Home Headlines సంక్రాంతి బరినుండి తప్పుకుంటున్న మహేష్
TOLLYWOOD
 HEADLINES

సంక్రాంతి బరినుండి తప్పుకుంటున్న మహేష్

Murali R | Published:October 3, 2017, 2:05 PM IST
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే . కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు . మొన్నటి వరకు కూడా అదే ఫిక్స్ అయ్యారు కట్ చేస్తే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ సంక్రాంతి బరి నుండి తప్పుకున్నాడట . సంక్రాంతి కాకుండా వేసవిలో సినిమాని రిలీజ్ చేసేట్లుగా ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి కి వస్తున్నట్లు ప్రకటించాయి కాబట్టి ఆదర బాదరగా సినిమా చేసి అప్పుడు రిలీజ్ చేసి ఇబ్బంది పడేకంటే కాస్త నిదానంగా సినిమా చేసి మంచి సమయం తీసుకొని సోలో గా వస్తే బెటర్ అని డిసైడ్ అయ్యారట భరత్ అనే నేను చిత్ర బృందం . అందుకే ఈనెల 6నుండి జరగాల్సిన ఫారిన్ షెడ్యూల్ కూడా కొద్దిరోజులు వాయిదా వేశారట . కైరా అద్వానీ మహేష్ సరసన నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చుతున్నాడు . శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల శివ - మహేష్ బాబు ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..