Home Headlines అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా
TOLLYWOOD
 HEADLINES

అల్లు అర్జున్ ఆ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా

Murali R | Published:October 3, 2017, 10:23 AM IST
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు , తమిళ ద్విభాషా చిత్రం చేయాల్సి ఉంది. అయితే దాని తర్వాత ఏంటి అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. జై లవకుశ బ్లాక్ బస్టర్ అయితే బాబీ తో ఓ సినిమా చేయాలనుకున్నాడు కానీ దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అల్లు అర్జున్.

జై లవకుశ నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది కానీ ఇంకా బయ్యర్లకు లాభాలు రావాలంటే మరో 20 కోట్ల షేర్ రావాలి. బాక్సాఫీస్ దగ్గర సరైన పెద్ద సినిమా లేదు కాబట్టి 20 కోట్ల షేర్ రాబట్టేలా ఉంది దాంతో బాబీ కి అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాడేమో అన్న మాటలు వినబడుతున్నాయి. ఎన్టీఆర్ చరిష్మా తోనే జై లవకుశ భారీ వసూళ్లు సాధిస్తోంది. దర్శకుడి ప్రతిభ అంతంత మాత్రమే దాంతో అల్లు అర్జున్ కాస్త ఆలోచిస్తున్నాడట . ఒకవేళ అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తే మరో స్టార్ హీరోతో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ లభించినట్లే ! అప్పుడు దాన్ని మరింత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బాబీ.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..