Home Headlines రజనీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
TOLLYWOOD
 HEADLINES

రజనీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా

Thursday August 11th 2016

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమా లో నటించడానికి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ........ 50 కోట్లు అక్షరాల యాభై కోట్ల రూపాయలు . ఇండియన్ సినిమా సూపర్ స్టార్ గా కీర్తించబడుతున్న రజనీ ఇమేజ్ కి ఎల్లలు లేవని మరోసారి కబాలి ద్వారా నిరూపించాడు . కబాలి కి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ రజనీ ని చూడటానికే ప్రేక్షకులు ఎగబడ్డారంటే అతిశయోక్తి కాదు . కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల గ్రాస్ వసూళ్లు ఆర్జించి చరిత్ర సృష్టించాడు రజనీ . కబాలి కోసం రజనీ 50 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నప్పటికీ ఆ మొత్తం ఇంకా పెరిగే చాన్స్ ఉంది ఎందుకంటే కబాలి కి సినిమా బిజినెస్ మాత్రమే కాకుండా ఇతర వ్యాపార ప్రకటనల రూపంలో కూడా భారీ మొత్తం లో డబ్బు సమకూరింది దాంతో 50 నుండి 75 కోట్ల వరకు ముట్టొచ్చు అని తెలుస్తోంది . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..