Home Headlines కాదలి పై ఆశలు పెట్టుకున్న పట్టాభి
TOLLYWOOD
 HEADLINES

కాదలి పై ఆశలు పెట్టుకున్న పట్టాభి

Murali R | Published:June 14, 2017, 12:00 AM IST
దర్శక నిర్మాత పట్టాభి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం '' కాదలి ''. పూజ కే దోష , సాయి రోనక్ , హరీష్ కళ్యాణ్ లు ప్రధాన పాత్రలు పోషించిన కాదలి చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు . ఇక ఈ సినిమాని ఈనెల 16న లిమిటెడ్ థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు . వచ్చే టాక్ ని బట్టి ఆ సెంటర్ల ని మరింతగా పెంచుతారు . ఇంతకుముందు పెళ్లి చూపులు చిత్రాన్ని కూడా ఇలాగే చేసారు సురేష్ బాబు.

పట్టాభి దర్శక నిర్మాతగా మొదటి సినిమా కావడంతో సురేష్ బాబు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు . ఒకమ్మాయి ఇద్దరు అబ్బాయిల మధ్య సాగే కథ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి తప్పకుండా యూత్ ని ఆకట్టుకుంటుందని నమ్మకంగా ఉన్నారు పట్టాభి . మరి అతడి ఆశలు నెరవేరుతాయో ? లేదో ? తెలియాలంటే ఈనెల 16 వరకు ఆగాల్సింద.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..