Home Headlines పోలీసుల ప్రశ్నలతో షాక్ తిన్న నటుడు
TOLLYWOOD
 HEADLINES

పోలీసుల ప్రశ్నలతో షాక్ తిన్న నటుడు

Murali R | Published:September 16, 2017, 12:00 AM IST
మలయాళ హీరో దిలీప్ స్నేహితుడు హాస్య నటుడు నదీర్ షా ని కేరళ పోలీసులు రకరకాల ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడంతో స్పృహ కోల్పోయాడు దాంతో అతడికి స్పృహ వచ్చాక ప్రశ్నల వర్షం మళ్ళీ కురిపించారు పోలీసులు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన కేరళలో జరిగింది . ప్రముఖ హీరోయిన్ ని లైంగికంగా వేధించిన కేసులో హీరో దిలీప్ ని పోలీసులు అరెస్ట్ చేసి రెండు నెలలుగా జైల్లోనే పెట్టిన విషయం తెలిసిందే . అయితే దిలీప్ ఈ రకంగా చేయడానికి , చేసిన దానికి సహకారం అందించిన వాళ్ళ లిస్ట్ తెలుసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే దిలీప్ కి సన్నిహితుడైన హాస్య నటుడు నదీర్ షా ని పిలిపించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు . అయితే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు , చూపిస్తున్న ఆధారాలు భయపడిపోయిన నదీర్ షా సొమ్మసిల్లి పడిపోయాడు . దాంతో కొంత రెస్ట్ ఇచ్చారు . బెయిల్ కోసం హీరో దిలీప్ రెండుసార్లు కోర్టు ని ఆశ్రయించాడు అయితే అసలు నిందితుడు దిలీప్ అని పక్కా ఆధారాలతో పోలీసులు కోర్టు కి విన్నవించడంతో రెండుసార్లు కూడా బెయిల్ నిరాకరించింది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..