Home Headlines ఆ షో అసభ్యంగా ఉందట
TOLLYWOOD
 HEADLINES

ఆ షో అసభ్యంగా ఉందట

Murali R | Published:July 12, 2017, 12:00 AM IST
కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తమిళ సంప్రదాయాలను మంటగలుపుతోందని ,నమిత తో పాటు పలువురు అసభ్యకరంగా ఆ షోలో పాల్గొంటున్నారని కాబట్టి  వెంటనే ఆ షోని ఆపేసి కమల్ హాసన్ తో పాటు నమిత ని అరెస్ట్ చేయాలంటూ హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ కోర్టు కెక్కింది . ఉత్తరాదిన పెద్ద సక్సెస్ అయిన బిగ్ బాస్ షోని దక్షిణాదికి పరిచయం చేస్తూ కమల్ నేతృత్వంలో ఈ షోని ప్లాన్ చేసారు స్టార్ నిర్వాహకులు . అయితే ఈ షో స్టార్ట్ అయినప్పటికీ దానికి పెద్దగా రేటింగ్ రాలేదు దాంతో బిగ్ బాస్ షో ప్లాప్ అని వినబడుతున్న ఈ సమయంలో ఇలా కోర్టు కెక్కడంతో షో నిర్వాహకులే ఈ కేసు వేయించి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే షోకి అనుకున్న రేంజ్ లో ప్రేక్షకుల నుండి స్పందన రాలేదు కాబట్టి ఇలా చేయడం వల్ల కొంత రేటింగ్ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారట.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..