Home Headlines నంద్యాల లో 200 కోట్లు
TOLLYWOOD
 HEADLINES

నంద్యాల లో 200 కోట్లు

Tuesday August 08th 2017

నంద్యాల ఉప ఎన్నికలో 200 కోట్లు ఏరులై పారనున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . అధికార - ప్రతిపక్షాల మద్య నువ్వా - నేనా అన్నట్లుగా సాగుతున్న ఈ పోరాటం లో గెలిచి రాబోయే ఎన్నికల్లో మాకు తిరుగులేదు అని చేపుకోవడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు ఇరు పక్షాలు కూడా . అధికార పక్షం వంద కోట్ల నుండి 120 కోట్ల వరకు ఖర్చు చేయడం ఖాయమని , అలాగే ప్రతిపక్ష జగన్ party సైతం 80 కోట్లకు ఎక్కువగానే ఖర్చు చేయడం ఖాయమని అంటున్నారు.

ఓవరాల్ గా 200 కోట్ల పై చిలుకు ఖర్చు పెట్టడం ఖాయమని , ఈ ఎన్నిక ద్వారా బలాబలాలు తేలుతాయని నమ్మకంగా ఉన్నారు . అయితే ఈ ఎన్నిక ద్వారా ఎవరు గెల్చినా ఒనగూడే ప్రయోజనం ఉండదు కానీ మేమే బలంగా ఉన్నామని చెప్పుకోవడానికి తద్వారా 2019 లో రాబోయే ఎన్నికల్లో మాదే విజయం అని చెప్పడానికి రెండు పక్షాలు కూడా విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నాయి . అయితే ఈ విషయం మాత్రం ఎన్నికల సంఘానికి కనిపించదు ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..