Home Headlines మరణించిన యంగ్ హీరో
TOLLYWOOD
 HEADLINES

మరణించిన యంగ్ హీరో

Murali R | Published:October 4, 2017, 10:53 AM IST
యంగ్ హీరో గ్యాంగ్రిన్ వ్యాధితో మరణించడంతో కన్నడ చిత్రపరిశ్రమ షాక్ కి గురయ్యింది . కన్నడ హీరోగా రాణిస్తున్న యువ హీరో రాకేష్ (27) నిన్న రాత్రి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో మరణించాడు . ఆశారాణి - నాగేష్ అనే దంపతుల ముద్దుల కుమారుడు ఈ రాకేష్ . తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటీనటులు కావడంతో వాళ్ళ వారసత్వాన్ని కొనసాగిస్తూ సినిమాల్లోకి వచ్చాడు రాకేష్ . '' పపూసీ కామెడీ '' తో ఫేమస్ అయిన రాకేష్ గతకొంత కాలంగా గ్యాంగ్రీన్ అనే  వ్యాధితో బాధపడుతున్నాడు.

దాంతో రెండు నెలల క్రితం చికిత్స తీసుకున్నాడు , కానీ తగ్గినట్లే తగ్గి మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టడంతో సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చేరాడు . కానీ అప్పటికే వ్యాధి బాగా ముదిరిపోవడంతో నిన్న రాత్రి కన్నుమూశాడు . రాకేష్ మరణవార్త కన్నడ చిత్రపరిశ్రమ ని కుదిపేసింది . ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు ఇలా అర్దాంతరంగా చనిపోవడం వాళ్ళని కలిచి వేసింది . రాకేష్ హీరోగా నటించిన '' ధూమపాన '' అనే చిత్రం ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..