Home Headines
TOLLYWOOD
 Headlines

మహేష్ సినిమాలో నటించమంటే నో చెప్పింది

Thursday April 27th,2017
మహేష్ బాబు సినిమాలో నటించే ఛాన్స్ వస్తే వదులుకోరు కానీ సీనియర్ నటి సుధ మాత్రం ఆ సినిమా చేయనని తిరస్కరించిందట . ఇంతకీ సుధ నో చెప్పిన సినిమా ఏదో తెలుసా ........ .... శ్రీమంతుడు . అవును కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో మహేష్ తల్లిగా నటించమని మొదట సుధనే అడిగారట ! ఇప్పటికే పలు చిత్రాల్లో తల్లిగా , వదినగా నటించింది సుధ . పైగా మహేష్ బాబు అంటే ఇష్టం కూడా కానీ శ్రీమంతుడు చిత్రంలో తల్లి పాత్ర కు అంతగా ప్రాధాన్యత లేదు కాబట్టి అలాంటి పాత్ర ని ఎందుకు చేయాలి డబ్బు కోసమా ? అంటూ నిరాకరించిందట .సుధ చెప్పినట్లుగా శ్రీమంతుడు చిత్రంలో తల్లి పాత్ర కేవలం ఉత్సవ విగ్రహం లా ఉంటుంది అంతేతప్ప ఎలాంటి ప్రాధాన్యత లేదు . అయితే సుధ నిరాకరించడంతో ఆ పాత్రని తమిళ నటి , మాజీ హీరోయిన్ సుకన్య చేత చేయించారు.
Read More...

ప్రభాస్ సాహో టీజర్.... అదరహో

Thursday April 27th,2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న సాహో టీజర్ రానే వచ్చింది . రేపు బాహుబలి 2 రిలీజ్ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సాహో టీజర్ ని రిలీజ్ చేసారు . రేపు థియటర్ లలో ప్రభాస్ అభిమానులు ఈ టీజర్ ని తిలకించవచ్చు . యువి క్రియేషన్స్ పతాకం పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించనున్న ఈ చిత్రం తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందనుంది.రన్ రాజా రన్ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ సాహో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే . బాహుబలి 2 రిలీజ్ అయ్యాక సాహో సెట్స్ మీదకు వెళ్లనుంది . ఇక ఈరోజు సాయంత్రం రిలీజ్ అయిన టీజర్ సంచలనం సృష్టిస్తోంది . యు ట్యూబ్ లో ఇలా అప్ లోడ్ చేసారో లేదో అప్పుడే ట్రెండ్ సృష్టిస్తోంది.
Read More...

పెళ్లి చూపులు డైరెక్టర్ ఏం చేయనున్నాడో తెలుసా

Thursday April 27th,2017
పెళ్లి చూపులు చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ . చిన్న చిత్రంగా వచ్చిన పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా తరుణ్ భాస్కర్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు . తమ సినిమా తరుణ్ భాస్కర్ తో చేయాలనీ తహతహలాడుతున్నారు పలువురు హీరోలు . మొదటి సినిమా ఘనవిజయం సాధించడంతో రెండో సినిమాని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు తరుణ్ భాస్కర్.ఇక రెండో సినిమా ఎలా ఉండబోతోందో తెలుసా ........ ...... పక్కా కామెడీ తో ఉండబోతోందట . కాస్త రొమాన్స్ , ఎంటర్ టైన్మెంట్ , యాక్షన్ కలగలిపి సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు తరుణ్ భాస్కర్ . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు త్వరలోనే తన రెండో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు తరుణ్ భాస్కర్.
Read More...

పెళ్లి వద్దట కానీ విప్పేసి ఊరిస్తోంది

Thursday April 27th,2017
పెళ్లి గిల్లి వద్దు అంటూ పెళ్లి పెటాకులు లేకుండా అందాలను ఆరబోస్తూ విహారయాత్ర చేస్తోంది షెనాజ్ ట్రెజరీవాలా . ఎం టివి లో యాంకర్ గా సంచలనం సృష్టించిన ఈ భామ నాగార్జున హీరోగా నటించిన ఎదురు లేని మనిషి చిత్రంలో హీరోయిన్ గా నటించింది . అయితే ఆ సినిమా యావరేజ్ కావడంతో పాపం ! ఈ భామ ఆశలన్నీ ఆవిరి అయ్యాయి . దాంతో బాలీవుడ్ లో సత్తా చాటుదామని ప్రయత్నాలు చేసింది కానీ అక్కడ కూడా ఈ భామ ఎత్తులు పారలేదు.దాంతో సినిమాలు అంతగా కలిసి రాలేదని ఇప్పుడొక కొత్త అవతారం ఎత్తింది . విహార యాత్ర లు అంటూ ప్రపంచమంతా చుట్టేస్తున్న ఈ భామ ఒంటి పై మాత్రం చాలా చాలా తక్కువ బట్టలు వేసుకొని కుర్రాళ్లకు హీట్ పెంచుతోంది . అన్ని విప్పేసి పెళ్లి వద్దు బాబోయ్ అంటోంది . పెళ్లి వద్దు అన్నది బాగానే ఉంది కానీ మరి ఇలా  విప్పేయడం ఎందుకో.
Read More...

బాహుబలి కి షాక్ ఇచ్చిన ఓవర్ సీస్

Thursday April 27th,2017
బాహుబలి భారీ విజయం సాధించడం తో కన్ను మిన్ను కానకుండా బాహుబలి 2 కి ఎక్కువ రేట్లు ఫిక్స్ చేయడంతో ఓవర్ సీస్ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు . ఓవర్ సీస్ లో బాహుబలి ని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడమే కాకుండా టికెట్ లను కొనకుండా షాక్ ఇచ్చారు అక్కడి డిస్ట్రి బ్యూటర్ లకు . సాధారణంగా తెలుగు సినిమాకు 10 డాలర్లు మాత్రమే రేటు ఉంటుంది కానీ బాహుబలి విషయంలో 25 డాలర్ల వరకు పెంచారు దాని వల్ల మొదటి భాగం భారీ వసూళ్ల ని సాధించింది.అయితే ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించింది అన్న కోణంలో రెండో భాగానికి కూడా ఎక్కువ రేట్లు పెట్టారు ఇక ఇప్పుడు రేటు ఎంతో తెలుసా 33 డాలర్ల నుండి 40 డాలర్ల వరకు రేటు పెంచారు పైగా మీరు ఫలానా చోట బాహుబలి 2 టికెట్స్ కొంటే డిస్కౌంట్ లభిస్తుంది అని ప్రచారం చేస్తున్నారు . బాహుబలి ని చూడాలని ఆశపడుతున్న వాళ్లకు ఈ రేట్లు ఆగ్రహాన్ని తెప్పించాయి అందుకే బాహుబలి బాయ్ కాట్ చేయండి అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఓవర్ సీస్ బయ్యర్లు షాక్ అవుతున్నారు . అంతేనా బాహుబలి దర్శక నిర్మాతలను కూడా మీడియా ముందుకు వచ్చి తిడుతున్నారు ఓవర్ సీస్ జనాలు.
Read More...

బాహుబలి 2 షోలు రద్దు

Thursday April 27th,2017
బాహుబలి 2 షోలు ముంబై లో రద్దు చేసారు . బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా ఈరోజు మరణించడం తో తీవ్ర షాక్ లో ఉంది బాలీవుడ్ అందుకే ఈరోజు రాత్రి జరగాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాత కరణ్ జోహార్ . బాహుబలి ని హిందీలో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రీమియర్ షోల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసారు కరణ్ జోహార్ అయితే వినోద్ ఖన్నా మృతి తో వెంటనే అన్ని షోలు కూడా క్యాన్సిల్ చేసారు.ప్రీమియర్ షోలు క్యాన్సిల్ కావడంతో ఆ సినిమాని ఎంత త్వరగా చూస్తామా అని ఆశగా ఎదురు చూసినవాళ్లకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది . బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో రెండో భాగం పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అయితే ప్రీమియర్ షోలు రద్దు కావడంతో రేపు యధావిధి గా రిలీజ్ కానుంది బాహుబలి ది కంక్లూ జన్.
Read More...

బాహుబలి 2 ని హెచ్చరించిన తలసాని

Thursday April 27th,2017
బాహుబలి 2 రేపు మాత్రమే రిలీజ్ అవుతుందని ఈరోజు రిలీజ్ చేస్తే , బెనిఫిట్ షోలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ . బాహుబలి 2 రేపు రిలీజ్ అవుతుండగా ఈరోజు సాయంత్రమే ప్రత్యేక షోలు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో ఈ విషయం మంత్రి తలసాని కి తెలియడంతో తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసాడు.రేపటి నుండి తెలంగాణ లో 5 షోలు వేసుకోవచ్చని అలాగే రేట్ల విషయంలో కూడా పరిమితులు ఉన్నాయని భారీగా రేట్లు పెంచితే చర్యలు తప్పవని , హై కోర్టు కూడా అనుమతి ఇవ్వలేదని కాబట్టి దాన్ని అతిక్రమించి ప్రత్యేక షోలు వేసినా , రేట్లు ఎక్కువగా పెంచినా సహించేది లేదని స్పష్టం చేసాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ . మంత్రి హెచ్చరికలతో ఇక బాహుబలి 2 రిలీజ్ రేపే అని తేలింది . అయితే స్పెషల్ షోల కోసం టికెట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మరి.
Read More...

ముస్తాబవుతున్న సందీప్ కిషన్ 'నక్షత్రం'

Wednesday April 26th,2017
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”.'నక్షత్రం' చిత్రం ఒక్క పాట మినహా పూర్తయింది. ఈ గీతాన్ని ఓ ప్రముఖ కథానాయిక పై త్వరలోనే చిత్రీకరించ నున్నామని చిత్ర నిర్మాతలు తెలిపారు.అలాగే చిత్రం టీజర్ విడుదల ను ఓ వేడుకగా నిర్వహించనున్నామని తెలిపారు. ఈ చిత్రం లో సుప్రీం హీరో 'సాయి ధరమ్ తేజ్' పోషిస్తున్న పాత్ర అభిమానులను ఎంతగానో అలరిస్తుందన్నారు. మే నెలలో ఆడియో, అదేనెలలో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తు న్నట్లు తెలిపారు. 'పోలీస్ 'అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ 'నక్షత్రం' చిత్రమని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ.
Read More...

బికినీలో రచ్చ రచ్చ చేస్తున్న భామ

Wednesday April 26th,2017
బాలీవుడ్ లో నటించింది అందాలను ఆరబోసింది కానీ అక్కడ సక్సెస్ కాలేకపోయింది దాంతో దక్షిణాది బాట పట్టింది హాట్ భామ రుహి సింగ్ . ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రం చేస్తోంది ఈ భామ అయితే దక్షిణాది లో జెండా పాతాలని భావించిన ఈ భామ రెచ్చిపోయి అందాలను ఆరబోస్తోంది . బికినీ కూడా వేయడానికి అభ్యంతరం లేదని దర్శక నిర్మాతలకు చెప్పడమే కాకుండా వాళ్ళని ఒప్పించి మరీ బికినీ వేసి ఓ పాటలో రెచ్చిపోయిందట.కామన్ గా బికినీ వేయాలని దర్శక నిర్మాతలు హీరోయిన్ ని కోరతారు ,అప్పుడు హీరోయిన్ సీన్ ఏంటి ? అంత డిమాండ్ ఉందా ? అనిఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం రివర్స్ లో రుహి అడగడం , దర్శక నిర్మాతలు ఒప్పుకోవడం జరిగింది . ఇక బికినీ రుహి సింగ్ అందాలు మరింత ఊపు నిచ్చేలా ఉన్నాయట కుర్రాళ్లకు . ఈ దెబ్బ తో ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది రుహి . మరి సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు.
Read More...

ఆగస్టు 9న మహేష్ స్పైడర్ రిలీజ్

Wednesday April 26th,2017
మహేష్ బాబు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అది ఇప్పుడు ఆగస్టు కు వాయిదా పడింది . ఆగస్టు 9న స్పైడర్ సినిమా ని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ముహూర్తం నిర్ణయించారట . ఆగస్టు 9 న మహేష్ బాబు పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే . రెండేళ్ల క్రితం మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఆగస్టు 7న రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.సరిగ్గా మళ్ళీ రెండేళ్ల తర్వాత మహేష్ పుట్టినరోజు న రిలీజ్ అవుతున్న స్పైడర్ కూడా ఘనవిజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు . మహేష్ పుట్టినరోజు న స్పైడర్ సినిమా రిలీజ్ అంటే మహేష్ ఫ్యాన్స్ కు ఏకంగా రెండు పండగలు అన్నమాట . తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
Read More...
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..