించనుంది. అలాగే ఇండియాలోని టాప్ కెమరా మెన్ లలో ఒకరైన సంతోష్ శివన్ ఈ చిత్రానికి కెమరా మెన్ గా పని చేయనున్నాడు.n nప్రస్తుతం ఫ్యామిలీ తో కలిసి లండన్ టూర్ కి వెళ్ళిన మహేష్ బాబు త్వరలోనే తిరిగి హైదరాబాద్ రానున్నాడు. వచ్చిన వెంటనే ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనున్నారట. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా హరీష్ జై రాజ్ ని మురుగదాస్ ఎంపిక చేశాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సెన్సేషనల్ హిట్ వచ్చాయి. కాని ఈ మధ్య కాలంలో అలంటి హిట్ రాకపోవడంతో మురుగా రూట్ మార్చి విజయ్ తో తీసిన కత్తి చిత్రానికి యంగ్ సంగీత దర్శకుడు అనిరుద్ ని తీసుకున్నాడు. మళ్ళి ఇప్పుడు తాజా చిత్రానికి కూడా అనిరుద్ నే తీసుకుంటారని అంత భావించారు కాని మురుగా మాత్రం తన సన్నిహితుడైన హరీష్ జైరాజ్ కే ఈ చాన్స్ ఇచ్చాడు.  సామజిక సమస్యల నేపధ్యంలో న్యాయ వ్యవస్థ పై సేటేరికల్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు.

లిఫ్ట్ లో ఇరుకున్న అల్లు అర్జున్ బోయపాటి శ్రీను

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భారీ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'సరైనోడు' చిత్రం విడుదలై బాక్సాఫీస్ హిట్ గా నిలవడంతో ఈ ఇద్దరు కలిసి ఈ శుక్రవారం  వైజాగ్ దగ్గరలో గల సింహాచలం  వరాహ నరసింహ స్వామి ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపధ్యంలో బన్నీ కి మరియు బోయపాటి శ్రీను కు ఓ చేదు అనుభవం ఎదురైంది.n nనరసింహ స్వామి ని దర్శించుకున్న అనంతరం బన్నీ బోయపాటి లు  బయటికి రావడానికి లిఫ్ట్ ఎక్కారు. ఆ లిఫ్ట్ వస్తున్న క్రమంలో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఇద్దరు ఆ లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయారు. వెంటనే స్పందించిన ఆలయ కమిటి దాన్ని పని చేయించడానికి ఎంత ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది ఏమి లేక లిఫ్ట్ ని బద్దలు కొట్టి బన్నీని మరియు బోయపాటి శ్రీను లను  బయటికి తీశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ ఆలయ కమిటితో పాటు బన్నీ కోసం వచ్చిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

పవన్ కళ్యాణ్ ఇప్పటికి కూడా అతడికి దేవుడట

పవన్ కళ్యాణ్ నా దేవుడని మరోసారి స్పష్టం చేసాడు జబర్దస్త్ తో ఫేమస్ అయిన శకలక శంకర్ . ఇప్పుడు చెప్పడం ఏంటి ? ఎప్పటి నుండో పవన్ కు వీరాభిమాని కదా అనే కదా మీ డౌట్ . శకలక శంకర్ పవన్ వీరాభిమాని అయితే ఆమధ్య సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో పవన్ శకలక శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే . దాంతో కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న శకలక శంకర్ ఇప్పటికి కూడా నా దేవుడు పవన్ కళ్యాణ్ అనే అంటున్నాడు . n nసినిమాల్లో మొదట చాన్స్ ఇప్పించింది నాగబాబు గారే నని దాని తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు శకలక శంకర్ . అయితే పవన్ కు గుడి కడుతున్నానంటూ తెగ హడావుడి చేసిన శకలక శంకర్ ఇప్పుడు మాత్రం ఆ ఊసెత్తడం లేదు మరి 

మలయాళంలో విడుదలకు రెడీ అయిన \'సరైనోడు\'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన 'సరైనోడు' చిత్రం గత నెల ఏప్రిల్ 22న తెలుగులో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! మొదటి పది రోజుల్లోనే యాబై కోట్లు కోళ్ళ గొట్టిన బన్నీ కేవలం 33 రోజుల్లో 70 కోట్ల మార్క్ ని అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రతి సారి బన్నీ నటించిన సినిమాలు అక్కడ కూడా విడుదల అయి భారీగానే వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు కూడా తాజాగా బన్నీ నటించిన సరైనోడు చిత్రాన్ని మలయాళంలో 'యోధవ్' గా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.n nముందుగా తెలుగులో విడుదల చేసి సినిమాకు వచ్చే టాక్ ని బట్టి మలయాళంలో విడుదల చేయాలనీ భావించి, సినిమా తెలుగులో హిట్ అయ్యాక ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ రోజు మే 27న విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రేస లు హీరోయిన్ లుగా నటించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

బ్రహ్మోత్సవం కంటే బిచ్చగాడు బెటర్ అంటున్నారు

బ్రహ్మోత్సవం కంటే తమిళ  డబ్బింగ్ సినిమా  బిచ్చగాడు బెటర్ అని దాన్నే చూడండి అంటూ తెలిసిన వాళ్ళకు , తెలియని వాళ్ళకు చెబుతున్నారు ఎక్కైడైన సినిమా విషయం చర్చ కు వస్తే . తమిళ డబ్బింగ్ చిత్రం ఈనెల 13న చాలా తక్కువ థియేటర్ లలో రిలీజ్ అయ్యింది అయితే సరైన పబ్లిసిటీ లేకపోవడంతో ఆ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు కానీ బ్రహ్మోత్సవం రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ చూసాక దాని కంటే తమిళ డబ్బింగ్ సినిమా అయిన బిచ్చగాడు చూడండి అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు జనాలు . n nవిజయ్ ఆంటోనీ నటించి నిర్మించిన ఈ చిత్రం కొత్త తరహాలో ఉండటంతో జనాలు ఆదరిస్తున్నారు . బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో బిచ్చగాడు కి బాగానే కలిసొచ్చింది . మంచి టాక్ స్ప్రెడ్ కావడంతో మంచి వసూళ్ళ నే సాధిస్తోంది . 

డీప్ క్లీవేజ్ తో చంపేస్తోంది

సోనారిక బడోరియా ఉత్తరాది నుండి వచ్చిన ఈ భామ తెలుగు నాట పాతుకు పోవాలని బాగానే ప్రయత్నాలు చేస్తోంది కానీ ఇక్కడ మాత్రం అంతగా కాలం కలిసి రావడం లేదు . ఇప్పటి వరకు మూడు సినిమాలలో నటించగా మూడు సినిమాల్లో కూడా అందాల ఆరబోత తో కుర్రకారు కి గాలం వేసింది ఈ భామ కానీ అందాలను గుడ్లప్పగించి చూసారు కానీ అంతగా చాన్స్ ఇవ్వలేదు . ఇక చేసిన మూడు సినిమాల్లో రెండు ఫ్లాప్ కాగా ఒకటి హిట్ అయ్యింది . n nహిందీలో సీరియల్ లో చాలా పద్దతిగా కనిపించిన ఈ భామ డీప్ క్లీవేజ్ షోతో కుర్రకారు ని చంపేస్తోంది . అందాల ఆరబోత కు ఏమాత్రం అడ్డు చెప్పకుండా రెచ్చిపోయి అందాలను ఆరబోస్తున్న ఈ భామ తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించాలని ఆశపడుతోంది . మరి ఈ భామ ఆశలు నెరవేరుతాయా లేదా చూడాలి . 

లేడీస్ రూం లో బూతులే బూతులు

వయసు కొచ్చిన అమ్మాయిల రూంలో ఎలాంటి బూతులు వాడుతారు , వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది , ఆ లేడీస్ రూంలో ఏమేమి ఉంటాయి తదితర విషయాలతో రూపొందిన వెబ్ సిరీస్ ''లేడీస్ రూం ''. ఈ వెబ్ సిరీస్ లో పచ్చి బూతులు మాట్లాడిన భామ ఎవరో తెలుసా ............... తెలుగులో స్నేహ గీతం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించిన ''శ్రేయ ధన్వంతరీ'' ఈ లేడీస్ రూంలో నటించింది . పాపం తెలుగులో ఈ భామకు అంతగా చాన్స్ లు రాలేదు పైగా వంటి మీద సరైన కండ కూడా లేదు దాంతో చాన్స్ లు రాకపోవడంతో ముంబై వెళ్ళిన ఈ భామ బూతు వెబ్ సిరీస్ లో ఇంకా పచ్చిగా బూతులు మాట్లాడి అందరినీ ఆశర్య పరుస్తోంది . n nలేడీస్ రూం వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది ఇక ట్రైలర్ లోనే ఇన్ని బూతులు ఉన్నాయంటే అందులో ఎన్ని బూతులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు . యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఈనెల 31న యు ట్యూబ్ లో పూర్తిస్థాయి వీడియో ని చూడొచ్చు . n nశ్రేయ ధన్వంతరీ వచ్చిన బూతులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు ఇక్కడి తెలుగువాళ్ళు . ఎందుకంటే పక్కింటి అమ్మాయిలా కనిపించే శ్రేయ ధన్వంతరీ ఇలా బూతులు మాట్లాడటం విడ్డూరమే కదా ! <iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/RwZFB9Phbpo" frameborder="0" allowfullscreen></iframe>

ఓవర్సీస్ లో భారీ లాస్ దిశగా బ్రహ్మోత్సవం

మహేష్ ఓవర్సీస్ లో మొనగాడు అన్న విషయం తెలిసిందే , దాంతో మహేష్ చిత్రాలకు అక్కడ చాలా డిమాండ్ ఉంటుంది . ఓవర్సీస్ లో మహేష్ నెంబర్ వన్ కాగా తాజాగా బ్రహ్మోత్సవం చిత్రంతో బ్లాక్ బస్టర్ చిత్రాల్లోనే కాదు వరేస్ట్ చిత్రంలో కూడా మహేష్ నెంబర్ వన్ అయ్యాడు ఈ బ్రహ్మోత్సవం తో . n nమహేష్ కు విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల ,పైగా పూర్తిగా పాజిటివ్ బజ్ ఉండటం వల్ల బ్రహ్మోత్సవం చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది దాంతో 13 కోట్లకు పైగా రేటు పలికింది . అయితే ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 1.5 మిలియన్ డాలర్లు మాత్రమే వసూల్ అయ్యాయి . డిజాస్టర్ టాక్ రావడంతో మరో హాఫ్ మిలియన్ వస్తే గొప్పే అని అంటున్నారు అంటే పెద్ద మొత్తం లోనే లాస్ వస్తోంది ఆ సినిమా కొనుక్కున్న వాళ్ళకు . n nమహేష్ సినిమా ఆగడు ,1 నేనొక్కడినే ఇక్కడ ఫ్లాప్ అయినప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం మంచి వసూళ్ళ ని రాబట్టాయి కానీ బ్రహ్మోత్సవం మరీ నీరసంగా ఉండటం తో ఈ పరిస్థితి ఏర్పడింది . 

సమంత పై ఆ హీరో ఆగ్రహం వ్యక్తం చేసాడట

నేను లవ్ లో ఉన్నానని పైగా ఆ  యంగ్ హీరో తో సినిమాలు కూడా చేసానని ఇక త్వరలో పెళ్లి చేసుకోవడమే తరువాయి అని సమంత చెప్పడంతో సదరు యంగ్ హీరోకు ఎక్కడా లేని చిక్కోచ్చిందట దాంతో సమంత పై ఆగ్రహం వ్యక్తం చేసాడట ఎందుకంటే ఆ యంగ్ హీరో పేరెంట్స్ నుండి ఈ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే నట . n nసమంతతో లవ్ లో ఉన్న విషయాన్నీ తన పేరెంట్స్ కు చెప్పి వాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ......... వాళ్ళ అనుమతి ఇంకా పొందకుండానే ఆ హీరో ఫ్యామిలీ కూడా మా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమంత చెప్పడంతో చిక్కొచ్చిందట . n nసమంత తన లవర్ గురించి చిన్న హింట్ ఇవ్వడంతో అరకొరగా ఈ విషయం తెలిసిన వాళ్ళకు తోడూ ఇంకా చాలామంది కి తెలిసిపోయింది దాంతో సదరు హీరో కాస్త కోపానికి వచ్చాడట . 

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం "జనతా గ్యారేజ్". ఇప్పటికే శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో  తాజా షెడ్యుల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నెల చివరి వరకు చెన్నై లోనే షూటింగ్ జరుపుకొని జూన్ 1 వరకు హైదరాబాద్ కు యూనిట్ తిరిగి రానుంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరో మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందా ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ చిత్రం పై భారీగానే అంచనాలు పెరిగాయి.n nమరో దిక్కు దర్శకుడు కొరటాల శివ మిర్చి శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత, ఎన్టీఆర్ టెంపర్ నాన్నకు ప్రేమతో చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కాబట్టి ఇండస్ట్రి లో ఆరెంజ్ అంచనాలు ఈ చిత్రం పై ఏర్పడ్డాయి. మొత్తంగా జనతా గ్యారేజ్ తో ఈ ఇద్దరు కలిసి హ్యట్రిక్ హిట్ కొడతారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇన్ని అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 80 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు.n nఇప్పటికే భారీ అంచనాల మధ్య వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం చిత్రాలు 80 కోట్లు, 85 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి కాని అందులో సర్దార్ మాత్రం 52 కోట్లు వసూల్ చేయగా ,బ్రహ్మోత్సవం సగం కూడా తిరిగి రాబట్టే పరిస్థితులు కనబడట్లేదు. దీంతో ఇప్పుడు తాజాగా జనతా గ్యారేజ్ కూడా ఈ రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు. మరి ఇంత మొత్తం యంగ్ టైగర్ రాబట్టుతాడో లేక పవన్ మహేష్ ల లాగే సగంలో ఆగిపోతాడో చూడాలి.

ఈ సమ్మర్ సినిమాలతో వాళ్ళకు బాగా నష్టం

ఈ ఏడాది సమ్మర్ సినిమాలతో  ఓవర్సీస్ బయ్యర్స్ తీవ్రంగా నష్ట పోయారు. అమెరికా లో తెలుగు సినిమాలు విడుదలవడమే గొప్ప అనుకున్న స్థితి నుండి ఏకంగా మిలియన్ మార్క్ వసూల్లని కొల్లగొట్టే రేంజ్ కి తెలుగు సినిమాలు ఎదిగాయి. గత రెండు మూడు ఎల్లనుంది ఓవర్సీస్ లో మన తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. అయితే గత రెండు మూడేళ్ళ సమ్మర్ సీజన్ తో ఈ ఏడాది సమ్మర్ పోలిస్తే ఓవర్సీస్ బయ్యర్స్ బాగా నష్టపోయారని చెప్పవచ్చు.n nపవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ తో మొదలైన ఈ నష్టాల పరంపర నిన్న మొన్న వచ్చిన బ్రహ్మోత్సవం వరకు ఇదే పరిస్థితి. సర్దార్ గబ్బర్ సింగ్  చిత్రాన్ని భారీ రేటు చెల్లించి దక్కించుకున్న బయ్యర్ కు  సర్దార్ వన్ మిలియన్ మార్క్ వసూళ్ళు చేసి భారీ నష్టాలను మిగిల్చింది. ఆ వెంటనే వచ్చిన సరైనోడు ఇండియాలో బాగానే ఆడిన కూడా ఒవర్సిస్ లో దారుణమైన కలెక్షన్స్ ని రాబట్టి బయ్యర్ ని ముంచేసింది. కనీసం మిలియన్ మార్క్ ని కూడా అందుకోకుండా ఓవర్సీస్ లో ఘోరమైన ప్లాప్ గా మిగిలి పోయింది.n nఇక ఇటీవలే విడుదలైన మహేష్ బాబు బ్రహ్మోత్సవం కూడా అదే పరిస్థితి. పూర్తి క్లాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం అక్కడి ప్రేక్షకులకు నొప్పుద్ది అని భావించిన 13.20 కోట్లకు దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ కు బ్రహ్మోత్సవం భారీ నష్టాలను మిగులుస్తోంది.ఇప్పటి వరకు కేవలం 1.5 మిలియన్ మార్క్ ను మాత్రమె వసూల్ చేసిన బ్రహ్మోత్సవం బయ్యర్ సేఫ్ జోన్ లో పడాలంటే ఇంకా కనీసం 2 మిలియన్ పైనే రాబాట్టల్సి ఉంది. కాని ఆ పరిస్థితి మాత్రం కనబడట్లేదు. దీంతో ఈ ఏడాది సమ్మర్ ఓవర్సీస్ బయ్యర్స్ కు ఘోరమైన నష్టాలను మిగిల్చింది.

శృతి పనులు శృతి మించుతున్నాయట

ఒక స్టార్ హీరో కూతురిగా సినిమాల్లోకి ఎంట్రి ఇచ్చిన భామ శృతి హసన్ ఆ తర్వాత తనదైన మల్టీ టాలెంట్ తో సౌత్ లోనే టాప్ హీరోయిన్ ల జాబితా లో చేరిపోయింది. తెలుగు తమిళ హిందీ బాషలలో తన సత్తా చాటుకుంటూ వస్తున్న ఈ భామ ఏ ఈవెంట్ అయినా సరే తన అందాల అరబోతతో సెగలు పుట్టించడం అలవాటై పోయింది ఈ భామకు. అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ సినిమా అయిన సరే ఒకేలా ట్రీట్ చేసే శృతి హసన్ పనులు ఈ మధ్య  దర్శక నిర్మాతలు చిరాకు పుట్టిస్తున్నాయట.n nఎందుకంటే కాస్ట్ అండ్ క్రూ అంత సరైన సమయానికి రెడీ గా ఉంటె షూటింగ్ ని 9 నుండి 10 గంటల మధ్య మొదలు పెడుతుంటారు. కాని శృతి హసన్ మాత్రం రోజు పన్నెండు దాటితే కాని సెట్స్ పైకి రావడం లేదంట. పైగా ఎందుకు లేట్ గా వచ్చిందో కూడా వివరణ కూడా ఇవ్వడం లేదంట. ప్రతి రోజు శృతి ఇలా చేస్తుండడం తో సినిమా షెడ్యుల్స్ చాలా ఇబ్బందిగా మారుతోందట. మరి ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ క్రమ శిక్షణ పాటించే హీరో కమల్ కూతురిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన శృతి ఇలాంటి పనులు చేస్తుండడం ఆశ్చర్య కరంగా ఉంది.

మనకు రాముళ్ళు క్రిష్ణుడులు వద్దంటున్న నిర్మాత

టాలీవుడ్ లో డిస్ట్రి బ్యూటర్ గా కెరియర్ ని మొదలు పెట్టిన దిల్ రాజు ఒక్కో అడుగు వేసుకుంటూ ఇండస్ట్రి లో తనకంటూ ఓ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రి ప్రముఖులలో ఒకడిగా చేరిపోయాడు. కెరియర్ మొదటి నుండి హిట్స్ కొడుతూ వచ్చిన దిల్ రాజు ఈ మధ్య కాలంలో అలాంటి హిట్స్ అందించడంలో మాత్రం వెనకపడుతున్నాడు. సాధారణంగా సినిమా వాళ్ళంటే బోలెడన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే! అయితే ఈ నిర్మాత కూడా ఎన్నడు లేంది ఇప్పుడు ఉన్నట్లుండి ఓ సెంటిమెంట్ ని ఫాలో అవాలని డిసైడ్ అయ్యాడు.n n ఎందుకంటే ఇప్పటి వరకు దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో ఘోరమైన ప్లాప్ సినిమాలు ఎవైన ఉన్నాయా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు... రామ రామ కృష్ణ కృష్ణ, రామయ్య వస్తావయ్య, కృష్ణాష్టమి. ఈ సినిమాలు దిల్ రాజు ఎంతో ముంచేశాయి. దీంతో దిల్ రాజు చేయబోయే తదుపరి సినిమాల పేర్లలో రాముళ్ళు కృష్ణుడుల పేర్లు వద్దు బాబు మనకు అంటూ స్పష్టం చేశాడట.

ఎన్టీఆర్ లుక్ పై పంచ్ వేసిన సంపూర్నేష్ బాబు

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ పై పంచ్ వేసాడు . ఇటీవల రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ సైడ్ లుక్ లో కనిపించిన విషయం తెలిసిందే . ''సైడ్ యాంగిల్ లో ఉన్నాడు ..... సైడ్ అయిపోతాడేమో అనుకున్నారేమో , నేరుగా ఫేస్ చేసే దమ్ము నీకోచ్చినప్పుడు విశ్వరూపమే '' అంటూ కామెంట్ చేసి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎంత ఫోర్స్ గా ఉందో చెప్పకనే చెప్పాడు ,ఎన్టీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించాడు సంపూ . n nకొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత , నిత్యా మీనన్ లు నటిస్తుండగా కీలక పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నాడు . ఈ చిత్రాన్ని ఆగష్టు 12 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 

రెండో హిట్ మహేష్ కి ఎవరు ఇవ్వలేకపోతున్నారు

సూపర్ స్టార్ మహేష్ బాబు కు మొదటి సినిమాతో హిట్ అందించిన దర్శకులు ఎవరు కూడా మళ్ళి రెండో హిట్ ఇవ్వలేక పోతున్నారు. మొదటి నుండి మహేష్ కెరియర్ ని అబ్సర్వ్ చేస్తే ఈ విషయం ఇట్టే తెలిసి పోతుంది. అయితే ఈ విషయం గురించి మనం మొట్ట మొదటి సారిగా దర్శకుడు గుణ శేఖర్ గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి సినిమా "ఒక్కడు" మహేష్ కు సూపర్ హిట్ అందించాడు. మహేష్ అదే నమ్మకంతో మరో రెండు చాన్స్ లు ఇస్తే అర్జున్, సైనికుడు అనే అట్టర్ ప్లాప్ సినిమాలు అందించాడు.n nఆ తర్వాత మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు కూడా రెండు చాన్స్ లు ఇచ్చాడు. మొదటి సినిమా 'అతడు' మహేష్ రేంజ్ ని పెంచేసి, ఆ తర్వాత  'ఖలేజా' అంటూ భారీ ప్లాప్ ని అందించాడు. ఎస్ డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా ఇలాగె చేశాడు. దూకుడు చిత్రంతో మహేష్ ని ఓ రేంజ్ కు తీసుకెళ్ళిన శ్రీనువైట్ల, ఆగడు చిత్రంతో మహేష్ ని ఆడుకున్నాడు.  సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రంతో హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తాజాగా బ్రహ్మోత్సవం తో ప్లాప్ ని అందించి ఇప్పుడు ఈ లిస్టు లోకి చేరిపోయాడు.n nఅయితే ఈ విషయంలో దర్శకులు పూరి జగన్నాధ్ మాత్రం మహేష్ తో చేసిన రెండు సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టేశాడు. మొదట చేసిన పోకిరి చిత్రంతో ఇండస్ట్రి రికార్డులు బద్దలు కొట్టిన పూరి మహేష్ మరో సారి బిజినెస్ మ్యాన్ చేసి మరో సూపర్ హిట్ ని కొట్టేశారు.

తప్పు చేసానని కుమిలిపోతున్న నిఖిల్

తల్లిదండ్రుల కు చెప్పకుండా ,ఆపరేషన్ చేస్తే ఎత్తు పెరుగుతారని భావించి ఆపరేషన్ చేయించుకొని చాలా తప్పు చేసానని కుమిలిపోతున్నాడు నిఖిల్ రెడ్డి . నిఖిల్ అనగానే యంగ్ హీరో నిఖిల్ అనుకోవద్దు , ఎత్తు పెరగాలని భావించి ఇటీవల కాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డి . ఇప్పటికి కాళ్ళకు ఆపరేషన్ జరిగి 50 రోజులు దాటినప్పటికీ ఇంకా నిలబడలేక పోతున్నాను , నిలబడాలంటే ఇప్పటికీ నా తండ్రి సహకారం లేకుండా లేవలేకపోతున్నాను .......... చాలా తప్పు చేశాను ఇన్ని రోజులు సెలవు పెడితే జాబ్ కూడా ఉంటుందన్న గ్యారెంటీ లేదని కుమిలిపోతున్నాడు . n nఏప్రిల్ 5న నిఖిల్ తల్లిదండ్రులకు చెప్పకుండానే గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు నిఖిల్ కాళ్ళ కు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే . రెండు రోజుల్లోనే నిలబదతావ్ అని చెప్పారట డాక్టర్లు కానీ 50 రోజులైనా ఇంకా కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు నిఖిల్ . ఇక నిఖిల్ తల్లిదండ్రుల పరిస్థితి అయితే వర్ణనా తీతం . 

బాలయ్య మనసు ఎక్సట్రార్డినరి అంట తెలుసా

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే! ఒకటవ శతాబ్దపు శాతవాహన రాజైన గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొన్నే మే 9నుండి రెగ్యులర్ షూటింగ్ ని మొరాకో దేశంలో ప్రారంభించింది. అయితే అక్కడ బాలయ్య మరియు ఇతర నటి నటుల పై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు కొన్ని వార్ సీన్స్ లని కూడా షూట్ చేసి నట్లు సమాచారం. అయితే ఇటీవలే అక్కడి షెడ్యుల్ ని పూర్తి చేసుకున్న చిత్రం బృందం తిరిగి ఇండియా కు వచ్చేశారు.n nఅయితే ఇక్కడే ఓ విషయం ఉండండి అది మన బాలయ్య గురించే. బాలయ్య కున్న రేంజ్ కి అక్కడి నుండి ఫస్ట్ క్లాస్ లో తరిగి ఇండియా కు రావచ్చు. కాని మూడుగంటల ప్రయాణానికి అనవసర ఖర్చు ఎందుకు అని స్వయంగా బాలయ్య బాబే దర్శకుడు క్రిష్ తో చెప్పి ఎకనామి క్లాస్ లో ప్రయాణం చేసి ఇండియా కు వచ్చాడంట. అయితే ఎకానమీ క్లాస్ లో బాలయ్య ను చూసిన కొందరు ఆయనతో ఫోటోలు కూడా దిగారట. అందులో ఓ అభిమాని ఇదేంటి ఫస్ట్ క్లాస్ అంత ఖాళీగానే ఉంది కదా అని దర్శకుడు క్రిష్ ని అడిగితే బాలయ్య బాబే స్వయంగా ఎకనామి క్లాస్ లో వెళదాం అని చెప్పాడు అందుకే ఇలా అని చెప్పాడట క్రిష్. వెంటనే ఈ విషయన్ని ఆ అభిమాని సోషల్ మీడియా ద్వారా బాలయ్య బాబు తో దిగిన ఫోటోతో పాటు ఆర్డినరి క్లాస్ లో ప్రయాణం చేసి... తన మనసు  ఎక్సట్రార్డినరి క్లాస్ అనేది బాలయ్య  ప్రూవ్ చేసుకున్నాడంటూ  పోస్ట్ చేశాడు.

#150 చిరు : రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే

మెగాస్టార్ చిరంజీవి తమిళ బ్లాక్ బస్టర్ కత్తి చిత్రాన్ని తెలుగులో వి వి వినాయక్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత రీ ఎంట్రి ఇస్తూ చిరు చేస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.  ఇప్పటికే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కూడా మ్యూజిక్ రికార్డింగ్ మొదలు పెట్టేశాడు కూడా. n nగత నెల అఫీషియల్ గా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని వచ్చే నెల జూన్ 6నుండి మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారట మేకర్స్. ఈ చిత్రంలో చిరు సరసన బాహుబలి భామ అనుష్క హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ కంపెని బ్యానర్ పై, లైక ప్రొడక్షన్స్ వారితో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విషయాలను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట మేకర్స్.

బాహుబలి పని మళ్ళీ మొదలైంది

వేసవి సెలవులను ఎంజాయ్ చేసిన బాహుబలి టీం మళ్ళీ పనిలో నిమగ్నమైంది . బాహుబలి తో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డు స్థాయిలో వసూళ్ళ ని సాధించడంతో బాహుబలి పార్ట్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . దాంతో ఆ అంచనాలను అందుకోవడానికి మరింతగా కష్టపడుతున్నారు చిత్ర బృందం . n nప్రస్తుతం బాహుబలి ది కంక్లూజన్ క్లైమాక్స్ సీన్స్ భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు దర్శ ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి . షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే ఏడాది వేసవిలో బాహుబలి ది కంక్లూజన్ ని భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రభాస్ , రానా , రమ్యకృష్ణ , అనుష్క , తమన్నా ,సత్యరాజ్ తదితరులంతా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తోంది . 

కూతురు కోసం కష్టపడుతున్న అర్జున్

కూతురు హీరోయిన్ గా సక్సెస్ సాధించాలనే లక్ష్యం తో చాలా రిస్క్ చేస్తున్నాడు హీరో అర్జున్ . తెలుగు , తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అర్జున్ కు ''ఐశ్వర్య '' అనే కూతురు ఉంది . ఆమెని హీరోయిన్ గా విశాల్ నటించిన ''పట్టత్తు యానై '' చిత్రం తో పరిచయం చేసాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఐశ్వర్య కు మళ్ళీ చాన్స్ లు రాలేదు దాంతో కూతురు కోసం దర్శక నిర్మాతగా మారాడు అర్జున్ . n nడిఫరెంట్ లవ్ స్టొరీ ని టేకప్ చేస్తున్న అర్జున్ ఈ చిత్రంతో తప్పకుండా కూతురు కి హిట్ వస్తుందని నమ్ముతున్నాడట . అందుకే తమిళ , కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు . మరి హిట్ ఇస్తాడా ? ఐశ్వర్య సక్సెస్ అవుతుందా ? లేదా ? అన్నది తెలియాలంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

జనాలు ఈ హీరో మాటలు వింటారా

ఆంధ్రప్రదేశ్ జనాలను నిండా ముంచిన భారతీయ జనతా పార్టీ నాయకులకు వాళ్ళ భార్యలు ఇంట్లో భోజనం పెట్టొద్దని ,అన్నం పెట్టకుండా మాడ్చితే అప్పుడు ఆ నాయకులకు మన బాధ ఏంటో తెలుస్తుందని బిజెపి నాయకులపై విరుచుకుపడ్డాడు నటుడు శివాజీ . గతకొంత కాలంగా సినిమాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేస్తున్నాడు శివాజీ . n nఇటీవల ఏపి బిజెపి ఇంచార్జ్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో మరోసారి మీడియా ముందుకు వచ్చాడు శివాజీ . బిజెపి నాయకుల పర్యటనలను అడ్డుకోవాలని , వాళ్ళని నిలదీయాలని........ అలాగే బిజెపి నాయకుల భార్యలు వాళ్ళకు అన్నం పెట్టొద్దని చెబుతున్నాడు . మరి శివాజీ మాటలు అక్కడి మహిళలు కానీ ఆ జనాలు కానీ వింటారా అన్నదే ప్రశ్న.

పవన్ , మహేష్ మళ్ళీ దెబ్బ తిన్నారు

పదమూడేళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జానీ సినిమాతో , సూపర్ స్టార్ మహేష్ బాబు నిజం సినిమాతో ఘోర పరాజయాలను పొందగా మళ్ళీ అదే సీన్ పదమూడేళ్ళ తర్వాత రిపీటయ్యింది . 2003 ఏప్రిల్ లో జానీ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ కాగా , 2016 ఏప్రిల్ లో రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం కూడా దారుణ పరాజయాన్ని పొందింది . అదే కోవలో మహేష్ నటించిన నిజం చిత్రం 2003 మేలో రిలీజ్ అయి ఘోర పరాజయం పొందగా తిరిగి పదమూడేళ్ళ తర్వాత అదే మేజిక్ ని రిపీట్ చేసాడు మహేష్ . 2016 మే లో రిలీజ్ అయిన బ్రహ్మోత్సవం చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది . దాంతో ఇద్దరు స్టార్ హీరోలు పదమూడేళ్ళ క్రితం  .... ..... .....  పదమూడేళ్ళ తర్వాత ఒకే రకమైన రిజల్ట్ అందుకోవడంతో ఆశ్చర్య పోతున్నారు . ఇంకా ఈ సెంటిమెంట్ ని మరింత బలపరిచేలా 2003 కు ముందు ఈ ఇద్దరికీ బ్లాక్ బస్టర్ లు వచ్చాయి ఖుషీ తో పవన్ , ఒక్కడు తో మహేష్ పండగ చేసుకున్నారు . కానీ వాటి తర్వాత వచ్చిన జానీ , నిజం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి . 

తమన్నా అభినేత్రి ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

సౌత్ లో సూపర్ హాట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న తమన్నా తాజాగా తన కెరియర్ లోనే మొట్టమొదటి సారి ఓ లేడి ఓరియంటెడ్ సినిమా 'అభినేత్రి' చేస్తోంది. తమిళ తెలుగు హిందీ బాషలలో ఏక కాలంలో రూపొండుతున్న ఈ చిత్రాన్ని విక్రమ్ తో  'నాన్న' సినిమా తీసిన దర్శకుడు ఎ ఎల్ విజయ్ తెరకేక్కిస్తున్నాడు. అలాగే ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవ ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హాట్ భామ అమీ జాక్సన్ ఈ చిత్రంలో ఓ మత్తెక్కించే ఐటెం సాంగ్ కూడా చేస్తోందట. క్రేజీ విలన్ సోను సూద్ కూడా ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటిస్తున్నాడట.n nఇప్పటికే శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని వచ్చే నెల జూన్ 3న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీంతో పాటే ప్రభుదేవా చేసిన ఓ డ్యాన్స్ వీడియో కూడా విడుదల చేయున్నారట. ఈ విషయాన్నీ తెలుగు వెర్షన్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రచయిత కోన వెంకట్ తెలియజేశాడు.

చెన్నైకి చేక్కేస్తున్న జనతా గ్యారేజ్ టీమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్  బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. శర వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రానికి ఇటీవలే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఓ వారం పాటు విరామం తీసుకొని ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అంతటి నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది.n nఅయితే ఈ వారం నుండి యూనిట్ రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టనుందట. ఇప్పటికే హైదరాబాద్, ముంబాయి లలో కీలక షెడ్యుల్స్ పూర్తి  చేసుకున్న మేకర్స్ తాజా షెడ్యుల్ కోసం చెన్నై వేలుతున్నారట. ఇక్కడే ఈ నెల చివరి వరకు షూటింగ్ చేయనునట్లు తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేసుకొని యూనిట్ మళ్ళి తిరిగి జూన్ 1 కల్ల హైదరాబాద్ తిరిగి రానున్నట్లు సమాచారం.n nఎన్టీఆర్ సరసన ఈ చిత్రంలో సమంత నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరో మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుంద ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తునాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

నాని జెంటిల్ మెన్ ట్రైలర్ టాక్ : ఇంట్రెస్టింగ్

న్యాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో యమ జోష్ మిద ఉన్నాడు. హీరోగా పరిచయం చేసి అష్టా చమ్మా చిత్రంతో హిట్ ఇచ్చిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని ప్రస్తుతం ఓ వైవిధ్యమైన చిత్రం 'జెంటిల్ మెన్" చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ మొదలు టిజర్ వరకు ఈ చిత్రం పై చాలా ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయి.n nఅయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. హీరోయిన్ సురభి చెప్పు చెప్పు.... అంటూ మొదలైన ట్రైలర్ చాలా ఆసక్తి కరంగా ఉంది.వోయోలేన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీస్ ఎప్పుడొస్తాయో కథ....అంటూ నాని తనలోని యాక్షన్ యాంగిల్ ని చూపించాడు. ఆ తర్వాత అడ్వెంచర్స్ స్టార్ట్ అంటూ సినిమాలోని వైవిధ్యాన్ని చూపిస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు. చూస్తుంటే నాని ఈ చిత్రంలో హీరోగా విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తున్న నాని ఈ చిత్రంతో కూడా కొత్తగా ఎదో ట్రై చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా నాని ఈ ట్రైలర్ తో సినిమాపై భారీగానే అంచనాలు క్రియేట్ చేశాడు.n nనాని సరసన ఈ చిత్రంలో మలయాళ భామ థామస్ నివేద, సురభి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఆదిత్య 369 చిత్రాన్ని నిర్మించిన నిర్మాత నిర్మిస్తున్నాడు. వచ్చే నెల జూన్ 10న ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేయనున్నారు. 

మహేష్ కు మే నెల గండం ఉందేమో

మహేష్ బాబు కు మే నెల గండం ఉందని మహేష్ ఫ్యాన్స్ భయపడినంతా జరిగింది . బ్రహ్మోత్సవం చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేస్తున్నారు అని ప్రకటించగానే మహేష్ ఫ్యాన్స్ భయపడిపోయారు ఎందుకంటే మే నెలలో ఇంతకుముందు రిలీజ్ అయిన మహేష్ చిత్రాలు ఘోర పరాజయాన్ని పొందాయి . నిజం చిత్రం మే 23 , 2003 లో, నాని చిత్రం మే 14న , 2004 లో  రిలీజ్ అయి రెండు కూడా ఘోర పరాజయం పొందాయి . వాటి తర్వాత వచ్చిన ఈ బ్రహ్మోత్సవం కూడా దారుణ ఫలితాన్ని చవి చూడటం తో మహేష్ కు మే నెల అచ్చి రాదని వాపోతున్నారు. సినిమా రంగం సెంటిమెంట్ రంగం కాబట్టి అందునా ఫలానా సమయంలో వచ్చిన ఫ్లాప్ అంటే భయపడిపోతారు అందుకే మహేష్ ఫ్యాన్స్ మే నెలలో బ్రహ్మోత్సవం రిలీజ్ అనగానే ఆశలు వదులుకున్నారు , కానీ కుటుంబ కథా చిత్రం అనగానే తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నారు . కట్ చేస్తే ఆ సెంటిమెంట్ ని మరోసారి రుజువు చేసింది బ్రహ్మోత్సవం . 

670 కోట్లు ఇస్తామన్న నో చెప్పాడట ఆ హీరో

జేమ్స్ బాండ్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన హీరో డేనియల్ క్రెయిగ్, దాదాపు పెదేళ్ళ కిందట వచ్చిన 'క్యాసినో రాయల్స్' చిత్రంతో జేమ్స్ బాండ్ సినిమాలు మొదలు పెట్టాడు. ఇప్పటివరకు నాలుగు బాండ్ సిరిస్ లు చేసిన డేనియల్ క్రెయిగ్ తాజాగా మరో బాండ్ చిత్రం చేయడానికి దాదాపు 670 కోట్ల భారీ బంపర్ ఆఫర్ ఇచ్చిన కూడా చస్తే చేయను జేమ్స్ బాండ్ సినిమాలు ఇక అంటున్నాడట.n nగతేడాది వచ్చిన జేమ్స్ బాండ్ చివరి సిరిస్ 'స్పెక్టర్' ప్రమోషన్ లో "జేమ్స్ బాండ్ సినిమాలు చేయడం కంటే చనిపోవడం మేలు అని చెప్పిన డేనియల్ ఇక నుండి జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించను అని ప్రకటించాడు. మరి జేమ్స్ బాండ్ చిత్రాలు తీసే ఎం జీ ఎం సంస్థ మాత్రం తాజాగా మరో జేమ్స్ బాండ్ చిత్రానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందులో హీరోగా నటించడానికి డేనియల్ కు 99 డాలర్స్ అంటే దాదాపు ఇండియన్ కరెన్సీ లో 670 కోట్లు ఇస్తామన్న జేమ్స్ బాండ్ సినిమాలు చేయలేనని చెప్పాడట.మరి చూద్దాం ఎం జీ ఎం సంస్థ డేనియల్ క్రెయిగ్ నే ఎలాగైనా ఒప్పిస్తుందో లేక మరో జేమ్స్ బాండ్ ని రంగంలోకి దింపు తుందో తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ పై స్పూఫ్ డైలాగ్ పంచ్ వేసిన సంపూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం "జనతా గ్యారేజ్". అయితే తాజాగా ఈ మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్ కి అందరి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపధ్యంలో స్పందించిన బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ఎన్టీఆర్ పైనే ఓ స్పూఫ్ డైలాగ్ పంచ్ వేశాడు. n nఅయితే ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ సైడ్ యాంగిల్ నుండి బైక్ వెళుతున్నట్లు కనిపిస్తాడు. దాని పై సంపూ ట్వీట్టర్ ద్వారా స్పందిస్తూ  బృందావనం సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ 'సిటి నుంచి వచ్చాడు, స్మార్ట్ గా ఉన్నాడు అనుకుంటున్నారేమో... క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా' అనే డైలాగ్ కు స్పూఫ్ గా సంపూ  " సైడ్ యాంగిల్ లో కనిపిస్తున్నాడు. సైడ్ అయి పోతడనుకుంటున్నారేమో....నేరుగా పేస్ చేసే దమ్ము నికోచ్చినప్పుడు విశ్వరూపమే" అంటూ ట్వీట్ చేశాడు.

సమంత ప్రేమిస్తున్నది ఏ హీరోనో

ఇంతకుముందు హీరో సిద్దార్థ్ తో నిండా ప్రేమలో మునిగిపోయి అతడితో బ్రేకప్ అయ్యాక కొంతకాలం సైలెంట్ గా ఉన్న సమంత మరోసారి లవ్ లో పడింది . అయితే ఇప్పుడు కూడా లవ్ లో పడింది హీరో తోనే . అప్పుడేమో సిద్దార్థ్ తో లవ్ లో ఉన్నట్లు ప్రకటించిన సమంత ఇప్పుడు మాత్రం ఆ యంగ్ హీరో పేరు మాత్రం చెప్పడం లేదు , ఎందుకంటే గతంలోనే అనవసరంగా ప్రేమలో పడి ఆ విషయాన్నీ అందరికీ చెప్పానని కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకునే ముందు వరకు చెప్పను అని అంటోంది . n nఅయితే సమంత ప్రేమిస్తున్న హీరో ఎవరు అన్న చర్చ జరుగుతోంది . సమంత నటించిన హీరోలలో నాగ చైతన్య కు ఎక్కువ ఆస్కారం ఉందని అంటున్నారు . ఈ ఇద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం ''ఏమాయ చేసావే '' దాంట్లో ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది ,దాని తర్వాత ఆటోనగర్ సూర్య చేసారు . ఇక ముచ్చటగా మూడో చిత్రంగా ''మనం '' చేసారు అది పెద్ద హిట్ దాంతో నాగచైతన్య తో లవ్ లో ఉందా లేదా నితిన్ తోనా అన్న చర్చ జరుగుతోంది . అ ఆ చిత్రంలో సమంత నితిన్ సరసన నటించిన విషయం తెలిసిందే . n nమొత్తానికి సమంత ఏ హీరోతో లవ్ లో ఉన్నది చెప్పడం లేదు కానీ  పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటోంది . 

రికార్డులు బద్దలుకొట్టలేకపోయిన మహేష్

మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రానికి రిలీజ్ కు ముందు చాలా పాజిటివ్ టాక్ రావడంతో తప్పకుండా రిలీజ్ రోజున సరికొత్త రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయ్యింది . మొదటి ఆట నుండే బ్రహ్మోత్సవం చిత్రానికి డివైడ్ టాక్ రావడంతో కొత్త రికార్డులు కాదు కదా కనీసం తన రికార్డులను చేరుకోలేక పోయాడు మహేష్ . n nమొదటి రోజున వరల్డ్ వైడ్ 18 కోట్ల షేర్  ని మాత్రమే రాబట్టాడు మహేష్ . బిజినెస్ లో సంచలనం సృష్టించిన మహేష్ ఓపెనింగ్స్ ని మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేక పోయాడు . బ్రహ్మోత్సవం రికార్డులు సృష్టిస్తుందని మహేష్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా భావించారు కానీ రికార్డుల మాట మరిచిపోయేలా చేయడంతో అందరూ షాక్ అయ్యారు . 

సుక్కు చెర్రి సినిమాకు సంగీత దర్శకుడు ఫిక్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళంలో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన రేగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన మరోసారి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉండగా..n nఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం కోసం స్టొరీ లైన్ కూడా ఒకే అయిపొయింది. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ లవ్ స్టొరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నయట. దీంతో మేకర్స్ ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టింది. సుకుమార్ సినిమాలకు ఎప్పుడు సంగీతాన్ని అందించే దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా సుక్కు  ఫైనల్ చేశాడట.త్వరలోనే దేవి తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేయనున్నట్లు సమాచారం.n nమైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 22న మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా లాంచ్ చేయనున్నారట. ఆగస్ట్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టి వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

మహేష్ పై తిట్ల వర్షం కురిపించాడు

నేరుగా మహేష్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ మహేష్ నటించిన బ్రహ్మోత్సవం చిత్రంలోని మహేష్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ......... అదేదో సామెత లా తెలియని విధంగా ,బాగా తగిలేలా తిట్ల వర్షం కురిపించాడు సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ . n nఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీ హీరోలపై సెటైర్లు వేసే రాంగోపాల్ వర్మ ఈసారి మహేష్ పై పడ్డాడు . మహేష్ డ్యాన్స్ చూసి ఇంటర్నేషనల్ డ్యాన్సర్ లు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలని పరోక్షంగా మహేష్ నే తిట్టాడు . అంతేనా శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు మాత్రమే ఫ్యామిలీ సినిమా చేస్తారు కానీ కృష్ణ , ఎన్టీఆర్ లు కాదని మరో ఘాటు విమర్శ కూడా చేసాడు వర్మ . ఓవరాల్ గా వర్మ చేసిన ట్వీట్ ల సారాంశం ఏమిటంటే ''బ్రహ్మోత్సవం '' ఓ చెత్త సినిమా అని , మహేష్ డ్యాన్స్ ఇంకా పరమ చెత్త అని . నేను చేసింది విమర్శలు కాదు పాజిటివ్ గా తీసుకోండి అంటూ కొసమెరుపు కూడా ఇచ్చాడు వర్మ . 

ఎన్టీఆర్ కు ముఖ్యమంత్రి అయ్యే రాత ఉందట

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు  ముఖ్యమంత్రి అయ్యే రాజయోగం ఉందట . జాతక రీత్యా ఎన్టీఆర్ కు ఆ చాన్స్ ఉందని అయితే అది ఇప్పుడే కాదని అంటున్నారు . తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే . అయితే అప్పట్లో ఎన్టీఆర్ ప్రచారం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు . దాని తర్వాత ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ దూరం పెట్టింది . ఎక్కడ ఎన్టీఆర్ తమ వారసుడి కి పోటీ అవుతాడేమో నని . n n2014 ఎన్నికల తర్వాత తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది , ఆ పార్టీలో ఉన్న ఎం ఎల్ ఏ లు ఒక్కొక్కరుగా అధికార టిఆర్ ఎస్ లోకి దూకారు. మొత్తం 15 మందిలో  ఇక మిగిలి ఉన్నది ముగ్గురు మాత్రమే , ఆ ముగ్గురిలో ఆర్ . క్రిష్నయ్య టిడిపి తో అంటీముట్టనట్లుగానే ఉన్నారు . ఈ దశలో కొద్ది కాలం తర్వాత ఎన్టీఆర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేతబడితే ప్రయోజనం ఉంటుందని అప్పుడు 2019 ఎన్నికల్లో కాకపోయినా 2024 లోనైనా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని అంటున్నారు . 

బహిరంగంగా లిప్ లాక్ చేసి షాక్ ఇచ్చాడు

హీరోయిన్ ఉమా థర్మన్  తన పక్కన ఉండేసరికి వెంటనే దగ్గరకు లాక్కొని గట్టిగా లిప్ లాక్ చేసి సంచలనం సృష్టించాడు ఫియట్ మాజీ సిఈఓ లాపో ఎల్కన్ . ఈ హటాత్పరినామానికి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయి అలాగే చూస్తుండి పోయారు . ఇక ఉమా థర్మన్  మాత్రం కోపం వచ్చినప్పటికీ ఆ కోపాన్ని మాత్రం బయట పడనీయ లేదట .n nఎయిడ్స్ బాధితుల సహాయార్ధం నిర్వహించిన షోలో ఉమా థర్మన్ తో పాటు లాపో ఎల్కన్ కూడా పాల్గొన్నాడు ఈ కార్యక్రమంలో . అయితే లాపో ఎల్కన్ కు 1.32 కోట్లు ఈ కార్యక్రమంలో గెలుచుకోవడంతో ఆ సంతోషాన్ని పట్టలేక పక్కనే ఉన్న ఉమా థర్మన్ ని గట్టిగా కౌగిలించు కొని సిగరెట్ తాగుతున్న విషయాన్నీ మర్చిపోయి గట్టిగా ముద్దులు పెట్టేసాడు లాపో . ఈ సంఘటన పట్ల అక్కడున్న వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసారు కానీ ఉమా మాత్రం సైలెంట్ గా ఉండిపోయిందట . 

ఫైనల్ : రజినీకాంత్ కబాలి విడుదల తేది ఫిక్స్

సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం "కబాలి". ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ  చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రజినీ పుట్టిన రోజు సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో మొదలు మొన్న వచ్చిన ఫస్ట్ లుక్ టిజర్ వరకు సినిమాపై అంతకంతకు అంచనాలు రెట్టింపు అవుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన టిజర్ తోనే రజినీకాంత్ ప్రపంచ రికార్డ్ నమోదు చేశాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మాములుగా పెరగలేదు.n nఅభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంబందించిన విడుదల తేదిని మేకర్స్ ఫైనల్ చేసి అఫీషియల్ గా ప్రకటించారు. రజిని బాషా తర్వాత మళ్ళి ఈ చిత్రంలో గ్యాంగ్ స్టార్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జాలై 1వ తేదిన తమిళ తెలుగు బాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రజినీ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. కూతురు కిడ్నాప్ నేపధ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కలై పులి ఎస్ థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

మీనాకు మహేష్ బాబు కావాలట

సీనియర్ హీరోయిన్ అయిన మీనా కు మహేష్ బాబు కావాలట. ఎందుకో తెలుసా మీనా ఇప్పుడు కొత్తగా సౌత్ లో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. ఎదో చిన్న చితకా సినిమాలు కాదండోయ్ తమిళ తెలుగు బాషలలో బడా సినిమాలు తీసేందుకు బాగానే ప్లాన్స్ చేస్తోందట మీనా. ఇప్పటికే తమిళ తెలుగు ఇండస్ట్రి లకు సంబందించిన హీరోలను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగానే  తెలుగులో మహేష్ తో నిర్మాతగా మారి ఓ బడా  సినిమా తిసి భారీ హిట్ కొట్టాలని బాగా ఆశ పడుతోందట. ఇక తమిళంలో అయితే తన మొదటి నిర్మాణాన్ని విలక్షణ నటుడు కమల్ హసన్ తో చేయాలనీ భావిస్తోందట.n nప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించిన బ్రహ్మోత్సవం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరో పదిహేను రోజుల్లో తమిళ క్రేజీ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సామజిక నేపధ్యంలో సాగే ఓ చిత్రం చేయనున్నాడు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పూరి జగన్నాధ్ లు మహేష్ తో చేయడానికి రెడీ గా ఉన్నారు. మరి ఈ నేపధ్యంలో మాజీ హీరోయిన్ మీనా కళ నెరవేరాలంటే  త్రివిక్రమ్ తోనో లేదంటే పూరి తోనో  ఒప్పందం చేసుకుంటే సరి లేదంటే మహేష్ కోసం మీనా ఇంకా చాన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. 

అదిరిపోయిన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం "జనతా గ్యారేజ్". జూనియర్ పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ సాయంత్రం 6 గంటలకి విడుదల చేశారు మేకర్స్. మిర్చి శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ , టెంపర్ నాన్నకు ప్రేమతో తర్వాత ఎన్టీఆర్ లు కలిసి జనతా గ్యారేజ్ చిత్రంతో హైట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యారు.nఅయితే అందరి అంచనాలకు తగ్గట్లే తాజాగా విడుదల అయిన జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఉన్నాయి. ఈ పోస్టర్స్ లో యంగ్ టైగర్ చాలా యంగ్ గా న్యూ లుక్ లో కనిపిస్తున్నాడు.సాధారణంగా సినిమా సినిమా కి లుక్ పరంగా వైవిధ్యలు చూపిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రానికి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఒక పోస్టర్ లో ఎన్టీఆర్ అక్విలా 650 ప్రో బైక్ పై స్టైలిష్ గా వెళుతూ బియార్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు.రెండో పోస్టర్ లో అయితే చిన్న చిరునవ్వుతో కాలేజ్ కి వెళుతున్న కుర్రాడిలా చాలా కొట్టగా కనిపిస్తున్నాడు.మొత్తంగా కొరటాల శివ అభిమానులు ఆశిస్తున్నట్లుగానే జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ ని ప్రసెంట్ చేయనున్నట్లు కనిపిస్తోంది.nఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ పై ఓ రేంజ్ అంచనాలు ఇండస్ట్రీ లో ఉన్నాయి. ఇప్పుడీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఆ అంచనాలు అన్ని భారీ రేంజ్ కి వెళ్ళిపోయాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన అందాల భామలు సమంత , నిత్య మీనన్ లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

బ్రహ్మోత్సవంతో సూపర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం 'బ్రహ్మోత్సవం'. విజయవాడ బ్యాక్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన తీరు అత్యద్బుతం అనే చెప్పాలి. బంధాలు అనుబంధాలు విలువల నేపధ్యంలో పది మంది ప్రతి రోజు కలిసి ప్రతిరోజును ఓ ఉత్సవం ల జరుపుకుంటే జీవితమే బ్రహ్మోత్సవం అవుతుందనే కాన్సెప్ట్ తో దర్శకుడు ఈ చిత్రాన్ని ఎంతో అద్బుతంగా మలిచాడు. ఇక మహేష్ ఈ చిత్రంలో ఓ కలర్స్ కంపెని స్థాపించి ఎంతో ఎత్తుత్కు తిసుకేల్లిన తండ్రికి కొడుకులాగా చాలా గొప్పగా నటించాడు. ముఖ్యంగా ఇలాంటి చిత్రం చేసేందుకు ఒప్పుకున్న మహేష్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఎందుకంటే అంత సింపుల్ కథ ఎంతో అద్బుతంగా చూపించాడు శ్రీకాంత్ అడ్డాల.n nకాజల్ సమంత ప్రణీత లు తమ స్క్రీన్ ప్రేసేన్స్ తో చాలా బాగా ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే సమంత తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆదరగోట్టేసింది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రతి ఫ్రేం ని చాలా అందంగా చూపించాడు. ఇక మహేష్ బాబు ను అయితే చాలా అందంగా చూపించాడు. తోట తరణీ వేసిన సెట్స్ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. మిక్కి జే మేయర్ సంగీతం చాలా వినసొంపుగా ఉంది. అలాగే గోపి సుందర్ నేపధ్య సంగీతం వల్ల ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ ఓ రేంజ్ లో పండాయి. n nముఖ్యంగా ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని చెప్పవచ్చు. శ్రీమంతుడు తర్వాత వస్తున్న బ్రహ్మోత్సవం అంచనాలు అందుకోవడంలో 100% సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. మొత్తంగా బ్రహ్మోత్సవం తో మన సూపర్ స్టార్ సూపర్ హిట్ కొట్టేశాడండి.

లిప్ లాక్ చేసిన జబర్దస్త్ రేష్మి

జబర్దస్త్ షో తో పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్న భామ రేష్మి. చిట్టి పొట్టి బట్టలతో .... హాట్ హాట్ గా యాంకరింగ్ చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన ఈ భామ తాజాగా గుంటూర్ టాకీస్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది . ఈ చిత్రంలో హీరో లిప్స్ ని లాక్ చేసి కుర్రకారు కి మరింత హుషారు ని అందించింది . ఇప్పటికే హాట్ హాట్ అందాలతో అలరించిన ఈ భామ గుంటూర్ టాకీస్ తో వెండితెర పై కూడా సత్తా చాటాలని భావిస్తోంది.

ఆ పుకార్లు సంచలనం సృష్టించాయి

దాసరి నారాయణరావు కు ఆరోగ్యం సరిగా లేదని ,అసలు చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడు తున్నారనే వార్తలు నిన్న ఫిలిం నగర్ లో సంచలనం సృష్టించాయి . ఆఘమేఘాల మీద ఈ పుకారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతటా వ్యాపించింది దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది చిత్ర పరిశ్రమ . అయితే అవన్నీ వట్టి పుకార్లే అని దాసరి క్షేమంగా ఉన్నాడని అవన్నీ గాలి వార్తలే అని కొట్టి పారేసారు  దాసరి శిష్యులు. అయితే ఈ పుకార్లు షికారు చేయడానికి కారణం దాసరికి వ్యతిరేకంగా ఉన్న ఒక వర్గం అని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది . ఈ మద్య దాసరి కత్తి రీమేక్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు దాంతో ఈ పుకారు చెలరేగి ఉండవచ్చు అని అంటున్నారు అలాగే మరోవైపు కాపు లు పెద్ద ఎత్తున తలపెట్టిన సభ విషయంలో కూడా ఏమైనా తేడా వచ్చి ఉండవచ్చని అందుకే ఇలాంటి పుకార్లని వదిలారని వాపోతున్నారు . అయితే రాజకీయాలు ,పుకార్ల లీలలు ఎలా ఉన్నప్పటికీ దాసరి ఆరోగ్యంగా ఉన్నాడన్న వార్త తెలుగు సినీప్రముఖులను ఊపిరి పీల్చుకునేలా చేసింది .  

హీరో ఆర్య త్రిష ని ఎంత మాటన్నాడో తెలుసా

తమిళ హీరో ఆర్య త్రిష ని ఎంత మాటన్నాడో తెలుసా .......... త్రిష నాకు చెల్లెలు లాంటింది అని అన్నాడు దాంతో త్రిష కూడా చాలా బాధపడుతోంది . నేను ఆర్య కు చెల్లెలు లాంటిదాన్ని కావడం ఏంటి ? నాన్సెన్స్  ఆర్య ని కలిసి ఈ విషయం గురించి అడుగుతాను అని అంటోంది త్రిష . ఆర్య అంటే చాలామంది హీరోయిన్ లకు ఇష్టం పైగా అందరికీ బిర్యానీ పెట్టి బుట్టలో పడేస్తుంటాడు అనే పేరుంది కూడా . అలాగే త్రిష కు కూడా బిర్యానీ పెట్టాడట దాంతో ఆర్య అంటే చాలా ఇష్టం త్రిష కు కానీ సడెన్ గా త్రిష నాకు చెల్లెలు లాంటిదని చెప్పడంతో త్రిష చాలా హర్ట్ అయ్యింది . అందుకే ఆర్య ని నిలదీస్తానని అంటోంది . 

ఖచ్చితంగా దర్శకత్వం చేస్తా - క్రేజీ స్టార్ రవితేజ

రవితేజ అంటే ఒక ఎనర్జీ ........... తన ఎనర్జీ తో సినిమాకే ఓ ప్రత్యేకతను తీసుకొస్తాడు. అయన సినిమాలు కుటుంబం అందరు కలిసి చూసేలా ఉంటాయి ఇలాంటి లీడింగ్ రాయడం అవసరం లేని హీరో ! రవి తేజ కు మాస్ లో విపరిత్యమైన ఫాలోయింగ్ ఉంది. అందుకే అయన సినిమాలకు జనాలు ఎగబడతారు. ఎంటర్ టైన్మెంట్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే రవితేజ మరో సారి ప్రేక్షకులకు కిక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టిఆర్ ఆర్ట్స్ పతాకం పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 21 న విడుదల కానున్న సందర్బంగా హీరో రవితేజ తో ఇంటర్వ్యూ ... 1. బాగా సన్నబడినట్టు ఉన్నారు కారణ ? సినిమా కోసమేనా ? లేదంటి నేనే కావాలని డైటింగ్ బాగా చేశాను అందుకే ఇలా ? అంతే కాని సినిమా కోసం కాదు. దాదాపు ఓ పది కిలలు తగ్గాను. 2. ఈ కిక్ 2 ఎలా ఉంటుంది ? మంచి ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా కాకపొతే కాస్త యాక్షన్ పార్ట్శ్ ఎక్కువగా ఉంటుంది ? 3. అప్పుడొచ్చిన కిక్ కు ఇది సీక్వెలా ? అస్సలు కాదండి. నిజానికి కిక్ సినిమా కథ కు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదు. అది వేరే కథ , ఇది వేరే కథ ? అసలు ఈ సినిమా సీక్వెల్ కాదు. కాకపొతే దీనికి కిక్ 2 టైటిల్ బాగుంటుందని పెట్టాం . 4. మరి ఈ సినిమాలో కిక్ కొడుకంట అనే డైలాగ్ వస్తుంది కదా ? అది నిజమే కాని అలాటి కథే ఇది ? దానికి దగ్గరలో ఉంటుందని అ పేరు పెట్టం . నిజానికి ఈ సినిమాలో నాపేరు రాబిన్ హుడ్.5. ఈ సినిమా విడుదల ఆలస్యం అవడానికి కారణం ? కారణం అంటే సినిమా బాగా రావాలనే ఉద్దేశం తో కాస్త పోస్ట్ ప్రొడక్షన్ విషయం లో ఎక్కువ సమయం పట్టింది. 6. కళ్యాణ్ రామ్ బ్యానర్ లో చేయడం ఎలా ఉంది ? చాలా కంఫర్ట్ గా ఉంది. నిజానికి ఈ బ్యానర్ లో నాలుగైంది సంవస్తరాల క్రితమే చేయాలి కాని కుదరలేదు. నిజంగా ఈ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. 7. హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ తో మీ కాంబినేషన్ ? రాకుల్ చాలా మంచి నటి ? మంచి టైమింగ్ ఉంది ? ఈ మద్య వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. తనతో పనిచేయడం చాలా కంఫర్ట్ గా ఉంది . 8. సురేందర్ రెడ్డి గురించి ? సూరి నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటినుండే తెలుసు. కమిట్ మెంట్ ఉన్న దర్శకుడు. కిక్ తో మంచి కమర్షియల్ హిట్ అందుకున్నం. ఈ సినిమాకూడా తను బాగా తీసాడు. 10. ఇంతకి ఈ సినిమాలో హైలెట్స్ ఏమిటి ? ఈ సినిమాలో చాలా ఉన్నాయి. తమన్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఇప్పటికే పాటలు పెద్ద హిట్ ? అలాగే అర్ అర్ కూడా బాగుంటుంది. ఇక పరమహంస ఫోటోగ్రాపి కూడా వండర్ఫుల్ గా ఉంటుంది . రామ్ లక్ష్మణ్ ల ఫైట్స్ కూడా బాగుంటాయి. 11. ఇప్పుడు పరిశ్రమ పరిస్తితి ఎలా ఉందని మీ ఫీలింగ్ ? నిజంగా బాహుబలి సినిమాతో అందరి మైండ్ సెట్ మారింది ? ఇప్పుడు బాహుబలి తరువాత అన్ని సినిమాలు మంచి హిట్స్ అవుతున్నాయి. ఇటివలే శ్రీమంతుడు . సినిమా చూపిస్తా మావా . నిజంగా మంచి పరిణామమే కదా . 12. హిట్స్ ని ప్లాప్ లను ఎలా తీసుకుంటారు ? నేను ఇదివరకే చెప్పా ? హిట్స్ వచ్చిన ప్లాప్ వచ్చిన ఒకే లా ఉంటా ? నేను చేసే పని గురించే ఆలోచిస్తా. 13. విబిన్నమైన సినిమాలు చెస్తరా? ఇదివరకు చాలా చెసాగా . విబిన్న సినిమాలు చేస్తే రిజల్ట్ కూడా విబిన్నంగానే వస్తుంది మరి . 14. మల్టి స్టారర్ చిత్రాలు చేస్తారా? ఖచ్చితంగా చేస్తా . అలంటి కథలు రావాలి కదా . 15. తదుపరి చిత్రాలు ? ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వం లో బెంగాల్ టైగర్ షూటింగ్ జరుగుతుంది. అది కుడా దాదపు పూర్తీ అయ్యింది ? వచ్చే నెలలో విడుదల కావొచ్చు . 16. దర్శకత్వం వహిస్తారా ? తప్పకుండ కాని దానికి ఇంకా టైం ఉంది . వేరే హీరోతో చేస్తా

జైలు గోడలు బద్దలుకొట్టి బయటకు వస్తాడట

జైలు గోడలు బద్దలు కొట్టి బయటకి వస్తానని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ యాసిన్  భత్కల్ తన భార్య జహిదా తో ఫోన్ లో మాట్లాడినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి నిఘా వర్గాలు . దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళతో పాటు దేశ వ్యాప్తంగా 40బాంబు పేలుళ్ళ కేసుల్లో నిందితుడైన యాసిన్ భత్కల్ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో కారాగార జీవితాన్ని అనుభవిస్తున్నాడు . కాగా చర్లపల్లి జైల్లో ని ఫోన్ తో ఢిల్లీ లో ఉన్న తన భార్య జహిదా కు దాదాపు పదిసార్లు ఫోన్ చేసి చర్లపల్లి జైలు గోడలను బద్దలు కొట్టినా తప్పించుకుంటానని డమాస్కస్ పారిపోదామని అక్కడ తన స్నేహితులు మనకు అన్ని ఏర్పాట్లు చేస్తారని చెప్పినట్లు తెలియడంతో నిఘా వర్గాలు పసిగట్టాయి . ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో చర్లపల్లి జైలు లో భద్రత మరింత కట్టుదిట్టం చేసారు . 

బిజినెస్ లో బాహుబలి రికార్డులు సృష్టిస్తుంది

తెలుగులో అత్యంత భారి ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన బాహుబలి జూలై 10 న విడుదలకు సిద్దం అయ్యింది. తెలుగులో భారి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ లో కుడా అలంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా విడుదలకు ముందే దాదాపు వందకోట్ల బిజినెస్ ను చేసి టాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. సినిమా విడుదలకు ముందే ఈ స్తాయి బిజినెస్ రావడంతో  ఇప్పుడు రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా ఒక్క తెలుగు వెర్షనే 110 కోట్ల బిజెనెస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కేవలం నైజాం ఏరియాకు మాత్రమే 22 కోట్ల బిజినెస్ జరిగింది? ఆంధ్రా , తెలంగాణా లో కలిసి 65 కోట్ల బిజినెస్ జరిగిందట. ఇక ఇండియా మొత్తంగా కలిసి 83 కోట్లు బిజినెస్ చేసింది. ఇక ఓవర్సీస్ లో కుడా దాదాపు 42 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. మరి ఈ సినిమా విడుదలైతే ఇంకెంత వసూలు చేస్తుందో, ఒక్క తెలుగులోనే ఈ స్తాయిలో ఉంటె తమిళ , హిందీ , మలయాళ భాషల్లో ఈ సినిమా ఖచ్చితంగా 300 కోట్ల బిజినెస్ చేసి ఉండాలి. విడుదలకు ముందే ఈ స్తాయి బిజినెస్ చేస్తే సినిమా విడుదల తరువాత ఈ సినిమా చరిత్ర సృష్టించడం ఖాయం.   

మహేష్ డైలాగ్ ని చెప్పి కేక పెట్టించిన గౌతమ్

''ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు '' ఈ డైలాగ్ ని వీర లెవల్లో చెప్పి మహేష్ అప్పట్లో కేక పెట్టించగా ఇప్పుడు అదే డైలాగ్ ని మహేష్ తనయుడు గౌతమ్ చెప్పి మళ్ళీ కేక పెట్టిస్తున్నాడు మహేష్ అభిమానుల చేత . గౌతమ్ కి కూడా సినిమాలపై చాలానే ఆసక్తి ఉంది ,అందుకే గౌతమ్ ని 1నేనొక్కడినే చిత్రంలో మహేష్ చిన్నప్పటి రోల్ చేసి మెప్పించాడు . ఆ సినిమా ప్రభావమో ఏమో కానీ మహేష్ చిత్రాల్లోని డైలాగ్స్ ని బాగా వంట బడుతున్నాడట గౌతమ్ . పోకిరి చిత్రంలోని ఆ డైలాగ్ ని చెప్పి మహేష్ ఫాన్స్ చేత శెభాష్ అనిపించాడు గౌతమ్ .

ఎన్టీఆర్ -కళ్యాణ్ రామ్ లు కలిసి నటించనున్నారు

నందమూరి అభిమానులకు నిజంగా శుభవార్తే ! ఎందుకంటే నందమూరి హీరోల్లో అందరికీ మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో వాళ్ళు కలిసి నటిస్తే చూడాలని ఆ వంశ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు . నందమూరి అభిమానుల ఆశ తీర్చడానికి ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ లు నడుం కట్టనున్నారు . ఈ ఇద్దరూ కలిసి మల్టీ స్టారర్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు . ఇటీవల టెంపర్ చిత్రంతో ఎన్టీఆర్ కు సక్సెస్ ఇచ్చిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నట్లు తెలుస్తోంది . వంశీ చెప్పిన కథ ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్ కు నచ్చడంతో ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి నందమూరి వంశాభిమానులను సంతోషంలో మున్చేత్తనున్నారు .

వర్మ కు కౌంటర్ ఇచ్చిన ఒమర్

వర్మ తీస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ లే అంటూ బాగానే దెప్పి పొడిచాడు జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా . వరల్డ్ కప్ లో టీం ఇండియా సెమి ఫైనల్ లో దారుణంగా ఓటమి పాలవ్వడంతో వర్మ కారుకూతలు కూసిన విషయం తెలిసిందే . దాంతో ఒమర్ అబ్దుల్లా పై విధంగా స్పందించాడు . దర్శకులు రాం గోపాల్ వర్మ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన చిత్రాల్లో విజయాలు సాధించిన వాటి కంటే పరాజయాల సంఖ్యే ఎక్కువ ! అందులోనూ పరమ చెత్త సినిమాలు కూడా బోలెడు తీసాడు కానీ సెమీ ఫైనల్ లో ఇండియా ఓటమి చెందడం తో సోషల్ మీడియాకి ఎక్కాడు .

డబ్బింగ్ చిత్రాలదే హవా

నిన్న రిలీజ్ అయిన చిత్రాల్లో డబ్బింగ్ చిత్రాలైన ''చిరునవ్వుల చిరుజల్లు '','' డా . సలీం '' చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది . ఇక స్ట్రైట్ తెలుగు చిత్రాలకు కనీసం స్పందన కూడా లభించలేదు సగటు ప్రేక్షకుల నుండి . ఈ సంవత్సరం ఆరంభంలో 'రఘువరన్ బిటెక్ ' తో డబ్బింగ్ చిత్రాల జోరు ఎక్కువయ్యిందనే చెప్పాలి . రఘువరన్ బిటెక్ ,పందెం కోళ్ళు ,మగమహారాజు ,పిశాచి ,అనేకుడు ఇలా డబ్బింగ్ చిత్రాలకు బాగానే కలెక్షన్లు వస్తుండటం తో తాజాగా రిలీజ్ అయిన చిరునవ్వుల చిరుజల్లు ,డా . సలీం చిత్రాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో డబ్బింగ్ చిత్రాలదే హవా లా కనబడుతోంది . 

రాంగోపాల్ వర్మ - ఎటాక్

రాంగోపాల్ వర్మ ...   ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు . అత్యంత తక్కువ ఖర్చుతో జీరో సైజ్ లేదా లో బడ్జెట్ సినిమాలూ  తీయగలరు . "అతివృష్టి అనావృష్టి" లాగ అన్నమాట!!  ఇటీవలకాలంలో  చిన్న సినిమాలు  అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఆయన ఈ  పద్ధతికి స్వస్తి పలికి,   ఇప్పుడు మళ్ళీ తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చేశారు.  "ఎటాక్"  అనే వర్కింగ్ టైటిల్ తో... హై ఇంటెన్సిటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న తన తాజా చిత్రంలోని ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం తెలుగు చలన చరిత్రలో ఇంతవరకూ ఎవరూ షూట్  చెయ్యని విధంగా..  హైదరాబాద్ ఓల్డ్ సిటీ పురానాపూల్ బ్రిడ్జ్ మీద దాదాపు 1000 మంది పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ను  రెయిన్ ఎఫెక్ట్ లో తియ్యబోతున్నారు దర్శక సంచలనం రాంగోపాల్ వర్మ.  ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ఫిబ్రవరి 27 ఉదయం నుంచి జరగబోతోంది.   హైదరాబాద్ ధూల్ పేట్ బ్యాక్ డ్రాప్ లో  నడిచే ఈ చిత్రంలోని కొంత మంది నటీనటుల  లుక్స్ ని  రిలీజ్   చెశారు రాంగోపాల్ వర్మ.సి.కళ్యాణ్ నిర్మాణంలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది!!

మొదలైన ఆస్కార్ అవార్డుల హంగామా

ఆస్కార్ అవార్డుల హంగామా మొదలైంది . అమెరికాలోని లాస్ ఏంజెల్స్ 87వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకి హాలీవుడ్ ప్రముఖులతో పాటు మన బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. అత్యంత ప్రతిస్టాత్మకంగా భావించే ఈ వేడుక ని విజయవంతం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసారు నిర్వాహకులు. దాల్బీ థియేటర్ లో ఈ వేడుకలు ప్రారంభం అయ్యాయి ,కాగా ''విప్లాస్ '' చిత్రంలో అత్యుత్తమ నటన కనబరించినందుకు గాను జేకే సిమ్మన్స్ కి ఉత్తమ సహాయ నటుడు అవార్డ్ లభించింది.

రజనీ ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు

సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ పై కోపంగా ఉన్నారు. రజనీ అభిమానులు రెహ్మాన్ పై కోపంగా ఉండటం ఏమిటి అని అను కుంటున్నారా ! ఎందుకంటే రజనీ నటించిన ''లింగా '' చిత్రానికి రెహ్మాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే . ఐతే ఇటీవల విడుదలైన ఆ చిత్ర పాటలు శ్రోతలకు విన సొంపుగా లేకపోవడంతో సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయట ! ఇక రజనీ అభిమానులైతే రెహ్మాన్ పై చాలా ఆగ్రహంగా ఉన్నారు. చప్పటి ట్యూన్స్ ఇచ్చి మా హీరో పరువు తీసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు రజనీ -రెహ్మాన్ ల కాంబినేషన్ లో వచ్చిన ''శివాజీ '',''రోబో '' చిత్రాల ఆడియో సూపర్ హిట్ కాగా ఈ లింగ ఆడియో మాత్రం చాలా వీక్ గా ఉండటం తో రజనీ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారు. ఐతే రెహ్మాన్ ట్యూన్స్ ఎప్పుడు కానీ విన్న వెంటనే సూపర్ గా అనిపించవు అవి వినగా వినగ ఆకట్టుకుంటాయి. మరి లింగా ట్యూన్స్ థియేటర్ లో ఆకట్టుకుంటాయో చూడాలి .
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..