Home Headlines బాహుబలి అతడికి నచ్చలేదట
TOLLYWOOD
 HEADLINES

బాహుబలి అతడికి నచ్చలేదట

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST
గత ఏడాది రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన బాహుబలి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ . బాహుబలి లో అసలు కథ లేదని అలాగే డైలాగ్స్ కానీ పాటలు కానీ పెద్దగా ఆకట్టుకునేలా లేవని పైగా యాక్షన్ సీన్స్ లో గ్రాఫిక్స్ తీసేస్తే అసలు సినిమా ఏముందని విమర్శలు ఎక్కుపెట్టాడు . ఆరోజుల్లో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా విటలాచార్య గొప్ప గొప్ప సినిమాలు చేసాడని కొనియాడారు . ఇటీవల ఓ మీడియా సంస్థ తో మాట్లాడుతూ బాహుబలి పై విధంగా స్పందించాడు కైకాల . ఎన్టీఆర్ తో తనకున్న అనుభందాన్ని పంచుకున్నాడు కైకాల సత్యనారాయణ . ఇక బాహుబలి విషయానికి వస్తే బాక్సాఫీస్ ని బద్దలు కొట్టినప్పటికీ విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి . 
n

 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..