ఆ నాలుగు సినిమాల్లో ఏది కొడుతుందో హిట్


four movies are fighting for successఈరోజు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి , నాని వాయిస్ ఓవర్ అందించడమే కాకుండా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ” అ !” , మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వం వహించిన ” మనసుకి నచ్చింది ” , సోడా గోళీసోడా ” , అలాగే ” రచయిత ” అనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . అయితే ఈ నాలుగు చిత్రాలు కూడా మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రాలు కావు ఏ క్లాస్ సెంటర్ సినిమాలు మాత్రమే దాంతో బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ లు లేవు .

కానీ నాని నిర్మించిన ”అ ” సినిమాపై మాత్రం కొంచెం అంచనాలు ఉన్నాయి , మనసుకి నచ్చింది , సోడా గోళీసోడా , రచయిత సినిమాల పట్ల అంతగా సుముఖత లేదు కానీ ఈరోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మరికొద్ది గంటల్లోనే వాటి ఫలితాలు రాబోతున్నాయి . మరి ఈ నాలుగు సినిమాల్లో అయితే నాని సినిమా పట్ల నే కాస్త మొగ్గు ఉంది . ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు సాలిడ్ బ్లాక్ బస్టర్ మాత్రం అందలేదు . అది వేసవిలో తీరుతుందేమో చూడాలి .