Home Headlines కూతుర్ని హీరోయిన్ని చేస్తే తప్పా
TOLLYWOOD
 HEADLINES

కూతుర్ని హీరోయిన్ని చేస్తే తప్పా

Murali R | Published:August 14, 2017, 12:00 AM IST
35 ఏళ్ల పాటు హీరోగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న అర్జున్ తన కూతురు ఐశ్వర్య ని హీరోయిన్ గా పరిచయం చేసాడు . అయితే ఐశ్వర్య నటించిన సినిమా ప్లాప్ కావడంతో తనని స్టార్ ని చేయడానికి అర్జున్ దర్శకత్వం వహిస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు . ఈనేపథ్యంలో హీరో అయి ఉండి మీ అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేయడం ఏంటి ? అని ప్రశ్నించడం తో హీరోయిన్ ని చేస్తే తప్పేంటి ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నాడు అర్జున్.

35 ఏళ్లుగా ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు అలాగే నేను ఇంతవాడిని కావడానికి కారణం ఈ చిత్ర పరిశ్రమ ఇక్కడ మంచి ఉంది అలాగే చెడు కూడా ఉంది ఒక్క సినిమా రంగంలోనే కాదు అన్ని రంగాల్లో కూడా మంచి చెడు ఉంది ...... నన్ను ఇంతవాడిని చేసిన చిత్ర పరిశ్రమ అంటే నాకు ఎనలేని గౌరవం అందుకే నా కూతురు ని హీరోయిన్ ని చేశాను అంటూ గర్వం గా చెబుతున్నాడు అర్జున్.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..