Home Headlines అల్లు అర్జున్ సినిమా మలయాళంలో
TOLLYWOOD
 HEADLINES

అల్లు అర్జున్ సినిమా మలయాళంలో

Monday August 14th 2017
అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి స్టార్ డం ఉన్న విషయం తెలిసిందే , దాంతో అల్లు అర్జున్ ప్రతీ సినిమాని మలయాళంలో డబ్ చేస్తుంటారు . తాజాగా డీజే దువ్వాడ జగన్నాథం చిత్రాన్ని '' ధ్రువ రాజా జగన్నాథ '' పేరుతో రిలీజ్ చేసారు . సెన్సార్ అనుకున్న సమయానికి కాకపోవడం వల్ల ఆలస్యంగా ఈనెల 11న రిలీజ్ అయ్యింది . ఇక రివ్యూ లు తెలుగు లో లాగే మలయాళంలో కూడా యావరేజ్ గానే వచ్చాయి.

అయితే కలెక్షన్లు మాత్రం బాగానే వస్తున్నాయి . మూడు రోజుల్లోనే కోటిన్నర వరకు రాబట్టాడు అల్లు అర్జున్ . ఓ డబ్బింగ్ సినిమాకు మూడు రోజుల్లో కోటిన్నర రావడం మామూలు విషయం కాదు ఎందుకంటే అల్లు అర్జున్ కు అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ వసూళ్లు వచ్చాయి . ఇదే జోరు కొనసాగితే ఆ సినిమా కొన్న వాళ్లకు లాభాలు రావడం ఖాయం.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..