Home Headlines 2016 లో వచ్చిన భారీ డిజాస్టర్ లు ఇవే
TOLLYWOOD
 HEADLINES

2016 లో వచ్చిన భారీ డిజాస్టర్ లు ఇవే

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST

2016 సంవత్సరం లో అప్పుడే ఏడు నెలలు కూడా అయిపోతున్నాయి ,కానీ బ్లాక్ బస్టర్ అనే సినిమా మాత్రం ఇంకా రానేలేదు .సోగ్గాడే చిన్ని నాయనా , సరైనోడు బయ్యర్ల పంట పండించాయి  ,బిచ్చగాడు లాంటి డబ్బింగ్ చిత్రం కనక వర్షాన్ని కురిపించింది అయితే ఈ 2016 సంవత్సరం లో ఇప్పటి వరకు డిజాస్టర్ అన్న చిత్రాలు మాత్రం రెండు ఉన్నాయి , ఆ రెండు కూడా నెంబర్ వన్ కుర్చీ కోసం పోరాడుతున్న పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు చిత్రాలు కావడం గమనార్హం . పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ భారీ అంచనాల మద్య రిలీజ్ అయి ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం కాగా దాని తర్వాత వచ్చిన మహేష్ బ్రహ్మోత్సవం కూడా దారుణ పరాజయాన్ని పొందింది . దాంతో ఈ ఏడాది లో ఇప్పటి వరకు నమోదు అయిన భారీ డిజాస్టర్ ల జాబితాలో చోటు సంపాదించు కున్నాయి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..