Home Headlines ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన హీరో
TOLLYWOOD
 HEADLINES

ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన హీరో

Murali R | Published:August 11, 2017, 12:00 AM IST
తమిళ స్టార్ హీరో విజయ్ తన అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు . ఇటీవల ఓ మహిళా జర్నలిస్ట్ షారుఖ్ నటించిన '' జబ్ హ్యారీ మెట్ సజల్ '' సినిమా చూసింది అయితే ఆ సినిమా నచ్చకపోవడంతో విజయ్ గతంలో నటించిన '' సురా '' సినిమాలా చెత్తగా ఉందని పోస్ట్ పెట్టింది ధన్య రాజేంద్రన్ అనే మహిళా జర్నలిస్ట్ . దాంతో మా హీరో సినిమాని అవమానించడమే కాకుండా విజయ్ ని కూడా అవమానిస్తావా ? అంటూ విజయ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ధన్య రాజేంద్రన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు పోస్ట్ చేసారు.

ఆ బూతులు హర్ట్ అయిన ధన్య రాజేంద్రన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది . ఈ విషయం విజయ్ కి తెలియడంతో స్పందించి తన అభిమానులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు . ఒక మహిళ తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు గౌరవించాల్సింది పోయి అగౌరవమైన పోస్ట్ లు పెడతారా పైగా నా అభిమానులు అని చెప్పుకొని ...... ఇలాంటి అభిమానులు నాకు అవసరం లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు విజయ్.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..