సెట్స్ మీద ఉండగానే లాభాలు


Sun TV bags Mass Maharaja Ravi Teja’s next for a whooping priceమాస్ మహారాజ్ రవితేజ తాజాగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే .రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అప్పుడే మంచి క్రేజ్ వచ్చింది అలాగే సెట్స్ మీద ఉండగానే నిర్మాతకు లాభాలు తెచ్చి పెడుతోంది . రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ రావడం భారీ ఆఫర్ దక్కడం సంచలనం సృష్టిస్తోంది .

జెమిని ఛానల్ వాళ్ళు ఈ సినిమా సాటిలైట్ హక్కుల తో పాటుగా డిజిటల్ , డబ్బింగ్ రైట్స్ కలుపుకొని మొత్తం మీద 25 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చారు . సెట్స్ మీద ఉండగానే 25 కోట్ల బేరం అంటే రేపు రిలీజ్ కి ముందే నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్ దక్కడం ఖాయమని అంటున్నారు . భారీ బడ్జెట్ తో రూపొందుతున్నప్పటికీ థియేటర్స్ పరంగా మంచి బిజినెస్ అయ్యే ఛాన్స్ ఉంది దాంతో నిర్మాతకు మంచి లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది .