Home Headlines మళ్ళీ పెళ్లి చేసుకుంటుందట
TOLLYWOOD
 HEADLINES

మళ్ళీ పెళ్లి చేసుకుంటుందట

Wednesday June 14th 2017
నేను సన్యాసి గా హిమాలయాలకు వెళ్లిపోయే దానిలా కనబడుతున్నానా ? తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది బ్లాక్ బ్యూటీ అమలా పాల్ . ఇప్పటికే దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసాక విడాకులు తీసుకున్న ఈ భామ తాజాగా సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యింది . అయితే ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన ఈ భామని మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ? అని అడిగితే శివంగిలా లేచింది.

ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అది కూడా ప్రేమ పెళ్లి చేసుకుంటాను ఆ విషయాన్నీ కూడా త్వరలోనే మీకే చెబుతాను అంటూ షాక్ ఇచ్చింది అమలా పాల్ . మొత్తానికి అమలా పాల్ రెండో పెళ్ళికి రెడీ అవుతుందన్న మాట . ప్రస్తుతం ధనుష్ సరసన వి ఐ పి 2 లో నటిస్తోంది అమలా పాల్.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..