Home Headlines శశికళ ని దోషిగా తేల్చారు
TOLLYWOOD
 HEADLINES

శశికళ ని దోషిగా తేల్చారు

Tuesday February 14th 2017
తమిళనాట గతవారం రోజులుగా సాగుతున్న తీవ్ర ఉత్కంట కు తెరపడనుంది . మొత్తానికి సుప్రీమ్ కోర్టు శశికళ ని దోషిగా తేల్చడం తో ముఖ్యమంత్రి పీఠం పై పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము అయ్యాయి . శశికళ ని దోషిగా తేల్చడమే కాకుండా నాలుగేళ్ళ శిక్ష ని కూడా ఖరారు చేసింది అంతేకాదు వెంటనే శశికళ లొంగి పోవల్సిందిగా సుప్రీమ్ కోర్టు ధర్మాసనం ఆదేశించింది , దాంతో తమిళనాట జరుగుతున్న డ్రామాకు తెరపడింది . శశికళ దోషిగా తేలడంతో పన్నీరు సెల్వం కు మరింతగా మార్గం సుగమం అయ్యింది.

శశికళ కు ఏ రకంగా చూసిన ముఖ్యమంత్రి పదవి రావడం అసాధ్యం ఎందుకంటే శిక్ష పడిన తర్వాత ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు కాబట్టి శశికళ ఆశలపై సుప్రీం కోర్టు నీళ్ళు చల్లినట్లే . ఇక మిగిలింది పన్నీరు సెల్వం  ముఖ్యమంత్రి కావడమే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..