Home Headlines రేప్ కేసులో నిర్మాత అరెస్ట్
TOLLYWOOD
 HEADLINES

రేప్ కేసులో నిర్మాత అరెస్ట్

Murali R | Published:September 29, 2017, 4:16 AM IST
సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి పలుమార్లు ఓ యువతి పై అత్యాచారం చేసిన ఘటనలో బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని అరెస్ట్ అయ్యాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో చెన్నై ఎక్స్ ప్రెస్ , దిల్ వాలే వంటి చిత్రాలను నిర్మించాడు కరీం మొరాని. అంతేకాదు షారుఖ్ హీరోగా నటించిన రావన్ చిత్రానికి కూడా సహా నిర్మాత గా వ్యవహరించాడు కరీం . అయితే 2015 లో హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ముంబై నుండి ఓ యువతి ని పలుమార్లు హైదరాబాద్ కు రప్పించి అత్యాచారం చేశాడు.

పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారం చేయడమే కాకుండా నగ్న ఫొటోలను చూపిస్తూ మరింతగా ఇబ్బంది పెడుతుండటంతో ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. అయితే సంఘటన జరిగింది హైదరాబాద్ లో కాబట్టి అక్కడే కంప్లయింట్ ఇవ్వాలని ముంబై పోలీసులు చెప్పడంతో రాచకొండ పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. కేసు నమోదు కావడంతో చేసేదిలేక కరీం మొరాని పోలీసు లకు లొంగిపోయాడు. 
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..