Home Headlines అల్లు శిరీష్ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్
TOLLYWOOD
 HEADLINES

అల్లు శిరీష్ కి వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST

చెప్పను బ్రదర్ అనే మాట తప్పు .............మీ బ్రదర్ అల్లు అర్జున్ కు చెప్పండి అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు అల్లు శిరీష్ కు వార్నింగ్ ఇచ్చారు . ఇటీవల అల్లు శిరీష్ హీరోగా నటించిన ''శ్రీరస్తు శుభమస్తు '' రిలీజ్ అయిన సందర్భంగా ఓ చానల్ లో లైవ్ షోకి వెళ్ళాడు శిరీష్ . అయితే కాలర్ లతో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు లైన్లోకి వచ్చాడు . పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అంటూ ఎక్కువ చేస్తున్నాడని అల్లు శిరీష్ తో వాదిస్తుండగా సదరు చానల్ వాళ్ళు కాల్ కట్ చేసారు అలాగే అల్లు శిరీష్ ని విమర్శించే కాల్స్ ని కూడా కట్ చేసారు దాంతో సినిమా హిట్ అయి లైవ్ షోకి వస్తే ఈ అవమానం ఏంట్రా బాబు అనుకుంటూ వెళ్ళిపోయాడట శిరీష్ . అయితే అల్లు శిరీష్ పై విమర్శలు ఎలా ఉన్నప్పటికీ సినిమా మాత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..