Home Headlines హమ్మయ్య ! ప్రభాస్ కు హీరోయిన్ దొరికింది
TOLLYWOOD
 HEADLINES

హమ్మయ్య ! ప్రభాస్ కు హీరోయిన్ దొరికింది

Tuesday August 15th 2017
ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభమై చాలాకాలం అయ్యింది కానీ హీరోయిన్ సెట్ కాకపోవడంతో అనుకున్న రేంజ్ లో షూటింగ్ జరగలేదు కానీ ఇన్నాళ్ళకు హీరోయిన్ కష్టాలు తీరిపోయాయి . బాలీవుడ్ భామ '' శ్రద్దా కపూర్ '' ని ఎట్టకేలకు ఎంపిక చేసారు సాహో చిత్ర బృందం . ఈ విషయాన్నీ తాజాగా దృవీకరించారు . హీరోయిన్ కోసం ఎంతమంది ని వడపోశారో లెక్క కడితే అంతు చిక్కదు ఎందుకంటే ఆ లిస్టు చాలా పెద్దది మరి.

బాలీవుడ్ లో పలువురు భామలను హీరోయిన్ గా పరిశీలించినప్పటికీ చాలామంది మొదట్లో అంతగా ఆసక్తి చూపించలేదు అలాగే భారీ రెమ్యునరేషన్ ని కూడా డిమాండ్ చేసారు . అయితే ఎట్టకేలకు శ్రద్దా కపూర్ ని ఎంపిక చేసారు ప్రభాస్ సరసన , హీరోయిన్ ఎంపిక కావడంతో ఇక సాహో శరవేగంగా షూటింగ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది . తెలుగు , తమిళ , హిందీ బాషలలో సాహో రూపొందుతున్న విషయం తెలిసిందే.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..