Home Headlines బిచ్చగాడు రైటర్ పుట్టినరోజు
TOLLYWOOD
 HEADLINES

బిచ్చగాడు రైటర్ పుట్టినరోజు

Tuesday August 15th 2017
తెలుగులో బిచ్చగాడు చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు . చిన్న చిత్రంగా వచ్చి సంచలన విజయం సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రం  బిచ్చగాడు. ఆ  చిత్రానికి మాటలు , పాటలు అందించి భేష్ అనిపించుకున్నాడు భాషాశ్రీ . బిచ్చగాడు చిత్రానికి కంటెంట్ తో పాటు భాషాశ్రీ అందించిన పాటలు , మాటలు హైలెట్ గా నిలిచాయనడంలో సందేహం లేదు . భాషాశ్రీ ఇంతకుముందు పలు చిత్రాలకు పనిచేసినప్పటికీ బిచ్చగాడు చిత్రం మాత్రమే భాషాశ్రీ లోని ప్రతిభా పాటవాలను  వెలుగులోకి తెచ్చింది.

తన సినిమాకు భాషాశ్రీ అందించిన రచన  సినిమాకే హైలెట్ గా నిలవడంతో విజయ్ ఆంటోనీ తన తదుపరి చిత్రాలకు కూడా భాషాశ్రీ సహకారం తీసుకున్నాడు . విజయ్ ఆంటోనీ నటన - భాషాశ్రీ రచన వెరసి హిట్ ఫార్ములా కి నాంది అయ్యింది . బిచ్చగాడు తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన బేతాళుడు , యమన్ చిత్రాలలో  విజయ్ ఆంటోనీ నటన కు , భాషాశ్రీ డైలాగ్స్ కు మంచి పేరు వచ్చింది.

విజయ్ ఆంటోనీ చిత్రాలకే కాకుండా ఇతర చిత్రాలకు కూడా రచనా సహకారం అందిస్తున్నాడు ఈ భాషాశ్రీ . ఈరోజు మాటల మాంత్రికుడి పుట్టినరోజు . ఈ సందర్భంగా మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తోంది టాలీవుడ్.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..