Home Headlines డిస్కో శాంతి మేనకోడలు క్షేమం
TOLLYWOOD
 HEADLINES

డిస్కో శాంతి మేనకోడలు క్షేమం

Murali R | Published:September 17, 2017, 12:00 AM IST
దివంగత నటుడు శ్రీహరి భార్య అయిన డిస్కో శాంతి మేన కోడలు ఆచూకీ ఎట్టకేలకు లభించింది . ఈనెల 8వ తారీఖున చెన్నై లో పాఠశాల కు వెళ్లిన డిస్కో శాంతి మేనకోడలు అప్రినా కనిపించకుండా పోయింది దాంతో ఆమె తల్లిదండ్రుల తో పాటుగా డిస్కో శాంతి కుటుంబం అలాగే ప్రకాష్ రాజ్ మాజీ భార్య లలిత కుమారి కుటుంబం శోక సంద్రం లో మునిగిపోయింది . తెలిసిన వాళ్ళ ని అందరినీ సంప్రదించిన తర్వాత పోలీసులను ఆశ్రయించారు . దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు.

ఒకవైపు పోలీసుల దర్యాప్తు మరోవైపు అప్రినా కుటుంబం వెదుకులాట ప్రారంభించడంతో ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత అప్రినా ఆచూకీ లభించింది . అయితే ఆమె ఎక్కడ ఉంది , అన్న విషయాన్నీ స్పష్టం చేయలేదు కానీ క్షేమంగానే ఉన్నట్లు మాత్రం స్పష్టం చేసారు . అప్రినా ఇంటర్మీడియట్ చదువుతోంది , చదువుకోవడానికి వెళ్లిన అమ్మాయి కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం తీవ్ర సంఘర్షణకు లోనయ్యింది . మొత్తానికి అప్రినా ఆచూకీ లభించడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..