Home Headines
TOLLYWOOD
 Headlines

ఆది పినిశెట్టి ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ల సినిమా

Tuesday March 28th,2017
''ఒక విచిత్రం '  సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, స‌రైనోడు, మ‌లుపు స‌హా ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి హీరోగా రుగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌జ్ఞం, పిల్లానువ్వులేని జీవితం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. ''డిఫ‌రెంట్ క‌థ‌ ఇది .  ఆది పినిశెట్టి స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు. ల‌వ్‌, కామెడి, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. ఆది కెరీర్‌లో మ‌రో బెస్ట్ మూవీగా నిలుస్తుంది.  సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌చేస్తాం'' అని ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాత డి.ఎస్‌.రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్య‌త‌లు వ‌హిస్తారు.
Read More...

67ఏళ్ల ముసలాడితో శృంగారం చేస్తున్న భామ

Tuesday March 28th,2017
67 ఏళ్ల ముసలాడితో శృంగారం చేస్తున్న భామ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా ...... మిస్తీ చక్రవర్తి . నితిన్ హీరోగా నటించిన చిన్నదానా నీకోసం చిత్రంలో నటించింది మిస్తీ చక్రవర్తి . తాజాగా ఈ భామ నటిస్తున్న చిత్రం '' బేగం జాన్ ''. నసీరుద్దీన్ షా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు . నసీరుద్దీన్ - మిస్తీ చక్రవర్తి ల మధ్య రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించారు . ఇక నసీరుద్దీన్ షా అయితే దాదాపుగా నగ్నం గా ఉండగా మిస్తీ చక్రవర్తి కూడా దాదాపుగా నగ్నం గా ఉంది దాంతో రచ్చ రచ్చ అవుతోంది.పైగా ఇద్దరు కూడా బెడ్ మీద ఉన్నారు అది కూడా మిస్తీ చక్రవర్తి మీద నసీరుద్దీన్ షా పడుకొని ఉన్నాడు . ఈ ఇద్దరి మధ్య ముప్పయ్యేళ్ల కు పైగా తేడా ఉంది దాంతో ఇదొక హాట్ న్యూస్ అయిపొయింది . వేశ్య కథల నేపథ్యంలో తెరకెక్కిన బేగం జాన్ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
Read More...

షాకింగ్ న్యూస్... బాలయ్య కు నోటీసులు

Tuesday March 28th,2017
నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు నిజంగా షాకింగ్ న్యూసే ! బాలయ్య కు కోర్టు నోటీసులు జారీ చేసింది . ఇంతకీ బాలయ్య కు నోటీసులు రావడానికి కారణం ఏంటో తెలుసా ........ తెలంగాణ ప్రభుత్వం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను ని మినహాయించడమే అసలు కారణం దాంతో కొంతమంది కోర్టు ని ఆశ్రయించారు . ఫక్తు కమర్షియల్ సినిమా అయిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను ని ఎలా మినహాయించారు అంటూ కోర్టు ని ఆశ్రయించారు దాంతో స్పందించిన కోర్టు బాలయ్యకు నోటీసులు అందించింది.గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో పాటు రుద్రమదేవి చిత్రానికి కూడా వినోదపు పన్ను ని మినహాయించింది తెలంగాణ ప్రభుత్వం అందుకే శాతకర్ణి చిత్రంతో పాటు రుద్రమదేవి చిత్రానికి కూడా నోటీసులు అందించింది . బాలయ్య ,అలాగే తెలంగాణ ప్రభుత్వం స్పందించే తీరు బట్టి మిగతా వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి.
Read More...

45 కోట్ల షేర్ సాధించిన పవన్

Tuesday March 28th,2017
రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు రోజుల్లో 45 కోట్ల షేర్ ని సాధించాడు పవన్ కళ్యాణ్ . మార్చి 24 న రిలీజ్ అయిన కాటమ రాయుడు చిత్రం మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ ని వసూల్ చేసాడు . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 45 కోట్ల షేర్ సాధించడంతో బ్రేక్ ఈవెన్ కావడం ఖాయమని నమ్ముతున్నారు . పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు . అయితే ఈ చిత్రానికి డివైడ్ టాక్ కూడా అంతే స్పీడ్ గా వైరల్ అవుతోంది కానీ టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్ల ని సాధిస్తున్నాడు పవన్.బ్లాక్ బస్టర్ రేంజ్ కాదు కానీ హిట్ మాత్రం అయ్యింది కాటమ రాయుడు చిత్రం . మొదటి మూడు రోజుల్లో మంచి వసూళ్లు రావడంతో మునుముందు మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా ఉంది.
Read More...

అల్లు అర్జున్ సినిమాలో మరో అర్జున్

Tuesday March 28th,2017
అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రం తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు అల్లు అర్జున్ . ఆ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు మరో అర్జున్ కూడా నటించనున్నాడు . ఇంతకీ అల్లు అర్జున్ సినిమాలో మరో అర్జున్ ఏంటి ? అన్నదే కదా మీ డౌట్ ? ఆ అర్జున్ ఎవరో కాదండి సీనియర్ హీరో అర్జున్ . తెలుగు , తమిళ చిత్రాల్లో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగిన అర్జున్ అల్లు అర్జున్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు.దువ్వాడ జగన్నాధం చిత్రం తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది వక్కంతం వంశీ చిత్రం . వక్కంతం వంశీ ఎప్పటి నుండో దర్శకుడు కావాలని కళలు కన్నాడు కానీ కొంతమంది హీరోలు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి హ్యాండ్ ఇచ్చారు దాంతో అల్లు అర్జున్ వక్కంతం కు ఛాన్స్ ఇచ్చాడు.
Read More...

రోగ్ సినిమా పరిస్థితి దారుణంగా ఉంది

Tuesday March 28th,2017
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన చిత్రం అందునా కొత్త హీరో పైగా భారీ బడ్జెట్ చిత్రం అయినప్పటికీ రోగ్ సినిమాపై అంచనాలు లేకుండా పోయాయి . గతకొంత కాలంగా పూరి జగన్నాద్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ వరుసగా ఘోరమైన ప్లాప్ లను అందుకున్నాయి దాంతో పూరి మార్కెట్ దారుణంగా పడిపోయింది . ఇక ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు సినిమాని కొనే బయ్యర్లు లేక . తెలుగు , కన్నడ భాషాల్లో రూపొందిన రోగ్ కన్నడంలో కూడా సొంతంగానే రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే భారీ బడ్జెట్ పైగా కొత్త హీరో కాబట్టి.ఈనెల 31న రిలీజ్ అవుతోంది . ఇక ఓవర్ సీస్ పరిస్థితి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఇక్కడే పట్టించుకునే వాళ్లే లేరు ఇక ఓవర్ సీస్ లో పట్టించుకునే వాళ్ళు ఎవరు ? రోగ్ ని అక్కడ కూడా రిలీజ్ చేయాలి కాబట్టి సొంతంగానే రిలీజ్ చేస్తున్నారు . మరి రిలీజ్ అయితే కానీ తెలీదు ఏమౌతుందో.
Read More...

యాంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ ఫ్యాన్స్

Tuesday March 28th,2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు చిత్రం ఈనెల రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ ఛానల్ లో లైవ్ కార్యక్రమం చేపట్టారు . అందులో పవన్ ఫ్యాన్స్ పాల్గొన్నారు . అయితే కాటమ రాయుడు గురించి వీర లెవల్లో లెక్చర్ లు ఇచ్చిన పవన్ ఫ్యాన్స్ యాంకర్ ఇచ్చిన రేటింగ్ కి ఒళ్ళు మండి సదరు స్టూడియో లోని కుర్చీలను , ఇతర సామాగ్రిని పూర్తిగా చిందర వందర చేసి నానా రభస చేసారు . అయితే ఈ తతంగమంతా స్టూడియో లోని కెమెరాలు బంధించాయి , దాంతో రసాభాస అయ్యింది.ఇంతకీ యాంకర్ ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ...... 3 . నా రేటింగ్ 3 అంటూ యాంకర్ చెప్పఁడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు . అంతే వెంటనే స్టూడియో లో గొడవకు దిగారు . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read More...

ఈ భామని కూడా బెడ్ మీదకు రమ్మని వేధించారట

Monday March 27th,2017
యాంకర్ గా అందరినీ అలరించడం తో హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చాయి లేఖా వాషింగ్టన్ కు . అయితే హీరోయిన్ ఛాన్స్ నీకు ఇస్తాను ...... అందుకు నాకు ఏమిస్తావు ? అంటూ బెడ్ మీద స్వర్గం అందించమని ఓ తమిళ దర్శకుడు డైరెక్ట్ గా అడిగేశాడట దాంతో ఖంగుతిన్న లేఖా వాషింగ్టన్ ఆ దర్శకుడి కి సాధ్యమైనంత దూరం పాటించిందట . అయితే ఇన్నాళ్లు ఈ విషయాలపై ఏ హీరోయిన్ కూడా అంతపెద్దగా నోరు విప్పలేదు కానీ మలయాళ హీరోయిన్ విషయంలో జరిగిన ఘోరమైన సంఘటన బయటకి పొక్కడంతో ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు పలువురు హీరోయిన్ లు.నాకు ఇలాగ జరిగింది , నన్ను గోకడానికి ట్రై చేసారు ...... అంటూ పలువురు హీరోయిన్ లు క్యూ కడుతున్నారు . తాజాగా ఆ లిస్టులోకి లేఖా వాషింగ్టన్ కూడా చేరింది . హీరోయిన్ గా రాణించడం చాలా కష్టమని కూడా అంటోంది లేఖా.
Read More...

అల్లు అర్జున్ మీద పుకార్లు

Monday March 27th,2017
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా దువ్వాడ జగన్నాధం చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే గత రెండు మూడు రోజులుగా అల్లు అర్జున్ పై రకరకాల పుకార్లు షికారు చేసాయి . అల్లు అర్జున్ కు ఏదో అయ్యిందని , షూటింగ్ లో పాల్గొనలేకపోతున్నాడని ...... ముఖం మీద రాషెస్ వచ్చాయని రకరకాల మాటలు వినిపించాయి . ఈ వార్తలు మరింతగా స్ప్రెడ్ కావడంతో అబ్బే ! అటువంటిదేమీ లేదని అంటున్నారు కానీ గత వారం రోజులుగా హైదరాబాద్ లో ఎండలు మండిపోతున్నాయి దాంతో అల్లు అర్జున్ స్వల్ప అస్వస్థత కు గురయ్యాడట.దాంతో షూటింగ్ లో పాల్గొనలేక పోతున్నాడు అల్లు అర్జున్ . అయితే ఈ విషయం మరింత పెద్దది కాకముందే స్పందిస్తే బాగుంటుంది అని భావించిన ఆ చిత్ర యూనిట్ మాత్రం ఏమి లేదని అంటున్నారు . ఎండలు బాగా మండుతున్న మాట మాత్రం వాస్తవం దాంతో షూటింగ్ విషయాన్ని పక్కన పెడితే బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనాలు.
Read More...

ఓరి దేవుడా ! ఇంతగా తెగించి చూపిస్తోంది

Monday March 27th,2017
నిన్న మొన్నటి వరకు మోడ్రన్ అమ్మాయిలాగే కనిపించింది కానీ ఇంతటి అల్ట్రా మోడ్రన్ అమ్మాయి అని మాత్రం అనుకోలేదు పలువురు దర్శక నిర్మాతలు . ఇక కుర్రాళ్ళు అయితే ఈ భామ విప్పేస్తున్న బట్టలను , ఆ భామ అందాలను కళ్ళార్పకుండా చూస్తూ తెగ ఇదై పోతున్నారు . ఇక ఈ భామ రెచ్చిపోతున్న తీరు కి ఓరి దేవుడోయ్ ! అంటూ నోరెళ్ళ బెడుతున్నారు . ఎందుకంటే మాగ్జిమమ్ ఎంతగా విప్పెయ్యలో అంతగా బట్టలను విప్పేసి ఫోటో షూట్ చేసిన ఈ భామ ఒక్కో స్టిల్ వదులుతూ సంచలనం సృష్టిస్తోంది . గత రెండు వారాలుగా ఈ తతంగమే జరుగుతోంది.తాజాగా మరింతగా రెచ్చిపోయి పెట్టిన స్టెప్ కుర్రాళ్ళ మతి పోగొడుతోంది . ఇంతకీ ఇంత పచ్చిగా రెచ్చిపోతున్న భామ ఎవరో తెలుసా ...... సీరత్ కపూర్ . రన్ రాజా రన్ చిత్రం లో నటించిన ఈ భామ అవకాశాల కోసం ఇంతగా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేస్తోంది.
Read More...

 1 2 3 >  Last ›

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD