Home Headlines నాని ని మెచ్చుకున్న కొరటాల శివ
TOLLYWOOD
 HEADLINES

నాని ని మెచ్చుకున్న కొరటాల శివ

Tuesday July 11th 2017
నిన్ను కోరి చిత్రంలో నాని నటన చాలా బాగుందని , అతడు చేసిన ప్రతీ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేసానని మెచ్చుకున్నాడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ . నాని నటించిన నిన్ను కోరి చిత్రం ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే . నాని , నివేదా థామస్ ల నటన నన్ను కట్టి పడేసిందని , ఇకపై నివేదా థామస్ కు మరిన్ని మంచి పాత్రలు రావడం ఖాయమని ట్వీట్ చేసాడు కొరటాల శివ.

ఇప్పటికే ఈ సినిమాని చూసిన పలువురు సినీ ప్రముఖులు నాని పై , నివేదా థామస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుండగా తాజాగా కొరటాల శివ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు . ఇక అందరి ప్రశంసలు లభిస్తుండటం తో నాని చాలా సంతోషంగా ఉన్నాడు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..