Home Headlines భారీగా లాభాలను తెస్తున్న మహానుభావుడు
TOLLYWOOD
 HEADLINES

భారీగా లాభాలను తెస్తున్న మహానుభావుడు

Murali R | Published:October 3, 2017, 1:41 PM IST
శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు భారీగా లాభాలను తెచ్చి పెడుతోంది నిర్మాతలకు . దసరా కానుకగా సెప్టెంబర్ 29న రిలీజ్ అయిన మహానుభావుడు మొత్తం మూడు రోజుల్లో పది కోట్ల షేర్ ని సాధించి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది దాంతో ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది . మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ సరసన మెహరీన్ కౌర్ నటించగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు.

ప్రపంచ వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 7. 65 కోట్ల షేర్ ని రాబట్టాడు మహానుభావుడు . అలాగే ఓవర్సీస్ , కర్ణాటక ,రెస్ట్ ఆఫ్ ఇండియా లలో మరో రెండున్నర కోట్ల షేర్ వసూల్ చేసింది దాంతో మొత్తంగా 10 కోట్లకు పైగా షేర్ ని కేవలం మూడు రోజుల్లోనే వసూల్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు శర్వానంద్ . వరుసగా అగ్ర హీరోలతో పోటీపడుతూ సక్సెస్ లు కొడుతున్నాడు శర్వానంద్ . యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి కేవలం మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి రావడంతో ఆ చిత్ర బృందం విజయోత్సవ వేడుక కూడా నిర్వహించింది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..