Home Headlines బోయపాటి తదుపరి సినిమాలు
TOLLYWOOD
 HEADLINES

బోయపాటి తదుపరి సినిమాలు

Murali R | Published:August 14, 2017, 12:00 AM IST
మాస్ దర్శకులు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాలు చిరంజీవి , బాలకృష్ణ , మహేష్ బాబు లతో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . అసలు చిరంజీవి 151 వ సినిమానే బోయపాటి శ్రీను చేయాల్సి ఉంది కానీ సురేందర్ రెడ్డి చరణ్ తో చేసిన '' ధృవ '' సినిమా బాగా నచ్చడంతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని అతడితో చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు . సురేందర్ రెడ్డి తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా కంప్లీట్ చేసాక బోయపాటి తో సినిమా చేయనున్నాడు .
 

అలాగే బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో సింహా , లెజెండ్ చిత్రాలు వచ్చాయి వాటి తర్వాత బాలయ్య వందో సినిమా బోయపాటి నే చేయాలి కానీ క్రిష్ తెచ్చిన కథ నచ్చడంతో గౌతమీపుత్ర శాతకర్ణి చేసాడు . కట్ చేస్తే ఇప్పుడు కే ఎస్ రవికుమార్ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా చేయనున్నాడు బాలయ్య . ఇక మహేష్ విషయానికి వస్తే ....... మహేష్ కూడా తన సినిమాలతో బిజీ గా ఉన్నాడు ఈ ఇద్దరు అయితే సినిమా చేయాలనీ అనుకున్నారు కానీ అది 2019 లోనే సాధ్యం అవుతుందనుకుంటా ను . ఎందుకంటే చిరంజీవి , బాలకృష్ణ లతో సినిమాలు చేశాకే మహేష్ తో సినిమా చేయనున్నాడు బోయపాటి . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..