Home Headlines స్పైడర్ కు నష్టాలు తప్పవా
TOLLYWOOD
 HEADLINES

స్పైడర్ కు నష్టాలు తప్పవా

Murali R | Published:September 29, 2017, 2:58 PM IST
మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం తెలుగు . తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో నిర్మితమైంది . అలాగే భారీ ఎత్తున బిజినెస్ కూడా జరిగింది . కట్ చేస్తే సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఆ సినిమాని కొన్న బయ్యర్లు భయపడిపోతున్నారు ఎందుకంటే నష్టాలు వచ్చేలా ఉన్నాయి స్పైడర్ కు . ఆ నష్టాలు తక్కువ మోతాదులో అయితే ఫరవాలేదు కానీ భారీగా నష్టపోవాల్సి వస్తే మాత్రం దాన్ని భరించడం కష్టం కాబట్టి నిలువెల్లా వణికిపోతున్నారు బయ్యర్లు.

స్పైడర్ ఈనెల 27న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . భారీ ఎత్తున రిలీజ్ అయిన సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది లక్కీ గా దసరా సెలవులు తోడవడంతో మంచి వసూళ్లు వస్తున్నాయి కానీ భారీ వసూళ్లు మాత్రం రావడం లేదు . దాంతో ఎక్కువ మొత్తానికి కొన్న వాళ్ళు భయపడుతున్నారు . ఇప్పటికే మహేష్ బ్రహ్మోత్సవం తో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు , ఇక ఇప్పుడేమో స్పైడర్ దెబ్బ పడింది . దాంతో మహేష్ కు కొంత ఇబ్బందే కెరీర్ పరంగా . స్పైడర్ ని కొన్నవాళ్లకు 50 నుండి 70 కోట్ల నష్టం రావచ్చని అంచనా వేస్తున్నారు.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..