Home Headlines వినాయక్ రాజకీయాల్లోకి రానున్నాడా
TOLLYWOOD
 HEADLINES

వినాయక్ రాజకీయాల్లోకి రానున్నాడా

Murali R | Published:August 14, 2017, 12:00 AM IST
దర్శకులు వివివినాయక్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి . మరో రెండేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వివివినాయక్ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది . మాస్ దర్శకులుగా సత్తా చాటిన వినాయక్ ఈమద్య రేసులో కాస్త వెనుకబడ్డాడు . ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

వినాయక్ తండ్రి కూడా అప్పట్లో గ్రామంలో రాజకీయాల్లో పాల్గొనేవాడు . ఆ స్పూర్తితో వినాయక్ కూడా సమాజానికి ఏదైనా చేద్దామని అనుకుంటున్నాడట . అయితే ఏ పార్టీలో చేరతాడు ? అసలు రాజకీయాల్లోకి వస్తాడా ? లేక మనకెందుకు లే అని రాజకీయాలకు దూరంగా ఉంటాడా చూడాలి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..