Home గాసిప్స్ రానాకు బిచ్చగాడికి లింక్ ఏంటి అసలు
టాలీవుడ్
 గాసిప్స్

రానాకు బిచ్చగాడికి లింక్ ఏంటి అసలు



Saturday June 11th 2016
టాలీవుడ్ లో హీరో కం విలన్ గా ఓ ఊపు ఉపెస్తున్న యంగ్ టాలెంటెడ్ దగ్గుబాటి రానా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే! అయితే తాజాగా తమిళ సంగీత దర్శకుడు విజయ్ అంటోని తమిళంలో నటించిన  "పిచ్చైక్కారన్" చిత్రం ఇటీవలే తెలుగులో "బిచ్చగాడు" గా డబ్ అయి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇంతకంటే ముందే ఈ చిత్రంతో యంగ్ హీరో రానా కు లింక్ ఉందట. అదేంటంటే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసే ఆలోచనే లేదట మేకర్స్ కు. తెలుగులో రానను హీరోగా పెట్టి రీమేక్ చేయాలనీ భావించి, మేకర్స్ రానాని సంప్రదించారట. కాని ఈ చిత్రంలో బిచ్చగాడిగా నటించడానికి ఇష్టం లేని  రానా ఈ చిత్రాన్ని చేయలేననని సున్నితంగా చెప్పేశాడట.
n
 
n
దీంతో మేకర్స్ చేసేది ఏమి లేక ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కేవలం 50 లక్షలకే అమ్మేశారు. ఇక తీరా సినిమా విడుదల అయ్యాక రిసల్ట్ చూస్తే సూపర్ డూపర్ హిట్ తో దుసుకపోతూ ఏకంగా 10 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. మొత్తంగా రానా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఓ సూపర్ హిట్ ని మిస్ అయిపోయాడు అని అంతా అనుకుంటున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..