Home Exclusives రజిని కాంత్ అనారోగ్యం పై క్లారిటీ
TOLLYWOOD
 Exclusives

రజిని కాంత్ అనారోగ్యం పై క్లారిటీ



Saturday June 11th 2016
సూపర్ స్టార్ రజినీకాంత్ కు అనారోగ్యం తలెత్తడం వల్ల అమెరికా వెళ్లి ట్రీట్ మెంట్ చేయించు కుంటున్నాడని అందువల్లే కబాలి చిత్రం ఆడియో వేడుకను నిర్వహించడం లేడని గత రెండు మూడు రోజులుగా మీడియాలో ఒకటే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో పక్క  రజినీ తన ఫ్యామిలీ తో కలిసి అమెరికాకు వెకేషన్ ట్రిప్ వెళ్ళినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో వీటిల్లో ఏ వార్త నమ్మాలో లేదో అభిమానులు గందర గోళం లో పడ్డారు.
n
 
n
అయితే ఇలా వస్తున్న వార్తల పై తాజాగా ఓ క్లారిటీ వచ్చేసింది. రజినీ కూతురు ఐశ్వర్య చేసిన ట్వీట్ తో రజినీ ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు అన్న విషయం ఇప్పుడు తెలిసి పోయింది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు అమెరికా రోడ్ల పై కలిసి నడుస్తున్నప్పుడు దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ ఐశ్వర్య " నాన్న తో అలా సరదాగా మాట్లాడుతూ అమెరికా రోడ్ల పై నడుస్తున్నా" అంటూ ట్వీట్ చేసింది.
n
 
n
సో......దీంతో రజినీ అనారోగ్యం పై వస్తున్న రూమర్స్ కు చెక్ పడిందనే చెప్పాలి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..