Home Headlines కొరటాల శివ చరణ్ తో సినిమా చేయడా
TOLLYWOOD
 HEADLINES

కొరటాల శివ చరణ్ తో సినిమా చేయడా

Murali R | Published:August 11, 2016, 12:00 AM IST

మిర్చి సూపర్ హిట్ తర్వాత రాంచరణ్ తేజ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆల్రెడీ ఓ సినిమా స్టార్ట్ అయ్యింది ,అయితే ప్రారంభోత్సవం అయితే జరుపుకుంది కానీ రెగ్యులర్ షూటింగ్ జరుగకుండానే ఆ సినిమా ఆగిపోయింది . దాంతో కొంతకాలం కాలిగానే ఉన్నాడు కొరటాల ఆ తర్వాత మహేష్ తో శ్రీమంతుడు చేసి నాన్ బాహుబలి రికార్డులను అన్నింటినీ బద్దలు కొట్టాడు దాంతో కొరటాల కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . శ్రీమంతుడు తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రం చేస్తున్నాడు అది పూర్తికాకముందే మళ్ళీ మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . నిజానికి చరణ్ తో సినిమా చేయాలి కొరటాల శివ కానీ చరణ్ మాత్రం ధృవ చేస్తూ దాని తర్వాత మరో సినిమాని కూడా లైన్లో పెట్టుకున్నాడు దాంతో చరణ్ కోసం ఎదురు చూడకుండా మహేష్ తో  తదుపరి సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు . అంటే మరో ఏడాది లేదా రెండేళ్ళ పాటు కొరటాల శివ - చరణ్ ల కాంబినేషన్ లో సినిమా ఊహించడం కష్టమే . ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తప్ప . 

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..