Home Headlines నాగార్జున సినిమాకేంటి ఈ దుస్ధితి
TOLLYWOOD
 HEADLINES

నాగార్జున సినిమాకేంటి ఈ దుస్ధితి

Thursday February 16th 2017

కింగ్ నాగార్జున మరోసారి వెంకటేశ్వర స్వామి భక్తుడి గా నటించిన చిత్రం " ఓం నమో వెంకటేశాయ   ". ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. రాఘవేంద్రరావు -నాగార్జున ల కాంబినేషన్ లో తెరకెక్కిన అన్నమయ్య , శ్రీరామదాసు చిత్రాలు ఘనవిజయం సాధించడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అయితే సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది ఓం నమో వెంకటేశాయ.

నామమాత్రపు వసూళ్లు సాధిస్తుండటంతో నాగ్ తో పాటు ఆ చిత్ర యూనిట్ కూడా నిరుత్సాహంగా ఉంది. అయితే అన్నమయ్య కు కూడా మొదట్లో ఇలాగే నాసిరకం వసూళ్లు వచ్చాయి కట్ చేస్తే రెండో వారం నుండి కలెక్షన్లు పెరిగాయి , ఆ తర్వాత చరిత్ర సృష్టించింది. కానీ ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ చిత్రానికి ఆ పరిస్థితి ఉంటుందా అన్నది చూడాలి.

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..