Home Headlines షారుక్ ఖాన్‌పై కేసు నమోదు
TOLLYWOOD
 HEADLINES

షారుక్ ఖాన్‌పై కేసు నమోదు

Murali R | Published:February 15, 2017, 12:00 AM IST
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌పై రైల్వే పోలీసులు కేసు పెట్టారు. రాజస్థాన్‌లోని కోటా రైల్వేస్టేషన్ వద్ద తన సినిమా ప్రమోషన్ సమయంలో రైల్వే ఆస్తులపై దాడిచేసి, ధ్వంసం చేసినందుకు షారుక్ పై కేసు పెట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కోటా రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం మీద ఉన్న విక్రమ్ సింగ్  వర్తకుడు ఫిర్యాదు మేరకు  పిటిషన్‌ను విచారించిన రైల్వేకోర్టు షారుక్‌పై కేసు పెట్టాలని సూచించడంతో జీఆర్పీ సిబ్బంది కేసు నమోదుచేశారు.  జనవరి 23వ తేదీన కోటా రైల్వేస్టేషన్ క్రాంతి రాజ్‌ధాని ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ గేటు వద్ద నిలబడిన షారుక్.. అభిమానులకు ఏదో విసిరాడని,  దాన్ని పట్టుకోడానికి అందరూ ఒక్కసారిగా అటువైపు రావడంతో తన ట్రాలీ తిరగబడిపోయి అందులో ఉన్న ఆహార పదార్థాలన్నీ ధ్వంసమయ్యాయని, తనకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయని విక్రమ్ సింగ్ తెలిపారు. దీంతో షారుక్ ఖాన్‌పై ఐపీసీ సెక్షన్లు 427, 120 (బి), 147, 149, 160ల కింద కేసులు పెట్టారు. దాంతోపాటు రైల్వే చట్టంలోని 145, 146, 3 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..